Tuesday 30 November 2021

పాటలు.. ఆయన చెప్పే మాటలే కాదు.. సిరివెన్నెల వ్యక్తిత్వం అలాంటిది: నాగార్జున ఎమోషనల్

ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఆయన ఇక లేరనే వార్త సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో సిరివెన్నెల కన్నుమూశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచగా పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెలకు కడసారి చూసేందుకు వచ్చిన అక్కినేని .. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సిరివెన్నెలతో ఎప్పటినుంచో స్నేహం ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అని తీయగా పలకరించేవారని చెబుతూ 'క్రిమినల్' సినిమాలో 'తెలుసా మనసా పాట' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు కలిసినా చాలా సరదాగా మాట్లాడేవారు. ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తొస్తోంది. అదే క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట. ఈ సాంగ్ నా కెరీర్ లోనే మరిచిపోలేనిది. ఆ పాటను ఆయన పక్కన కూర్చొని మరీ రాయించుకున్నా. ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఆ స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇవే మాటలు, పాటలు వినిపిస్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అని నాగార్జున అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D8W86w
v

Radhe shyam Update: స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ మూమెంట్స్

యంగ్ రెబల్ స్టార్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా . పాన్‌ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్‌‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. కోవిడ్‌తో పాటు పలు కారణంలతో రాధే శ్యామ్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయా? అని ఇన్నాళ్లు ఎదురుచూసిన రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఇప్పుడు ఒక్కో అప్‌డేట్ వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని పోస్టర్స్, ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన టీజర్ ద్వారా అభిమానులకు పూనకాలు తెప్పించిన యూనిట్.. తాజాగా ప్రేమ బాణం విసురుతూ రాధే శ్యామ్ లవ్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమోతోనే ఈ సాంగ్‌పై ఆసక్తి పెరగగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి లవ్ బర్డ్స్ మనసు దోచుకున్నారు. ఈ పాటలో ప్రభాస్‌, చాలా అందంగా కనిపించడమే గాక వాళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ యమ కిక్కిచ్చాయి. ఇక ఈ వీడియోను అటు ప్రభాస్, ఇటు పూజా హెగ్డే తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాధా కృష్ణ. యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D56owB
v

ఫిలిం చాంబర్‌లో సిరివెన్నెలకు సినీ ప్రముఖుల నివాళి.. కన్నీటి పర్యంతమైన తనికెళ్ళ భరణి

సాహిత్య దిగ్గజం ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కలం నెలకొరిగిందని తెలిసి సినీ ప్రముఖులు షాకయ్యారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. సిరివెన్నెల మరణ వార్త వినగానే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారం వ్యక్తం చేశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌‌లో ఉంచారు. ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిరివెన్నెలను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తగా.. పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతూ సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మహేష్ బాబు, తనికెళ్ళ భరణి, అల్లు అర్జున్, చిరంజీవి, రావు రమేశ్, వెంకటేష్, మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సిరివెన్నెల భౌతిక కాయాన్ని చూశాక సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతీ మూవీస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగుజాతి ఉన్నంత వరకు ఉంటుందని కన్నీటితో తడిసిన ముఖంతో చెప్పారు తనికెళ్ళ భరణి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G6GhHx
v

సాహితీ హిమాలయం సీతారాముడు : ఇళయరాజా

తెలుగు సినీ పాట‌ల దిగ్గ‌జ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంపై యావ‌త్ సినీ లోకం సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌తో అనుబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన పాట‌ల‌కు అంద‌మై బాణీల‌ను అందించిన సంగీత ద‌ర్శ‌కుడు మాస్ట్రో ఇళ‌య‌రాజా. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఎన్నో విన‌సొంపైన పాట‌లు సంగీతాభిమానుల‌ను అల‌రించాయి. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఆ పాట‌లు ఎవ‌ర్‌గ్రీన్‌. తామిద్ద‌రి మ‌ధ్య వృత్తిప‌ర‌మైన పోటీ గురించి.. సిరివెన్నెల‌తో త‌న‌కున్న బంధాన్ని క‌వితాత్మ‌కంగా తెలియ‌జేశారు ఇసై జ్ఞాని ఇళ‌యరాజా. వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతో అందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు.. ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల "పదముద్రలు " నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి... రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు...రేపు రాబోయే " రంగమార్తాండ " కూడా.. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో.....!! సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు... పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి నాతో శివ తాండవం చేయించాయి.. "వేటూరి" నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... "సీతారాముడు" నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..!! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. " పాటకోసమే బ్రతికావు, బ్రతికినంత కాలం పాటలే రాసావు.... ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్న... -


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rlnHqZ
v

షాకిచ్చిన జక్కన్న.. RRR ట్రైల‌ర్ వాయిదా .. నిరాశలో నంద‌మూరి, మెగాభిమానులు..!

ఎంటైర్ ఇండియన్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నంద‌మూరి, మెగాభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూడ‌టం ప్రారంభించారు. అయితే యూనిట్ అందరికీ మరోసారి షాక్ ఇచ్చింది. ట్రైలర్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు కారణం ఎంటనేది చిత్ర యూనిట్ తెలియజేయలేదు. అయితే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు RRR ట్రైల‌ర్ ఇంకా రెడీ కాలేద‌ట‌. అనుకున్న ఔట్‌పుట్ వ‌చ్చే వర‌కు జ‌క్క‌న్న కాంప్ర‌మైజ్ కాడు. కాబ‌ట్టి ట్రైల‌ర్ విడుద‌ల ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు. కానీ మంచి ట్రైల‌ర్‌ను క‌ట్ చేయాల‌ని RRR టీమ్ ప్లాన్ చేసింద‌ట‌. ఈ కార‌ణంగా ట్రైల‌ర్‌ను పోస్ట్ పోన్ చేసింది. దీంతో RRR ప్రేమికులు, నందమూరి, మెగాభిమానులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. కానీ ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న RRR సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు పోరాట యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో అనే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో సినిమా రూపొందింది. టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టిస్తుండ‌టంతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించ‌డం కూడా నటించారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింద‌ని, 3 గంట‌ల 6 నిమిషాల వ్య‌వ‌ధి సినిమాకు ర‌న్‌టైమ్‌గా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల బడ్జెట్‌తో సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఓవ‌ర్‌సీస్ స‌హా సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు RRR టీమ్ వెళ్లి ప్ర‌మోట్ చేయ‌నుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3obL0Bi
v

Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి గల కారణాలు చెప్పిన డాక్టర్ !

టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం కన్నుమూశారు. దాదాపు వారం ముందే ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో హాస్పిట‌ల్‌లో చేరారు. నిమోనియా కార‌ణంగా హాస్పిట‌ల్‌లో సిరివెన్నెల చేరార‌న్నారు. అయితే మంగ‌ళ‌వారం ప‌రిస్థితి విష‌మంగా మార‌టం, ఆయ‌న క‌న్నుమూయ‌టం అన్నీ అలా జ‌రిగిపోయాయి. అస‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఏమైంది? బావున్నాడనుకున్న వ్య‌క్తి ఎందుకు హ‌ఠాత్తుగా చ‌నిపోయారు? అని చాలా మంది మ‌దిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌. అయితే సిరివెన్నెల‌కు వైద్యం అందించిన కిమ్స్ ఎండి భాస్క‌ర్‌రావు ఈ విష‌యంపై మాట్లాడారు. ‘‘ ఆరేళ్ల క్రితం శాస్త్రిగారికి క్యాన్సర్ కారణంగా సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వ‌చ్చింది. త‌ర్వాత బైపాస్ స‌ర్జరీ జ‌రిగింది. వారం రోజుల ముందు మళ్లీ ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అని వ‌స్తే.. దాంట్లో కూడా సగం తీసేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. త‌ర్వాత ఆరోగ్యప‌రంగా కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న్ని అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. చికిత్స‌లో బాగంగా ప్రికాస్ట‌మీ చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం. మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. గాలి తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఎక్మోమిష‌న్‌పై పెట్టాం. ఆల్ రెడీ బైపాస్ స‌ర్జ‌రీ కావ‌డం, కాన్స‌ర్ ఉండ‌టం, కిడ్నీ డ్యామేజ్ కావ‌డంతో ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీర‌మంతా పాకింది. దీంతో ఆయ‌న మంగ‌ళ‌వారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’’ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ఓ గొప్ప ర‌చ‌యిత‌ను కోల్పోవ‌డం అనేది తెలుగు సినిమా దుర‌దృష్టం. ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. యువ‌తకు స్ఫూర్తినిచ్చేలా, చైతన్యాన్ని మేలుకొలిపేలా పాట‌లు రాయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా ఎంత చ‌క్క‌గా పాట‌లు రాయ‌గ‌ల‌రో.. అంతే విద్వ‌త్ ఉన్న పాట‌లు రాయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. తెలుగు సినిమా పాట‌ను ఎవ‌రైనా త‌క్కువ చేస్తే ఆయ‌న ఒప్పుకునేవారు కాదు. ఆయ‌న‌లో మంచి గాయ‌కుడు ఉన్నారు. క‌ళ్లు సినిమా కోసం తెల్ల‌రింది లేగండోయ్‌.. అనే పాట‌ను కూడా ఆయ‌న పాడి అల‌రించారు. అలాగే ఆయ‌న మంచి న‌టుడు కూడా. గాయం, మ‌న‌సంతా నువ్వే స‌హా ప‌లు చిత్రాల్లో ఆయ‌న వెండితెర‌పై క‌నిపించి న‌టించి ఆక‌ట్టుకున్నారు. మ‌ళ్లీ ఆయ‌న‌లాంటి రైట‌ర్ పుడ‌తాడా? అని తెలుగు సినీ ఇండ‌స్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. బుధ‌వారం సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3loL5jw
v

Amitab Bachchanపై జయాబచ్చన్ ఫిర్యాదు

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బిపై ఆయ‌న స‌తీమ‌ణి, న‌టి జ‌యాబ‌చ్చ‌న్ ఫిర్యాదు చేశారు. ఇంత‌కీ ఆమె ఎక్క‌డ‌, ఎందుకు అమితాబ్‌పై ఫిర్యాదు చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే..అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌ప‌తి’.ఇప్ప‌టి వ‌ర‌కు 13 సీజ‌న్స్‌ను ఈ షో పూర్తి చేసుకుంటోంది. 1000 ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ షోలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌నే హాట్ సీట్‌పై కూర్చోపెట్ట‌డానికి అమితాబ్ బ‌చ్చ‌న్ ఆహ్వానించారు. ఇంత‌కీ హాట్ సీట్‌పై కూర్చున్న‌దెవ‌రో కాదు..ఒక‌రేమో అమితాబ్ కుమార్తె శ్వేతా బ‌చ్చ‌న్‌, మ‌రొక‌రు మ‌న‌వ‌రాలు న‌వేలీ నందా. అస‌లు ఈ ప్రోగ్రామ్‌లో అస‌లు ట్విస్ట్ అమితాబ్ స‌తీమణి జ‌యా బ‌చ్చ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడ‌ట‌మే. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోనీ త‌మ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసింది. ఇక్క‌డ జ‌రిగిన మ‌రో గ‌మ్త‌త్తు ఏంటంటే అమితాబ్ బ‌చ్చ‌న్‌పై జ‌యా బచ్చ‌న్ ఫిర్యాదు చేశారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ‌రు మీరు అనేది స‌ద‌రు కంప్లైంట్‌. త‌న‌పై కంప్లైంట్ చేసింది ఇంట్లోని స‌భ్యులు. ముఖ్యంగా భార్య‌. ఇంకేం చేస్తాడు. అమితాబ్ త‌ప్ప‌కుండా ఏదో ఒక వివ‌ర‌ణ ఇచ్చుకోవాలి క‌దా. అమితాబ్ స‌మాధానం ఇచ్చారు. అయితే త‌న‌దైన శైలిలో కామెడీగా ఆయన ఆన్స‌ర్ వ‌చ్చేసింది.. ఇంట‌ర్నెట్ పోతూ వ‌స్తుంటే నేనేం చేయ‌ను అన్నారు బిగ్‌బి. అయితే జ‌యా బ‌చ్చ‌న్ దానికి మాట్లాడుతూ ట్విట్ట‌ర్‌లో ఫొటోలు, మెసేజ్‌లు మాత్రం పెడ‌తుంటారు అని అంది. ఇక లాభం లేద‌నుకుని అమితాబ్ టాపిక్ మార్చే ప్ర‌య‌త్నం చేశారు. జ‌య‌.. నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నారు. ఇక జ‌యా బ‌చ్చ‌న్ దాని కౌంట‌ర్ ఇచ్చింది. మీరు అబద్దాలు చెప్పేట‌ప్పుడు అందంగా ఉండ‌రు అని. కేబీసీ 13లో ఎంత కీల‌క‌మైన ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 3న రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ప్రసారం కానుంది. మ‌రి కుటుంబ స‌భ్యులతో అమితాబ్ మ‌ధ్య ఇంకేలాంటి అనుబంధం ఉంద‌నే విష‌యం తెలియాలంటే మాత్రం స‌ద‌రు ఎపిసోడ్ చూసేయాల్సిందే. మ‌రో వైపు అమితాబ్ త‌న‌యుడు, హీరో అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్ దంపతులు త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వారికి ఆరాధ్య అనే పాప ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై బ‌చ్చ‌న్ కుటుంబ స‌భ్యులు ఏమీ రియాక్ట్ కాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31h3Dev
v

సిరివెన్నెల మ‌ర‌ణం సంతాపాన్ని తెలియజేసిన ఎన్టీఆర్, చరణ్

సీతారామ‌శాస్త్రికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఉన్న అనుబంధంసినీ ప‌రిశ్ర‌మ ఉన్నంత కాలం అలాగే నిలిచిపోతుంది. అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూసినా, ఆయ‌న రచ‌న‌ల‌తో మ‌న మ‌న‌సుల్లో అలాగే ఎప్ప‌టికీ నిలిచిపోతారు. మంగ‌ళ‌వారం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్లో క‌న్నుమూశారు. సిరివెన్నెల‌ ఇక లేర‌నే విష‌యం తెలిసిన టాలీవుడ్ షాక్ అయ్యింది. ఆయ‌న మృతిపై టాలీవుడ్ ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, అభిమానులు త‌మ సంతాపాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన RRR సినిమాలో దోస్తీ సాంగ్‌ను సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ర‌చించారు. అలాంటి సీనియ‌ర్ రైట‌ర్ మ‌ర‌లిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంపై రామ్‌చ‌ర‌ణ్ సందిస్తూ ‘‘సీతారామశాస్త్రిగారు ఇక లేరు అనే విష‌యం తెలియ‌గానే షాక‌య్యాను. చాలా బాధేసింది. RRR, సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల గురించి ఆయ‌న చెప్పిన మాట‌లు నాకెప్ప‌టికీ గుర్తుండిపోతాయి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు, సాహిత్యానికి ఆయ‌న చేసిన సేవ‌లు వెల క‌ట్ట‌లేనివి. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. ఎన్టీఆర్ స్పందిస్తూ..‘‘ గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. RRR సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. వీరిద్ద‌రి స్నేహం గురించి తెలియజేసే సాంగ్‌ను సీతారామ‌శాస్త్రి రాశారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలియ‌జేశారు. అంతే కాకుండా సీతారామ‌శాస్త్రితో త‌న‌కున్న అనుబంధాన్ని జ‌క్క‌న్న గుర్తుకు చేసుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ కూడా చేశారు. న‌వంబ‌ర్ 24న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి నిమోనియాతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్‌లో చేరారు. ఆ విష‌యం బ‌య‌ట‌కు రెండు రోజుల త‌ర్వాతే తెలిసింది. సిరివెన్నెల‌కు ఏమ‌య్యిందోన‌ని ఆయ‌న ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్ ప‌డ్డారు. వారి భ‌యం నిజ‌మైంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో సిరివెన్నెల మంగ‌ళ‌వారం క‌న్నుమూసి అంద‌రినీ శోక సంద్రంలో ముంచెత్తి వెళ్లారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EabSaE
v

సిరివెన్నెల మరణం సినీ పరిశ్రమకే కాదు..తెలుగు సాహిత్యానికి తీరని లోటు : పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ర‌చ‌యిత‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆయ‌న వేసిన ముద్ర చిర‌స్మ‌ర‌ణీయం. అలాంటి రైట‌ర్ ఇక లేర‌నే వార్త తెలుసుకున్న యావ‌త్ తెలుగు సినీ ప్ర‌పంచం శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ సెల‌బ్రిటీలు మ‌ర‌ణంపై త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ‘‘వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్‌క‌వి శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు. బ‌ల‌మైన భావాన్ని, మాన‌వ‌త్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాట‌ల్లో పొదిగి జ‌న సామాన్య గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత ర‌చ‌న చేసిన అక్ష‌ర త‌ప‌స్వి శ్రీ శాస్త్రిగారు. తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన ఆ మ‌హ‌నీయుడు ఇకలేరు అనే వార్త‌ను జీర్ణించుకోవ‌డం క‌ష్టం. అస్వ‌స్థ‌త‌తో హాస్పిట‌ల్‌లో చేరిన శాస్త్రిగారు. కోలుకుంటారు అని భావించాను. ఇంత‌లోనే ఈ విషాద వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. సీతారామ‌శాస్త్రిగారి మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు.. యావ‌త్ తెలుగు సాహితీ లోకానికి తీర‌ని లోటు. శాస్త్రిగారిని కేవ‌లం సినీ గీత ర‌చ‌యిత‌గా చూడ‌లేము. ఆయ‌న ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్త‌మై ఉంటుంది. నేను న‌టించిన సుస్వాగ‌తంలో ఏ స్వ‌ప్న లోకాల సౌంద‌ర్య రాశి.. పాట కావ‌చ్చు. తొలిప్రేమ‌లో ఈ మ‌న‌సే.. పాట కావ‌చ్చు. అల‌తి అల‌తి ప‌దాల‌తో ప్రేమ భావ‌న‌లు చెప్పారు. ప్రేమ గీతాలు, అల్ల‌రి పాటలు ఏవైనా అంత‌ర్లీనంగా మంచి చెప్పాల‌ని ప‌రిత‌పించారు. ఓ క‌విగా స‌మాజాన్ని నిల‌దీసి, బాధ్య‌త‌లు గుర్తు చేసిన వారు. నిగ్గ‌దీసి అడుగు, అర్ధ శ‌తాబ్ద‌పు అజ్ఞానాన్ని లాంటి పాట‌లు వింటే స‌మాజాన్ని నిత్య చైత‌న్యంగా ఉంచాల‌ని శ్రీ శాస్త్రిగారు ఎంత ప‌రిత‌పించారు అర్థ‌మవుతుంది. ఎవ‌రో ఒక‌రు ఎప్పుడో అపుడు.. ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా ఓట‌మి..లాంటి పాట‌ల్లో ఆశావాదాన్ని అందించారు. భావి త‌రాల‌కు మ‌న సాహితీ సంప‌ద‌ను వార‌స‌త్వంగా ఇవ్వాల‌ని ప‌రిత‌పించారు. శాస్త్రిగారి రచ‌న‌ల్లో వైవిధ్యాన్ని చూస్తే ఆయ‌న క‌లానికి ఎన్ని పాళిలో అని అర్థ‌మ‌వుతుంది. శ్రీ సీతారామ‌శాస్త్రిగారి మ‌ర‌ణం వ్య‌క్తిగ‌తంగా నాకెంతో తీర‌ని లోటు. నా ప‌ట్ల ఎంతో ఆప్యాయ‌త‌ను క‌న‌ప‌రిచేవారు. వారితో మాట్లాడితే సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుద‌యవాదం, సామ్య‌వాదం వ‌ర‌కు ఎన్నో అంశాల‌ను కూలంక‌షంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రిగారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, స‌ద్గ‌తులు ప్రాప్తించాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా త‌ర‌పున జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d3lg3N
v

ఇకలేరు అంటే.. ఎలా..? సిరివెన్నెల మరణంపై సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన ప్రముఖ గేయ రచయిత ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం షాకైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సాహిత్య దిగ్గజం మృతితో టాలీవుడ్ సర్కిల్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాళా తపస్వి కె. విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ రియాక్ట్ అవుతూ సిరివెన్నెల కుటుంబానికి తమ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ''తరలిపోయింది వసంతం.. ఈవేళలో నుండి చివరకు మిగిలేదీ వరకు సిరివెన్నెల (నాకు బాబాయి) గారు రాసిన ప్రతి పాటా ఎంతో గర్వంగా పాడాను. ఇక లేరు అంటే.. ఎలా?'' అంటూ సిరివెన్నెల ఫొటో షేర్ చేస్తూ ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టారు సునీత. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో సిరివెన్నెల క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. వేలాది పాట‌లు రాసి ప్రేక్ష‌కుల గుండెల్లో తన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో, స్పూర్తితో జ్వాల‌ను ర‌గిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్న కాలంలో వ‌చ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందుల‌ను సొంతం చేసుకొని సీనియ‌ర్ రైట‌ర్ వేటూరికి ప్ర‌త్యామ్నాయంగా నిలిచిన దిగ్గ‌జం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించిన సీతారామ శాస్త్రి.. కాకినాడలో ఇంటర్మీడియెట్‌ వరకు చదివి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టెలిఫోన్స్‌ శాఖలో పని చేశారు. కె. విశ్వనాథ్ అవకాశం కల్పించడంతో 'సిరివెన్నెల' సినిమాలో పాటలన్నీ రాశారు. అప్పటినుంచి ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా టాలీవుడ్‌లో స్థిరపడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p6THwc
v

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై బాలకృష్ణ స్పందన.. బాధతో కూడిన మెసేజ్

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతితో టాలీవుడ్‌ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''తెలుగు పాటను తన సాహిత్యంతో దశ దిశలా వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత గారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహాన్ని రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లోనే సిరివెన్నెల మృతదేహం ఉంచనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31h95Oo
v

సాహిత్యానికి ఇది చీకటి రోజు.. సిరివెన్నెల మరణంపై చిరంజీవి భావోద్వేగ సందేశం

ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి మెగాస్టార్ ఎమోషనల్ అవుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రీజుల క్రితం హాస్పిటల్లో జాయిన్‌ అవ్వడానికి వెళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి మద్రాసులో ఒక మంచి హాస్పి టల్‌ ఉందని, ఇద్దరం వెళదాం.. అక్కడ జాయిన్‌ అవుదురు గాని అని అన్నాను. ఆయన మిత్రమా, ఈ రీజు ఇక్క డ జాయిన్‌ అవుతాను నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారు. అలా వచ్చెస్తానని వెళ్ళిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించ లేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్నిరకాల మెరుగైన వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకు ఫోన్‌ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20నిముషాల పాటు మాట్లాడితే ఖచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను. ఆ సమయంలో వారి కుమార్తెతో కూడామాట్లాడాను మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. నన్ను సీతారామశాస్త్రి గారి కుటుంబంలో వాళ్ళు ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇద్దరూ ఒకటే వయసు వాళ్ళం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎప్పు డు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారు. తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరి గారి తర్వాత అంత గప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గప్ప రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన భాషను అర్ధం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు. అంతటి మేధావి ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరీర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలాసేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కీల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కీల్పోయినట్ట అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది.. గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వళ్ళిపోయారు. ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని 'తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కీసం' అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కానీ సిరివెన్నెలసీతారామశాస్త్రి గారు కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ గారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుళిలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్‌ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది. అలాంటి గప్ప వ్యక్తి గొప్పు కవి మళ్లీ మనకు తారసపడడం కష్టమే. ఆయన ఆ తల్లి సరస్వతీ దేవి వడిలో సేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని అన్నారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D8mg19
v

పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం రాజకీయాల్లో ఉండరు.. 2024 నాటికి జనసేన దుకాణం క్లోజ్: వేణు స్వామి సంచలనం

2024 ఎన్నికలే లక్ష్యంగా అధినేత పార్టీని బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే సొంత పార్టీని స్థాపించినప్పటికీ ఇప్పటివరకూ ఒంటిరిగా పోటీ చేసింది లేదు. టీడీపీ, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఎం-సీపీఐ ఇలా వివిధ పార్టీలతో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవి చూశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన తరుపున పోటీ చేసిన గెలిచిన ఒకే ఒక్క సీటు.. రాజోలు (రాపాక వరప్రసాద్)ని నిలుపుకోలేకపోయారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జంపింగ్ జపాంగ్‌ల జాబితాలో చేరిపోయారు. అయితే నష్టనివారణ చర్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. బీజేపీ పొత్తుతో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పవన్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంటే.. ఆయనకు రాజకీయాలు అచ్చు రావు.. త్వరలో ఆ పార్టీయే ఉండదంటూ జోస్యం చెప్పారు ప్రముఖ సినీ జోతిష్యుడు . సమంత-నాగచైతన్య విడిపోతారని.. అఖిల్‌కి పెళ్లే జరగదని.. చంద్రబాబు ఓడిపోతారని ముందే జోతిష్యం చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి.. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయయోగం లేదని అంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికలు కాదు.. వచ్చే ఎన్నికలు.. ఆ తరువాత రెండున్నర దఫాలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఉన్న పార్టీల లీడర్లు.. వాళ్ల నక్షత్రాలను బట్టి చూస్తే రాబోయే 15 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండబోతున్నారు. టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. దానికి జోతిష్యం అవసరం లేదు.. సామన్య ప్రజలు కూడా వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పేస్తారు. టీడీపీ పక్కన పెడితే జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను ఇది చెప్తే వాళ్లేదో చేస్తారనే భయం నాకు లేదు.. నేను చనిపోడానికి కూడా రెడీ. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు.. ఆయన జాతకమే అంత. ఓవైపు సినిమాలు అంటాడు.. మరోవైపు రాజకీయాలు అంటాడు. ఎక్కడా ఒకదానిపై ఉండరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సినీ సినీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rnx1dW
v

అప్పుడు కుడి భుజం పోతే ఇప్పుడు ఎడమ భుజం పోయింది.. సిరివెన్నెల మృతిపై కె. విశ్వనాథ్ ఎమోషనల్

ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఆయ‌న క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రితో కళాతపస్వి బంధం ఎంతో ప్రత్యేకమైంది. సీతారామ శాస్త్రిని టాలీవుడ్ లోకానికి పరిచయం చేసింది డైరెక్టర్ కె. విశ్వనాథ్. తన పెన్ ప‌వ‌ర్ ఏంటో తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు రుచి చూపించిన ఆయన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసి అదే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి కాగా సిరివెన్నెల సాంగ్స్ రాశాక సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయింది. అలా సిరివెన్నెలతో అలుపెరగని ప్రయాణం చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ రూపుదిద్దిన కె. విశ్వనాథ్.. ఇక సిరివెన్నెల లేరనే వార్త తెలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ''ఇది నమ్మలేని నిజం. చాల పెద్ద లాస్ నాకు. బాలసుబ్రమణ్యం పోయినపుడు కుడి భుజం పోతే సిరివెన్నెల మరణంతో ఎడమ భుజం పోయింది. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన ఒక్కసారే అంతర్దానం కావడం నమ్మశక్యంగా లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఇది చెప్పలేని ఒక సిచుయేషన్.. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేక పోతున్నా'' అని అన్నారు కె. విశ్వనాథ్. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించిన సీతారామ శాస్త్రి.. కాకినాడలో ఇంటర్మీడియెట్‌ వరకు చదివి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టెలిఫోన్స్‌ శాఖలో పని చేశారు. కె. విశ్వనాథ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EaKZ6f
v

సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్

టాలీవుడ్ ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత అనారోగ్యంతో క‌న్నుమూశారు. సినీ ప్రేమికులు, సాహిత్య ప్రేమికులు ఎంతో దుఃఖానికి లోన‌య్యే వార్త ఇది. పాట‌ల ర‌చ‌యిత‌గా తెలుగు సినిమాపై ఆయ‌న చూపిన ప్ర‌భావం ఎంత గొప్ప‌దో సినీ ప‌రిశ్ర‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తోంది. అయితే ఈ విష‌యాన్ని మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఏనాడో చెప్పేశారు. ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో అగ్ర హీరోలంద‌రూ ఉన్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ సీతారామ‌శాస్త్రి గురించి మాట్లాడుతూ ‘‘సీతారామశాస్త్రిగారి సాహిత్యం గురించి మాట్లాడేంత శక్తి నాకు లేదు. నాకున్న పదాలు సరిపోవు. ఆయ‌న సిరివెన్నెల సినిమాలో ‘విధాత త‌ల‌పున’ అనే సాంగ్‌లో ‘ప్రాగ్దిశ వేణియపైన దిన‌క‌ర మ‌యూఖ తంత్రుల‌పైన‌... ’ అనే లైన్ వినగానే తెలుగులో డిక్షనరీ ఉంటుంది. దాన్ని శ‌బ్ద ర‌త్నార‌కం అంటార‌ని తెలుసుకున్నాను. దాన్ని కొనుక్కుని ప్రాగ్దిశ‌, మ‌యూఖం అంటే ఏంట‌నే విష‌యాల‌ను తెలుసుకున్నాను. ఒక పాట‌ను ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌య్యేలా రాయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా అర్థం చేసుకోవాల‌నే ఆలోచ‌న పుట్టేలా రాయొచ్చు అని తెలియ‌జేసి తెలుగు పాట గొప్ప‌తనాన్ని పెంచిన వ్య‌క్తి సీతారామ‌శాస్త్రిగారు. తిల‌క్ రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్త‌కాన్ని చ‌దివిన‌ప్పుడు శ్రీశ్రీ మ‌హా ప్ర‌స్థానం చ‌దివిన‌ప్పుడు కొంప‌ల్లి జ‌నార్ధ‌నరావు చివ‌రి మాట‌లుంటాయి. ముఖ్యంగా అందులో ఇదిగో ఇక్క‌డ నిల‌బ‌డి అవహ‌నం చేస్తున్నాను. అందుకో నా చాచిన హ‌స్తం అని రాసుంటాడు. అవ‌హ‌నం అనే మాట వాడ‌టానికి చాలా శ‌క్తి కావాలి. అలాంటి మాట పుస్త‌కంలో రాయ‌డ‌మే క‌ష్ట‌మంటే.. అలాంటి మాట‌ల‌ను అల‌వోక‌గా సినిమా పాట‌కు తీసుకొచ్చి ప్రేక్ష‌కుడి స్థాయిని పెంచిన క‌వి. అందుక‌నే ఆయ‌న మ‌నం గౌర‌వించాలి. చిరంజీవిగారి సినిమాలో త‌ర‌లిరాద త‌నే వ‌సంతం.. త‌న ద‌రికి రాని వ‌నాల కోసం.. అనే లైన్ రాయ‌డానికి సీతారామ‌శాస్త్రిగారికి ఎంత గ‌ట్స్ ఉండాలి. దాన్ని ద‌ర్శ‌కుడితో ఒప్పించ‌డానికి, నిర్మాత సినిమాలో పెట్టించ‌డానికి ఎంత ధైర్యం ఉండాలి. ఓ ద‌ర్శ‌కుడిగా అదేంటో నాకు తెలుసు. భ‌ర‌తం ప‌ట్టి భామ్మ ఒళ్లో అనే పాట‌లో కూడా కొమ్మ‌ల్లో కుకూలు, కొండ‌ల్లో ఎకోలు.. అంత పొయెట్రీని వెంక‌టేశ్‌, దివ్య‌భార‌తి ఉండే సాంగ్‌లో రాయొచ్చు అని స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే దిగుజారుడు సాహిత్యం అని అనుకునే రోజుల్లో హీరో తాలుకు ఇమేజ్, ద‌ర్శ‌కుడి తాలుకు అర్థం లేని త‌నం, ప్రొడ్యూస‌ర్ తాలుకు వ్యాపార విలువ‌లు, ప్రేక్ష‌కుల తాలుకు అర్థం చేసుకోలేనిత‌నం మ‌ధ్య‌లోనూ ఓ కొత్త పాట‌ను ఇవ్వ‌డానికి రాత్రిళ్లు ఆయ‌న టేబుల్ మీద ఖ‌ర్చు పెట్టిన క్ష‌ణాలు, ఖ‌ర్చు చేసుకున్న జీవితం, వ‌దులుకున్న కుటుంబం విలువ నాకు తెలుసు. ఆయ‌న అర్ధ‌రాత్రి ఉద‌యించే సూర్యుడు. ప‌దాలు అనే కిర‌ణాలు.. అక్ష‌రాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడ‌టానికి బ‌య‌లుదేరుతారు. ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు ఓట‌మి అంటాడు. ప్ర‌పంచాన్ని నాకు స‌మాధానం చెప్పండ‌ని ప్ర‌శ్నిస్తాడు. మ‌నం స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌ను మ‌న మీద‌కు సంధిస్తాడు. మ‌న ఇంట్లోకొస్తాడు, మ‌న హాల్లో కూర్చుంటాడు. మ‌న బెడ్రూమ్‌లో మ‌న ప‌క్క‌నే నిలబ‌డ‌తాడు. మ‌నల్ని ప్ర‌శ్నిస్తాడు. సింధూరం సినిమాకెళ్లాను. సినిమా అయిపోయింది.. ఏదో అసంతృప్తి ఉంది.ఆ స‌మ‌యంలో ఆ సినిమా చివ‌ర‌ల్లో అర్ద శ‌తాబ్ద‌పు అజ్ఞానాన్ని స్వ‌తంత్య్రం అందామా? అనే ఒక మాట విని రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని న‌డుచుకుంటూ వెళ్లిపోతున్నాను. ఎక్క‌డికి వెళుతున్నానో నాకే తెలియ‌దు. మ‌నిషిని అంత‌లా క‌దిలించే శ‌క్తి అక్ష‌రానికి మాత్ర‌మే ఉంటుంది. ఆయ‌న సినిమా క‌వి.. ముఖ్యంగా తెలుగు సినిమా క‌వి అవ‌డం మూలంగా, ఇక్క‌డ మిగిలిపోయాడ‌నే బాధ ఉంది. ఆయ‌న సినిమా పాట‌లు రాసినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. నోబెల్ స్థాయిలో వ‌చ‌న‌స్థాయి క‌విత్వం రాసే సీతారామ‌శాస్త్రిగారు మ‌న మ‌ధ్య సినిమా క‌వి అవ‌డం మూలంగా అలా కూర్చుండిపోయాడు. తెలుగు సినిమాకు ఆయ‌న పాట రాయ‌డం ఆయ‌న దుర‌దృష్టం.. మ‌నంద‌రి అదృష్టం’’ అన్నారు త్రివిక్రమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xBGmjc
v

సిరివెన్నెల టాలెంట్‌ గుర్తించింది మొదట ఆయనే.. చిన్నప్పటి సీతారామశాస్త్రి కోరిక అదే!!

తెలుగు సినీ పాటను, అందులోని మాధుర్యాన్ని ప్రపంచానికి వినిపించి మన్ననలు పొందారు . ఆయన కలం నుంచి లిఖించబడ్డ ప్రతి అక్షరం సగటు ప్రేక్షకుడి నరనరాన ఇమిడిపోయింది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనను 11 సార్లు నంది అవార్డ్‌ వరించింది. ఉత్తమ గేయ రచయితగా 4 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌ గానూ మెరిశారు. అలాంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. సినీ లోకమంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతోంది. అయితే సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలనే కోరిక ఉదేదట. అయితే పాడటానికి ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చిన సీతారామ శాస్త్రి టాలెంట్ మొదట ఆయన సోదరుడు గుర్తించాడట. వెంటనే ఆయనకు ఓ సలహా ఇచ్చారట. అన్నయ్యా.. ఎప్పుడూ కొత్త పదాలతో ఏదో ఒకటి పాడుతున్నావు.. కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. సాహిత్యం దిశగా ప్రయత్నించు అని చెప్పి ప్రోత్సహించారట. దీంతో ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట సీతారామ శాస్త్రి. అప్పట్లో సీతారామ శాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారట. ఆయన MA చేస్తున్న రోజుల్లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో తెలుగు చిత్రసీమ కోసం ఈ ‘సిరివెన్నెల’ కదిలింది. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో సుమధుర గీతాలను రాశారు సిరివెన్నెల.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lihXdt
v

నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల... నంది అవార్డులు తెచ్చిపెట్టిన పాటలు

పాట మూగ‌బోయింది.. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, భ‌ర్త‌గా, భార్య‌గా, భ‌క్తుడిగా, దేవుడిగా, విమ‌ర్శ‌కుడిగా, ప్రేక్ష‌కుడిగా ప్ర‌తి పాట‌కు ఆయ‌న ఆలోచ‌న‌గా మారి పాట‌తో ప్రేక్ష‌కుడ్ని ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. ఉత్తేజాన్ని నింపిన పాట‌ల ఇంద్ర‌జాలీకుడు, మాంత్రికుడు, తాంత్రికుడు ఎవ‌రైనా ఉన్నారా? అంటే అందుకు స‌మాధానంగా క‌నిపించిన వ్య‌క్తి సీతారామ‌శాస్త్రి. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఆయ‌న క‌లం ఎప్పుడూ ఆల‌పెర‌గ‌లేదు. వేలాది పాట‌లు రాసి ప్రేక్ష‌కుల గుండెల్లో తన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో, స్పూర్తితో జ్వాల‌ను ర‌గిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మ‌హా మ‌హులు పోటీ ప‌డుతున్న కాలంలో వ‌చ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందుల‌ను సొంతం చేసుకుని సీనియ‌ర్ రైట‌ర్ వేటూరికి ప్ర‌త్యామ్నాయంగా నిలిచిన దిగ్గ‌జం మ‌న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఈయ‌న ఇంటిపేరు సిరివెన్నెల అని చాలా మంది నేటి త‌రానికి చెందినవారు అనుకోవ‌చ్చు కానీ.. అది కాదు. సీతారామ‌శాస్త్రి ఇంటిపేరు చేంబోలు. కానీ తొలిచిత్రం సిరివెన్నెల‌. ఈ సినిమాను డైరెక్ట‌ర్ కె.విశ్వ‌నాథ్‌. ఆయ‌న పరిచ‌యం చేసిన రైట‌ర్ సీతారామ‌శాస్త్రి. తొలి చిత్రంతోనే త‌న పెన్ ప‌వ‌ర్ ఏంటో తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు రుచి చూపించి అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకునేలా చేసుకోవ‌డం ఆయ‌నకే చెల్లింది. అందుక‌నే ఆయ‌న ఇంటిపేరు సిరివెన్నెల‌గా మారిపోయింది. తార్కికం, తాత్విక‌త క‌ల‌యిక‌తో భావాన్ని వ్య‌క్తప‌ర‌చ‌డం ఎంతో ముఖ్య‌మనేది సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారి భావ‌న‌. ఆ భావాల‌ను దృష్ట్యాంతాలుగా ఆయ‌న పాట‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. జ‌నం బ‌ల‌హీన‌త‌ల‌కు లోబ‌డి చౌక‌బారు పాట‌లు రాస్తున్నామ‌ని ఎవ‌రైనా అంటే అందుకు సిరివెన్నెల ఒప్పుకోరు. ప్రేక్ష‌కుల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని, ఎలాంటి పాట రాసినా, దాన్ని రాయాల్సిన ప‌ద్ధ‌తిలో రాస్తే వారు త‌ప్ప‌కుండా ఆమోదిస్తార‌ని, జేజేలు ప‌లుకుతారనేది సీతారామశాస్త్రి వాదన‌. సినిమా పాట‌పై చిన్న‌చూపు ఉండ‌కూడ‌ద‌ని వాదించేవారిలో ఆయ‌నెప్పుడూ ముందుంటారు. అలాగే కోరిక‌కు, ప్రేమ‌కు మ‌ధ్య ఉన్న ఆ తేడాను గుర్తెరిగి పాట‌లు రాయాలంటారు సిరివెన్నెల‌. అందుకే ఆయ‌న ఇంటికి నందులు త‌ర‌లివ‌చ్చాయి. సీతారామ‌శాస్త్రికి నంది అవార్డుల‌ను తెచ్చి పెట్టిన పాటలు 1. విధాత త‌ల‌పున ప్ర‌భ‌వించిన‌ది - సిరివెన్నెల (1986) 2. తెల‌వార‌దేమీ సామి - శ్రుతిల‌య‌లు (1987) 3. అందెల ర‌వ‌మిది ప‌ద‌ముల‌దా - స్వ‌ర్ణ క‌మ‌లం (1988) 4. సురాజ్య‌మ‌వ‌లేని స్వ‌రాజ్య‌మెందుల‌కు - గాయం (1993) 5. చిల‌కా ఏ తోడు లేక - శుభ‌ల‌గ్నం (1994) 6. మ‌న‌సు కాస్త క‌ల‌త‌ప‌డితే - శ్రీకారం (1996) 7. అర్ధ‌శతాబ్ద‌పు అజ్ఞానాన్ని - సింధూరం (1997) 8. దేవుడు క‌రుణిస్తాడ‌ని - ప్రేమక‌థ (1999) 9. జ‌గ‌మంత కుటుంబం నాది - చ‌క్రం (2005) 10. ఎంత వ‌ర‌కు ఎందు కొర‌కు - గ‌మ్యం (2008)


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3llssNe
v

మహానుభావా వీడుకోలు.. మరొకరు లేరు రాబోరు.. సిరివెన్నెల మృతిపై టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూయగా.. కొద్దిసేపటి క్రితం ప్రముఖ గేయ రచయిత తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల నవంబర్ 24వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకం విడిచి వెళ్లారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు (మంగళవారం) సాయంత్రం ఆయన కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహానుభావా.. వీడుకోలు.. మరొకరు లేరు.. రాబోరు.. ఇక మీరు లేరనే వార్త జీర్ణించు కోలేకపోతున్నాం అంటూ వెన్నెల కిషోర్ తన సంతాపం తెలిపారు. ''అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి గురువు గారు సీతారామ శాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు'' అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. సిరివెన్నెల మరణ వార్త విని షాకయ్యానంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ పెట్టారు. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను'' అని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31hxGml
v

అక్షరానికి అన్యాయం.. ఒంటరైన సాహిత్యం.. సిరివెన్నెల మరణంపై సెలబ్రిటీల స్పందన

సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు రాసిన సిరివెన్నెల మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనీషి గురువు గారు సీతారామశాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు అంటూ ప్రముఖ రచయిత కోనా వెంకట్ ట్వీట్ చేస్తూ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xCQ1WG
v

సిరివెన్నెల ఇకలేరు.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల కలం ఆగిపోయింది. న్యుమోనియాతో బాధపడుతున్న కన్నుమూశారు. నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం.. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. ‘నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని.. అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని’.. ‘రామ బాణం ఆపింది రావణ కాష్టం ’’.. ‘‘కృష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం ’’ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నోస్ఫూర్తినిచ్చే గేయాలు రాసి.. తన సాహిత్యంతో ఉత్తేజాన్ని నింపిన సిరివెన్నెల సీతా రామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 1955 సంవత్సరం మే 20వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rqKMIH
v

83 Trailer: మైదానంలో ఎగిరిన భారత కీర్తిపతాకం.. భావోద్వేగ సన్నివేశాలతో వీడియో వైరల్

1983లో టీమిండియా సాధించిన విక్టరీ ఎన్నటికీ మరువలేనిది. ఎలాంటి అంచనాలు లేని జట్టును నాయకుడిగా ముందుకు నడిపించి విశ్వవిజేతగా అందలమెక్కించారు. టీమిండియాకు సారథ్యం వహించి ప్రపంచకప్‌ను ముద్దాడారు . అయితే ఆ సమయంలో జరిగిన సంఘటనలు, భారత దేశం విశ్వ విజేతగా నిలిచిన విధానాన్ని '83' సినిమాలో చూపించబోతున్నారు. తాజా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి క్రీడాభిమానుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఇండియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బడింది. దేశం గర్వించేలా ప్రపంచ కప్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎల్లలు దాటించారు అప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్. ఆ రోజుతో ఇండియా చిరకాల స్వప్నం సాకారమైంది. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రిస్తూ `83` పేరుతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ క‌బీర్‌ ఖాన్. చిత్రంలో కపిల్‌ దేవ్ పాత్రను పోషించారు. ఆయన సతీమణి పాత్రలో దీపికా పదుకొణె నటించింది. ఈ మూవీ నిర్మాణంలో నాగార్జున భాగం కావడం విశేషం. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటూ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీని ఎట్టకేలకు డిసెంబర్‌ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో 23 ఏళ్ళ కపిల్ దేవ్ టీమిండియాని తన భుజాలపై వేసుకొని ఎలా విజయ తీరాలకు చేరాడు అనేదాన్ని చూపించారు. ఇంగ్లిష్‌ మాట్లాడటం రాక అప్పట్లో క్రికెటర్లు ఇబ్బంది పడడం, మీడియా, విదేశీ జట్లు హేళన చేయడం లాంటి సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FUwFiI
v

Sirivennela : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విషమం

టాలీవుడ్ సీనియ‌ర్ పాట‌ల ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉంది. కొన్నిరోజులు ముందు వ‌ర‌కు ఆయ‌న నిమోనియా బాధ‌ప‌డ్డారు. ఆ క్ర‌మంలో కాస్త సీరియ‌స్ కావ‌డంతో ఆయ‌న్ని న‌వంబ‌ర్ 24 సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్లో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స‌ను అందిస్తూ వ‌చ్చారు. ప‌రిస్థితి ఇంకా విష‌మించింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కిమ్స్ డాక్ట‌ర్స్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. 1986లో విడుద‌లైన ‘సిరివెన్నెల‌’ చిత్రంతో గేయ ర‌చ‌యిత సినీ ప్ర‌స్థానాన్ని సీతారామ‌శాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయ‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న పాటల ర‌చ‌యితగా వెనుదిరిగి చూసుకోలేదు. మూడున్న‌ర దశాబ్దాలుగా ఆయ‌న ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియ‌ని ఓ స్ఫూర్తిని నింపి రాయ‌డం ఆయ‌న పెన్నుకున్న గొప్ప అల‌వాటు. అందుకనే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌నెంతో ప్రీతిపాత్రుడ‌య్యారు. సిరివెన్నెల అద్భుత‌మైన క‌లం నుంచి జాలువారిన పాట‌ల‌కు నందులెన్నో ఆయ‌నింటికి క‌ద‌లి వ‌చ్చాయి. ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DjsprH
v

ఆలీపై బ్రహ్మానందం కామెంట్స్.. నా వల్లే హీరో అయ్యావంటూ సీక్రెట్ రివీల్ చేసిన కమెడియన్

తెలుగు తెరపై ఎంతమంది కమెడియన్స్ వచ్చినా బ్రహ్మానందం, కామెడీకి డిమాండే వేరు అని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదు. వందలాది సినిమాల్లో ఈ కమెడియన్స్ వేసిన వేషాలు జనాన్ని ఓ రేంజ్‌లో నవ్వించాయి. అలాంటి ఈ ఇద్దరూ తాజాగా బుల్లితెరపై హంగామా చేశారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న ‘’ కార్యక్రమానికి విచ్చేసిన తన సినీ జర్నీ తాలూకు ఎన్నో విశేషాలను పంచుకుంటూనే ఆలీ కెరీర్‌పై కామెంట్స్ చేశారు. మనం ఎక్కడ కలిశామో గుర్తుందా? అని ఆలీ వేసిన ప్రశ్నతో ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు బ్రహ్మానందం. చెన్నైలోని ఒక కాలేజ్‌ గ్రౌండ్‌లో ‘చంటబ్బాయి’ సినిమా షూటింగ్‌ సమయంలో మనం కలిశామని, అల్లు రామలింగయ్య గారితో కలిసి చేసే సీన్‌లో ఆయనే నిన్ను పరిచయం చేశారని చెప్పారు. ఇక అప్పట్లో జరిగిన 'మాయలోడు' సినిమా ఫంక్షన్‌లో నువ్వు చేసిన డాన్స్ చూసి ‘యమలీల’లో హీరోగా తీసుకుందామని కృష్ణారెడ్డి, దివాకర్‌ బాబు, అచ్చిరెడ్డి అనుకున్నారని చెప్పారు బ్రహ్మి. అయితే ఓసారి ఇదే విషయం తమ మధ్య చర్చకు రాగా.. ఆలీ మంచి డ్యాన్సర్‌ అని, అతనిలో హీరో మెటీరియల్‌ ఉందని వాళ్ళతో చెప్పానని బ్రహ్మానందం తెలిపారు. మా కమెడియన్స్‌ను హీరోగా చూపిస్తే, కచ్చితంగా ఆలీ మీ పేరు నిలబెడతాడని అలాగే వాడికీ మంచి పేరొస్తుందని చెప్పి ప్రోత్సహించానని చెబుతూ బ్రహ్మి ఓపెన్ అయ్యారు. అలా నువ్వు హీరో అయ్యావని అన్న బ్రహ్మానందం.. మొన్న కూడా అచ్చిరెడ్డి గారు తన దగ్గర ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించారని తెలిపారు. మీరు ఆ రోజున చెప్పారు.. నిజంగానే హీరోగా అలీ మా పేరు నిలబెట్టాడని అచ్చిరెడ్డి అన్నట్లు బ్రహ్మానందం తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32MkaaU
v

శ్రీముఖికి పెళ్లి అయిపోయిందా? షాకవుతున్న ఫ్యాన్స్..!

క్యూట్‌, చ‌బ్బీ యాంక‌ర్‌గా పేరున్న శ్రీముఖికి పెళ్లి అయిపోందా? అదేంటి? అదెప్పుడు? అనే ప్ర‌శ్న‌లు ఫ్యాన్స్ మ‌న‌సుల్లో రాకుండా మాన‌దు. ఈ చ‌బ్బీ బ్యూటీ ఇప్పుడు బుల్లితెర‌, వెండితెర‌తో పాటు డిజిట‌ల్ మాధ్య‌మంలోకి రీసెంట్‌గా అడుగు పెట్టి హ‌ల్ చల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం ఖాలీ దొరికినా త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటుందీ సొగ‌స‌రి. కొన్నాళ్లు ముందు త‌న స్నేహితుడు ముక్కు అవినాష్ పెళ్లిలోనూ, దావ‌త్‌లోనూ క‌లిసి హంగామా చేసిన మ‌న రాములమ్మ ఇప్పుడు నాగ‌బాబుతో చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తింది. అంతంటితో ఈ ముద్దుగుమ్మ ఆగ‌లేదండోయ్‌. సోష‌ల్ మీడియాలో గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసింది. అదేదో సైలెంట్‌గా పార్టిసిపేట్ చేయ‌లేదండోయ్ తెగ రచ్చ చేసింది. నాకు ఏ బాజ్ స‌రిపోతుందో చెప్ప‌మ‌ని ఓ గేమ్‌లో సింగ‌ర్ అనే స‌మాధానం రావ‌డంతో వెంట‌నే మైక్ ప‌ట్టేసుకుని నే తొలిసారిగా అనే పాట‌ను త‌న‌దైన స్టైల్లో పాడేసింది. మ‌రో గేమ్‌లో డిఫ‌రెంట్‌గా రాసిన దాన్ని స‌రైన తీరులో ప‌ల‌కింది. దానికి మీరు చెప్పిన దానికి మేం స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నామ‌ని కంప్యూట‌ర్ అన్న‌ప్పుడు అయితే నేనే క‌రెక్ట్ అంటూ త‌న కొంటెత‌నాన్ని చూపించుకుంది. ఇక వ‌య‌సెంతో చెప్ప‌మ‌ని కంప్యూట‌ర్‌ను అడిగిన‌ప్పుడు అది నీ వ‌య‌సు 17 అని చెప్ప‌గానే సిగ్గుప‌డిపోయింది. అంతా బాగానే ఉంది. అయితే ఓ ద‌గ్గ‌ర మాత్రం కంప్యూట‌ర్ శ్రీముఖికి తిరుగులేని షాక్ ఇచ్చింది. అదేంటో తెలుసా పెళ్లి విష‌యంలో.. నా కెప్పుడు పెళ్ల‌వుతుంద‌ని అడిగిన గేమ్‌లో కంప్యూట‌ర్ నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింద‌ని స‌మాధానం ఇచ్చింది. ఈ స‌మాధానాన్ని ఆమె ఊహించలేదు. ఇక నెటిజ‌న్స్ ఊరుకుంటారా? ఒక్కొక్క‌రు ఒక్కోలా స్పందించ‌డం మొద‌లు పెట్టారు. రాముల‌మ్మా నీకు ఆల్రెడీ పెళ్లయ్యిందా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు. తొక్కేం కాదు.. అని ఓ నెటిజ‌న్‌కుశ్రీముఖి రిప్ల‌య్ కూడా ఇచ్చింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క్రేజీ అంకుల్స్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది రాములమ్మ‌. కానీ ఆ సినిమా ఆమెకు పెద్ద‌గా క‌లిసి రాలేదు. అయితేనేం ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్‌లో ఓ రోల్ చేస్తుంది. ఎలాగూ ఇక బుల్లితెర‌పై రాముల‌మ్మ హంగామా చేస్తూనే ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31e66Gz
v

అలా కుదరదన్న కాజల్.. నాగార్జున కోసం రంగంలోకి మరో హాట్ బ్యూటీ! భారీ సొమ్ము చెల్లించి మరీ..

గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం బంగార్రాజు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు విలక్షణ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న '' సినిమా కూడా చేస్తున్నారు నాగ్. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా కొద్ది రోజులపాటు ఆగిపోయి ఆ తరవాత తిరిగి సెట్స్ మీదకొచ్చింది. ఇంతలో ఈ సినిమా హీరోయిన్ కాజల్ హాండివ్వడంతో కోసం మరో యంగ్ అండ్ హాట్ బ్యూటీ రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని అప్పట్లో చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో వేరే హీరోయిన్ వేట కొనసాగించారు. ఈ మేరకు గోవా బ్యూటీ ఇలియానా పేరు తెరపైకి వచ్చింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు కాజల్ స్థానంలో యంగ్ హీరోయిన్ కౌర్ ఫిర్జాదాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే మెహ్రీన్‌తో సంప్రదింపులు చేసిన చిత్ర యూనిట్.. ఆమె డిమాండ్ మేరకు భారీ మొత్తం రెమ్మ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె ఈ మూవీ సెట్స్ మీదకు రానుందని అంటున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలుస్తుండటం ఆసక్తికర అంశం. భారీ బడ్జెట్‌ కేటాయించి ఓ రేంజ్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ రోల్ చేస్తున్నారని, గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో ఆయన్ను చూడనున్నామని టాక్. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా అతిత్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E8Hspe
v

కంగనా రనౌత్‌కు బ్రేకప్...అజ్ఞాత ప్రేమికుడు హ్యాండిచ్చాడా?

కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా రనౌత్‌కు మ‌రోసారి బ్రేక్ అప్ తప్ప‌లేద‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్ అలాంటి అనుమానాల‌కు తావిస్తుంది. ఇది వ‌ర‌కు ఆమె హృతిక్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిందని బాలీవుడ్‌లో బ‌ల‌మైన వార్త‌లే వ‌చ్చాయి. కంగ‌నా, హృతిక్ మ‌ధ్య గొడ‌వ‌లు అయిన‌ప్పుడు కూడా హృతిక్ త‌నతో రిలేష‌న్ ఉన్నాడ‌ని కూడా చెప్పుకొచ్చింది. అదంతా పెద్ద గొడ‌వ‌. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అస‌లు కంగన‌కు మ‌రోసారి బ్రేకప్ కావ‌డం ఏంటి? అస‌లు కంగనా ర‌నౌత్ ఎప్పుడు ప్రేమ‌లో ప‌డింది. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మాత్రం ఆమె చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ప‌రిచ‌యం చేయాల‌ని కూడా ఆమె అనుకుంది. రీసెంట్‌గా ఆ విష‌యాన్ని మీడియాలోనూ వెల్ల‌డించింది. త‌న‌కు త‌ల్లి కావాల‌ని ఉంద‌ని, ఐదేళ్ల‌లో త‌న‌ను ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా చూసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. అంటే ఎవ‌రితోనైనా మీరు ప్రేమ‌లో ఉన్నారా? అని అప్పుడు మీడియా వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తే.. త్వ‌ర‌లోనే మీకు అత‌న్ని ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పింది. అబ్బో.. కాంట్రీవ‌ర్సీల‌కు కేరాఫ్ అయిన అమ్మ‌డు కంగ‌నా ర‌నౌత్‌ మ‌న‌సు దోచిన వాడెవ‌డో అని మీడియాలోనూ తెలియ‌ని ఓ ఆస‌క్తి నెల‌కొంది. అయితే, ఆ ఆసక్తికి ఇప్పుడు నీళ్లు వ‌దులుకోవాల్సిందే. ఎందుకంటే కంగ‌నా ర‌నౌత్ రీసెంట్ పోస్ట్ అలాంటి అర్థాన్ని సూచిస్తుంది. ‘నేను నీ కోస‌మే జీవించాను. కానీ నువ్వు మాత్రం అన్యాయంగా ప్ర‌వ‌ర్తించావు’ అని కంగ‌న పోస్ట్ చేసింది. దీన్ని చూసిన వాళ్లు కంగ‌నా ర‌నౌత్ ర‌హ‌స్య ప్రేమ‌కు బ్రేకులు ప‌డ్డాయ‌ని అనుకుంటున్నారు. మ‌రి కంగ‌నా ర‌నౌత్ పోస్టుకు అర్థం అదేనా? లేక మ‌రేదైనానా అని తెలుసుకోవాలంటే .. స్ట్ర‌యిట్ స‌మాధానం ఆమె చెప్పాల్సిందే. తెలుగులో 2009లో ప్ర‌భాస్ జోడిగా ఏక్ నిరంజ‌న్‌లో న‌టించిన కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా మారింది. కంగ‌నా ర‌నౌత్ న‌టిగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసి ఇప్ప‌టికి ప‌దిహేనేళ్ల‌వుతుంది. ఈ ప‌దిహేనేళ్ల‌లో ఆమె ఎన్నో ఆటు పోట్ల‌ను ఎదుర్కొంది. క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను, త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ సాధించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయ‌న్‌గా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌ణిక‌ర్ణికతో డైరెక్ట‌ర్‌గానూ మారింది. నిర్మాత‌గానూ మారింది. ఇప్పుడు ధాక‌డ్‌, తేజ‌స్‌, టీకు వెడ్స్ షేర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి కంగనా ర‌నౌత్ రెడీగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ro4jcO
v

భీమ్లా నాయ‌క్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు.. ర‌చ్చ చేస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించ‌డంతో లాలా భీమ్లా.. అనే సాంగ్‌ను కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ‘భీమ్లా నాయ‌క్‌’ నుంచి మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు నాలుగో పాట‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘అడవి త‌ల్లి మాట‌...’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను బుధ‌వారం అంటే డిసెంబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల‌వుతుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీక్ష‌ణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అత‌నిలో అడవి క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి సినిమాను జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇందులో భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్, డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. వీరి క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించిన టీజ‌ర్స్‌, భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్‌తో పాటు లాలా భీమ్లా, అంత ఇష్ట‌మేంద‌యా.. పాట‌ల‌కు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. మ‌రి రేపు నాలుగో సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సాగే పాట అని పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రానా స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ జోడీ క‌డుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్‌డేట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సోష‌ల్ మీడియాలో మ‌రోసారి భీమ్లా నాయ‌క్‌ను ట్రెండింగ్ చేయ‌డంలో బిజీగా మారిపోయారు. పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య వ‌చ్చిన ఇగో గొడ‌వ‌లు ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే భీమ్లా నాయ‌క్ క‌థ‌. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను అందించారు. మ‌రోవైపు వ‌ప‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o6l75X
v

Monday 29 November 2021

సమంత సంచలన నిర్ణయానికి ఆ హీరోనే కారణమా?

స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం అంటే ఆమె నాగ‌చైత‌న్య‌తో ఎందుకు విడిపోయింద‌నే అంద‌రూ ఆలోచిస్తారు. అందులో సందేహం లేదు. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోవ‌డం వెనుక గ‌ల కార‌ణాలేంట‌నేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. వాళ్లు చెప్ప‌డం లేదు. మ‌రి స‌మంత విడిపోవాల‌నుకున్న‌ది సంచ‌ల‌న నిర్ణ‌య‌మే. అయితే ఇక్క‌డ మ‌నం ప్ర‌స్తావించే సంచ‌ల‌న నిర్ణ‌యానికి, ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలోని సంచ‌ల‌న నిర్ణ‌యానికి సంబంధం లేదు. మ‌నం ఇక్క‌డ ఆమె ప్రొఫెష‌న‌ల్‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించే ప్ర‌స్తావించ‌బోతున్నాం. స‌మంత సినిమాల ఎంపిక త‌న వైవిధ్యాన్ని చూపిస్తూ చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఎవ‌రూ ఊహించని విధంగా సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రీసెంట్‌గా ఆమె ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ అనే అంత‌ర్జాతీయ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర యూనిట్ కానీ, స‌మంత చెప్ప‌లేదు కానీ.. ఇందులో ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రోల్‌ను చేస్తుంది. అదే బై సెక్సువ‌ల్ రోల్‌. ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే ఆమెను అప్రిషియేట్ చేయ‌కుండా ఉండ‌లేరు. ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ చిత్రాన్ని జాన్ పిలిప్ డైరెక్ట్ చేస్తున్నారు. గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. అయితే ప‌ర్టికుల‌ర్‌గా బై సెక్సువ‌ల్ రోల్‌లో ఎవ‌ర్నీ న‌టింప చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తుండ‌గా రానా ద‌గ్గుబాటి స‌మంత పేరుని సూచించాడ‌ట‌. ఆమె అయితే న్యాయం చేస్తుంద‌ని రానా చెప్ప‌డంతో మేక‌ర్స్ స‌మంత‌ను అప్రోచ్ అయ్యారు. క‌థ విన్న స‌మంత న‌టించ‌డానికి వెంట‌నే ఓకే చెప్పింది. అలా స‌మంత కెరీర్‌లో అంతర్జాతీయ సినిమాను ఎంపిక చేసుకునే సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక కార‌ణంగా నిలిచిన హీరో రానా ద‌గ్గుబాటి అని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప ది రైజ్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో స్టెప్పులేస్తుంది. నాలుగైదు రోజులు పాటు ఈ పాటను చిత్రీక‌రించ‌నున్నారు. దీని త‌ర్వాత స‌మంత కిట్టిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’. దీంతో పాటు రెండు ద్విభాషా (తెలుగు, త‌మిళ‌) చిత్రాలు రెండు చేయ‌నుంది. ఈ రెండు ద్వి భాషా చిత్రాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్స్ చేస్తుండ‌టం విశేషం. ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మిస్తుంటే.. మ‌రో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూడు సినిమాలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం స‌మంత ఫిజిక‌ల్ పిట్‌నెస్‌పై చాలా ఫోక‌స్డ్‌గా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31d48pE
v

పాట పాడిన శ్రీముఖి.. స్పృహ కోల్పోయిన నాగ‌బాబు.. వీడియో వైర‌ల్‌!

అజానుబాహుడు, భారీ వ్య‌క్తి అయిన నాగ‌బాబుని కింద ప‌డేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. కానీ ఆ విష‌యాన్ని చాలా తేలిక‌గా ఎలాంటి క‌ష్టం ప‌డ‌కుండా సెక‌న్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేసేసింది న‌టి, యాంక‌ర్ శ్రీముఖి. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే.. బుల్లితెర స్టార్ శ్రీముఖి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. నాగ‌బాబు మిన్న‌కుండ‌కుండా.. శ్రీముఖిని ఓ పాట పాడ‌మ‌ని రిక్వెస్ట్ చేశాడు. నాగ‌బాబు త‌న‌కు అలాంటి ఆఫ‌ర్ ఎప్ప‌టి నుంచి ఇస్తాడా? అని ఎదురు చూస్తున్న ఒక్క‌సారిగా రెచ్చిపోయింది. ఇంకేముంది.. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. త‌ట్టి లేపిన లేవ‌లేదు. నిజ‌మేనండి బాబు.. ఈ వీడియో చూస్తే మీరు ఔన‌న‌కుండా ఉండ‌లేరు. ఇక నెటిజన్స్ కూడా అదే రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ఓ మనిషిని ఇలా కూడా వేసేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత‌కీ ఈ వీడియోను పోస్ట్ చేసిందెవ‌ర‌నుకుంటున్నారు? శ్రీముఖి. ఆమె త‌న ఇన్‌స్టాలో నాగ‌బాబుతో క‌లిసి చిన్న వీడియో చేసింది. నాగబాబు: శ్రీముఖి నిన్ను ఎప్ప‌ట్నుంచో ఒక‌టి అడ‌గాల‌ని అనుకుంటున్నా శ్రీముఖి : అడ‌గండి బాబుగారు నాగ‌బాబు: నీ నోటి నుంచి చ‌క్క‌టి పాట వినాల‌నుంది శ్రీముఖి : త‌ప్ప‌కుండా బాబుగారు .. రెడీయా! అని శ్రీముఖి ద‌ర్ ద‌ర్ బాద్ తుక్‌డే .. పాట పాడింది ఇంకే ముంది. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. బాబుగారు అని శ్రీముఖి లేపినా లేవ‌లేదు. నాగ‌బాబు శ్రీముఖిని పాట పాడ‌మ‌ని అడ‌గ‌టం.. ఆమె పాడ‌టం. ఆయ‌న క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డం అన్నీ క‌నిపిస్తున్నాయి. అయితే అన్నీ స‌ర‌దాగానే చేశారిద్ద‌రూ. చూసిన వారంద‌రూ వారి కామెడీకి న‌వ్వుకోవాల్సిందే. వీడియో పోస్ట్ చేసిన శ్రీముఖి బాబు బంగారం.. కాన్సెప్ట్ అండ్ డైరెక్ష‌న్ కూడా స్వీట్ ప‌ర్స‌న్ నాగ‌బాబుగారిదే అంటూ క్యాప్ష‌న్ పోస్ట్ చేసింది. న‌టిగా, యాంక‌ర్‌గా బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనూ పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ప‌లు షోస్‌కు వ్యాఖ్యాత‌గా చేస్తూనే వీలున్న‌ప్పుడల్లా సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఇక మెగా బ్ర‌ద‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌వైపు సినిమాలు చేసుకుంటూనే మ‌రో వైపు త‌న యూ ట్యూబ్ ఛానెల్‌లో కాన్సెప్ట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E9iuG2
v

Prabhas : పుష్ప‌ కోసం క‌దిలొస్తున్న రాధే శ్యామ్‌..!

ఒక‌రేమో పాన్ ఇండియా స్టార్‌.. మ‌రొక‌రు తొలిసారి త‌న పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయాల‌నుకుంటున్న స్టార్‌. ఈ టాలీవుడ్ స్టార్ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌లిస్తే ఎలా ఉంటుంది. అదుర్స్ క‌దూ! ఇంత‌కీ ఎవ‌రా టాలీవుడ్ స్టార్స్ అనుకుంటున్నారా..ఇంకెవ‌రు? ఒక‌రేమో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అయితే మ‌రొక‌రేమో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ ఇద్ద‌రు హీరోలు ఒకే వేదిక‌పై కనిపించున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. అస‌లు విష‌య‌మేమంటే అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. అందులో తొలి భాగం .. డిసెంబ‌ర్ 17న తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స‌మంత క‌లిసి చిందేయ‌డం విశేషం. ఒక‌వైపు పుష్ప ది రైజ్ నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. మ‌రో వైపు ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇండియాలో ప్ర‌ధానమైన న‌గ‌రాల‌కు పుష్ప యూనిట్ వెళ్లి ప్ర‌చారం చేసేలా ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. లేటెస్ట్‌గా వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాబోతున్నార‌ట‌. పుష్ప కోసం ప్ర‌భాస్ రావడం అంటే నిజంగా గొప్ప విష‌య‌మే. మంచి ప‌రిణామం కూడా. అలాగే ప్ర‌భాస్ సినిమా రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. మ‌రి ఈవెంట్‌కు ఏమైనా వెళ‌తాడేమో.. ఇలా తెలుగు హీరోల మ‌ధ్య ఉన్న గ్యాప్ క్ర‌మంగా ఇలా త‌గ్గిపోతుంది. ఒక‌రి ఈవెంట్స్‌కు మ‌రొక‌రు వ‌స్తుండ‌టం మంచి విష‌యం కూడా. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం పుష్ప ది రైజ్. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. సుకుమార్ ద‌ర్శ‌కుడు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూడో చిత్ర‌మిది. ఫ‌హాద్ ఫాజిల్ మెయిన్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా సునీల్‌, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాస్త నెల గ్యాప్‌లోనే ప్ర‌భాస్ జ‌న‌వ‌రి 14న సంక్రాంతికి రాధేశ్యామ్ అనే పీరియాడిక్ ల‌వ్‌స్టోరితో పాన్ ఇండియా రేంజ్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o6V0fs
v

రాజ్ తరుణ్‌తో రెండు సార్లు ఆ అనుభవం.. యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నా.. అరియానా శాడిజం!

బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే కంటే ముందు యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలా యాంకరింగ్ చేసుకుంటూ ఆర్జీవీ కంట్లో పడటం, ఆయన అరియానా తొడల మీద కామెంట్లు చేయడంతో దశ తిరిగింది. అలా ఆర్జీవీ కామెంట్లతో వైరల్ అయిన అరియానా బిగ్ బాస్ షో చాన్స్ వచ్చింది. అలా మొత్తానికి బోల్డ్ బ్యూటీగా అరియానా బిగ్ బాస్ షోలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అతికి అంబాసిడర్‌లా అనిపించినా కూడా టాప్ 5 వరకు అరియానా చేరుకుంది. ఇప్పుడు సినిమాల్లోనూ అరియానా రచ్చ చేస్తోంది. అనుభవించు రాజా సినిమాలో ఓ పాత్రలో అరియానా కనిపించింది. తాజాగా అరియానా ఈ మూవీ షూటింగ్ విశేషాలు, రాజ్ తరుణ్‌తో తనకున్న అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ అంటే తనకు అస్సలు నచ్చదని అరియానా తెలిపింది. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదని అంది. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్‌ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నానంటూ అరియానా తన శాడిజాన్ని బయటపెట్టేసింది. ఓ సారి ఇంటర్వ్యూకి పిలిచి వెయింట్ చేయించారంటూ.. చివరకు రాకుండా డబ్బింగ్ పని ఉందని వెళ్లిపోయాడట. అంతకు ముందు కూడా ఇలానే ఓ సారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయించాడంటూ అరియానా గతాన్ని గుర్తు చేసుకుంది. అలా రెండు సార్లు రాజ్ తరుణ్ హ్యాండ్ ఇచ్చాడట. అందుకే ఇలా ఇంత ద్వేషం ఏర్పడినట్టుంది. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా.. ఓ రోజు కావాలనే సెట్‌లో రాజ్‌ తరుణ్‌ను 8 గంటలు వేయిట్‌ చేయించిందట అరియానా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rhVj99
v

శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కరోనాతో గత కొన్ని రోజులుగా పోరాడుతూ వచ్చిన మాస్టర్.. ఆదివారం కన్నుమూశారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇతర సమస్యలు, ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకడంతో మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మాస్టర్ మరణంపై టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులే కాకుండా దక్షిణాది సినీ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. యాంకర్, నిర్మాత, దర్శకుడు తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓంకార్ షోలతో శివ శంకర్ మాస్టర్ క్రియేట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఓంకార్ షోలు అందులో శివ శంకర్ మాస్టర్ జడ్జ్మెంట్ అంటే ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై శివ శంకర్ మాస్టర్ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక శివ శంకర్ మాస్టర్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో సోనూ సూద్, చిరంజీవి, ధనుష్ వంటి వారు ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కానీ వారి సాయం, వారి ప్రయత్నం ఫలించలేదు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాలకు ఆయన కొరియోగ్రఫర్‌గా వ్యవహరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31gIL76
v

Sirivennela Sitaramasastri : ఆస్పత్రిలో సిరివెన్నెల.. హెల్త్ బులిటెన్ విడుదల

ప్రస్తుతం టాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లెజెండరీ సెలెబ్రిటీలు అనారోగ్యాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. మొన్నటి వరకు కైకాల సత్యనారాణ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు. గత ఐదు రోజుల క్రితమే సిరివెన్నెలను ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్‌ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న ఆస్పత్రిలో చేరారు. నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు. గత రెండ్రోజుల క్రితం సిరివెన్నెల ఆరోగ్యం గురించి రకరకాల వార్తలను రావడంలో కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని.. కిమ్స్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసామని, కంగారు పడాల్సినదేమీ లేదని కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZA9Q4t
v

టికెట్ రేట్లపై ఇక నేను మాట్లాడను!.. నాని సంచలన కామెంట్స్

నిత్యా మీనన్ నటించి నిర్మిస్తున్న మీద అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చాడు. కాంట్రవర్సీ చేయనంటూనే కాంట్రవర్సీలకు తెరలేపాడు. ఇది వరకు ఓ సారి సత్యదేవ్ సినిమా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. థియేటర్ల సమస్య, టికెట్ల రేట్ల వివాదాలపై మొదటిసారిగా నాని స్పందించాడు. అయితే ఆ సమయంలో నాని ఒక్కడే ముందుకు వచ్చి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంత మాట్లాడిన నాని చివరకు తన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్ముకున్నాడు. ఆ విషయంలోనూ నాని మీద ట్రోలింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు నానిని ఓ రేంజ్‌లో తిట్టేశారు. అయితే ఇప్పుడు మళ్లీ నాని.. అలాంటి కామెంట్లే చేశాడు. సత్యదేవ్ హీరోగా రాబోతోన్న స్కైలాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఫంక్షన్‌లో టికెట్ల రేట్లు, థియేుటర్ల సమస్య గురించి నేనేమీ మాట్లాడను భయపడకు సత్యదేవ్.. ఇక పెద్దవాళ్లు మాట్లాడాలి అని ఓ మాట వదిలేశాడు. దీంతో నాని ఈ విషయాన్ని ప్రస్థావించినట్టు అయింది. పెద్ద వాళ్లు ఇంకా నోరు విప్పడం లేదని ప్రశ్నించినట్టు కూడా ఉంది. మొత్తానికి నాని మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్నాయి. మరి నాని వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/318PShW
v

అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి వచ్చా.. అసలు విషయం చెప్పిన తమన్

ప్రస్తుతం సౌత్‌లో హవా బాగానే కొనసాగుతోంది. తమన్ ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తెలుగులో అయితే టాప్ హీరోల ప్రాజెక్ట్‌లన్నీ కూడా తమన్ ఖాతాలోనే ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్లందరికీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే.. అందులో ఆరేడు చిత్రాలు తమన్ కొట్టినవే ఉంటున్నాయి. అలాంటి తమన్ ఈ మధ్య నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. తాను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నానికి నచ్చలేదట. అందుకే గోపీ సుందర్‌తో చేయించుకున్నారట. అయితే తమన్ బాలీవుడ్‌లోని కొన్ని పాటలు కొట్టాడు. కానీ బాలీవుడ్ పని తీరు.. మన సౌత్ పనితీరు చాలా వేరు. మన స్టైల్లో పని చేస్తే అక్కడి వాళ్లకు నచ్చదు. ఇక్కడ ఒక్క సినిమాకు ఒకే సంగీత దర్శకుడు ఉంటాడు. కానీ అక్కడి చిత్రానికి ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులుంటారు పాటలు చాలా మంది కంపోజ్ చేస్తారు.. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరు ఇస్తారు.. అలాంటివి చూడలేక.. తట్టుకోలేక పారిపోయి వచ్చాను. సినిమా అంత మన చేతుల్లో పెడితే చేయగలం. కానీ అలా పని చేయడం నా వల్ల కాదు. అందుకే బాలీవుడ్‌లో ఎక్కువ మ్యూజిక్ చేయలేదు అని తమన్ అన్నాడు. అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను పంచుకున్నాడు. తమన్ ప్రస్తుతం అఖండ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, లూసిఫర్ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. చిత్రం ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31au3OE
v

గుండె బద్దలైంది.. దారుణమైన వార్త.. ఉదయ భాను ఎమోషనల్

తెలుగు సినీ రంగంలో నృత్య దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు. అలాంటి లెజెండరీ కొరియోగ్రఫర్ ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధపడుతున్న ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో మంది సాయం చేశారు. సోనూ సూద్, చిరంజీవి, ధనుష్ ఇలా ఎంతో మంది సాయం చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రాజమౌళి అయితే మగధీర నాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు. ధీర ధీర సాంగ్‌కు శివ శంకర్ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నుంచి ప్రతీ ఒక్క హీరో శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తాజాగా ఆయన మరణ వార్తపై స్పందించింది. ఢీ షోలకు వ్యాఖ్యాతగా ఉదయ భాను వ్యవహరించిన రోజుల్లో శివ శంకర్ మాస్టర్‌ న్యాయ నిర్ణేతగా ఉండేవారు. అలా అక్కడ ఏర్పడిన బంధాన్ని ఉదయభాను పంచుకుంది. బుల్లితెరపై కామెడీ, పలు ఇతర షోలు, డ్యాన్స్ షోలకు శివ శంకర్ మాస్టర్ ఫేమస్. శివ శంకర్ మాస్టర్ మరణ వార్తను విని షాక్ అయ్యాను అంటూ ఉదయ భాను ఎమోషనల్ అయింది. ఇంత కంటే చెడ్డ వార్త ఉండదు. దారుణమైన వార్త.. ఓ గొప్ప ప్రతిభ గల వ్యక్తిని, ప్రేమించే వ్యక్తి, ఎంతో ప్రోత్సహించే వ్యక్తి.. మా ప్రియమైన శివ శంకర్ మాస్టర్ మాస్టర్‌ను ప్రపంచం కోల్పోయింది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం మాస్టర్ అని ఎమోషనల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3I3jkqb
v

RRR ట్రైల‌ర్ డేట్ ఫిక్స్.. ఆనందంలో మెగా, నందమూరి ఫ్యాన్స్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ RRR. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ సినిమా విడుల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అధికారికంగా చెప్ప‌లేదు కానీ.. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింద‌ట‌. సినిమా వ్య‌వ‌ధి 3 గంట‌ల 6 నిమిషాల‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. టాలీవుడ్‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రో వైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో అప్‌డేట్‌ను తెలియ‌జేశారు జ‌క్క‌న్న‌. RRR ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. దీంతో ఇటు మెగాభిమానులు, అటు నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్‌లోనే కాదు.. ఖండాంత‌రాలు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావ‌డంతో సినిమా కోసం ఎంటైర్ ఇండియా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. సినిమా డిసెంబ‌ర్ 3న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి త‌ర్వాత రోజు నుంచి ప్ర‌మోష‌న్స్‌ను మ‌రింత వేగవంతం చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ ఇప్ప‌టికే నిర్ణ‌యించుకుంది. చార్టెడ్ ఫ్లైట్‌లో ఇండియాలోని ప్ర‌ధాన న‌గరాల్లో ప‌ర్య‌టిస్తూ RRRను ప్ర‌మోట్ చేయాల‌ని ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ఆలియా, అజ‌య్ దేవ‌గ‌ణ్, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌హా ఎంటైర్ యూనిట్ స‌భ్యులు నిర్ణ‌యించుకున్నారు. భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ కూడా జ‌రుగుతుంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.400 కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు ప‌ది వేల థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉందని, ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్‌లో విడుద‌ల కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. 1920 కాల‌పు బ్రిటీష్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని ఇద్ద‌రు యోధులు క‌లిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కమౌళి రాజ‌మౌళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3riMZ9d
v

Balakrishna: బాలయ్యతో బ్రహ్మానందం.. అల్లు వారి స్కెచ్చులు మాములుగా లేవుగా!!

ముందు నుంచే మంచి బిజినెస్ చేయడంలో కింగ్ నిర్మాత అల్లు అరవింద్. ట్రెండ్‌కి తగ్గట్టుగా మోల్డ్ అవుతూ బిజినెస్ చేయడంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆయన.. రీసెంట్‌గా ఓటీటీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. ఆన్ లైన్ వేదికపై '' ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసి సరికొత్త ప్రోగ్రామ్స్‌తో నయా జనరేషన్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్ వ్యాపారంలో తన వంతుగా భాగమై '' అంటూ స్పీడు పెంచారు . ఇప్పుడు ఆ స్పీడుకు నవ్వుల రారాజు బ్రహ్మానందాన్ని యాడ్ చేయబోతున్నారట. వెండితెరపై పాపులర్ అయిన స్టార్స్‌తో వినూత్నమైన ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్న ఆహా టీమ్.. బాలయ్య బాబుతో 'అన్‌స్టాపబుల్' షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షోకు మొదటి ఎపిసోడ్‌ గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరై సందడి చేశారు. సీనియర్ నటులైన బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య నడిచిన మాటల ప్రవాహం జనాన్ని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత రెండో ఎపిసోడ్‌లో నాచురల్ స్టార్ నానితో బాలయ్య హంగామా నడించింది. ఇక ఇప్పుడు వంతు వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు బాలకృష్ణ. దీంతో షోకి కొంత గ్యాప్ వచ్చింది. ఆయన కాస్త కోలుకోవడంతో గత శుక్రవారం తిరిగి షూటింగ్ షురూ చేశారు. 'మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈజ్ బ్యాక్' అంటూ ‘ఆహా’ టీం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. అయితే ఈ ఎపిసోడ్ ఎంతో స్పెషల్‌గా ఉండాలని ప్లాన్ చేసిన అల్లు (ఆహా) టీమ్ బ్రహ్మానందాన్ని రంగంలోకి దించుతున్నారని సమాచారం. ఇదే నిజమైతే ఇక బుల్లితెరపై కూడా దబిడి దిబిడే!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ljUHvY
v

దారుణమైన వీడియో.. అందాలన్నీ బట్టబయలు.. వెంటనే డిలీట్ చేసిన పాయల్

ఆర్ఎక్స్ 100 బ్యూటీ రాజ్ పుత్ కాస్త ఆవేశపడింది. అందాలను ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో కాస్త హద్దులు దాటింది. ఆ దాటడంలో తొందరపడింది. టాప్ లెస్ అంటూ ఓ బ్లేజర్ మాత్రమే ధరించింది. లోపల ఏమీ ధరించలేదు. దీంతో వెరైటీగా ఫోటో షూట్ చేద్దామని తెగ ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. పాయల్ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. పాయల్ ఎద అందాలు బయటపడ్డాయి. దీంతో తప్పు తెలుసుకుని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ ఏం లాభం. అసలే ఇది సోషల్ మీడియా కాలం క్షణంలో ఏదైనా వైరల్ అవుతుంది. అలా పాయల్ తన వీడియోను డిలీట్ చేసే లోపు నెట్టింట్లో అందరికీ చేరింది. నిజం అడుగు బయటపెట్టే లోపు అబద్దం ప్రపంచం చుట్టి తిరిగి వస్తుందనే సామెత లెక్క.. ఇలాంటి వీడియోలు క్షణాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఇక ఇప్పుడు పాయల్ అందాలన్నీ ఫ్రీగా చూసేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పాయల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. అలా పాయల్ హద్దులు దాటి చేసిన అందాల విందుతో ఇప్పుడు తలనొప్పులు వచ్చేశాయి. అందుకే ఏది పోస్ట్ చేస్తున్నాం.. అందులో అసభ్యకరంగా ఏమున్నాయ్ అని ముందే చూసుకోవాలి. ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏమీ ఉండదు. ఈ విషయం పాయల్‌కు ఇప్పుడు బాగానే అర్థమై ఉంటుంది. అయితే మళ్లీ పాయల్ పాత వీడియోలను తప్పులు దొర్లకుండా కొత్త వీడియోను షేర్ చేసింది. ఆల్రెడీ పాత వీడియోను చూసేశామంటూ నెటిజన్లు సెటైర్లు వేసేస్తున్నారు. ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. పాయల్ ఈ మధ్యే ఆహాలో 3 రోజెస్ అంటూ పలకరించింది. మంచి బోల్డ్ అండ్ హాట్ కంటెంట్‌తో పాయల్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పాయల్ వరుసగా తన చిత్రాలను పట్టాలెక్కించేసింది. కన్నడలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగులో ఆది సాయి కుమార్‌తో రెండు సినిమాలు చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cWxQSj
v

రాధే శ్యామ్ సెకండ్ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది.. పూజా హెగ్డేతో బీచ్‌లో ప్ర‌భాస్ రొమాన్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాధే శ్యామ్‌. హీరోయిన్‌. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రీసెంట్‌గా ‘ఈ రాత‌లే..’ అంటూ లిరికల్ సాంగ్ విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను రాబ‌ట్టుకున్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఓ సినిమాకు సంబంధించి ఒకే పాట‌ను రెండు ర‌కాలుగా వినొచ్చ‌ని రాధే శ్యామ్‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ తెలియ‌జేసింది. రాధే శ్యామ్‌లోని రెండో సాంగ్ ప్రోమోను హిందీలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం అన్న‌మాట ప్ర‌కారం ఆన్ టైమ్‌లో విడుద‌ల చేశారు. ఇక తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన సాంగ్ ప్రోమోను ఈరోజు రాత్రి విడుద‌ల చేయ‌బోతున్నారు. ‘ఆషికీ ఆగ‌యా ...’ అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌నే కాదు.. సినీ అభిమానులను కూడా అల‌రిస్తుంది. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ ఉన్న డ్రెస్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేమికుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదని సాంగ్ ప్రోమోను చూస్తే అనిపించ‌క త‌ప్ప‌దు. సాంగ్ ప్రోమో చూస్తుంటే పాట చాలా ప్లెజంట్‌గా క‌నిపిస్తుంది. పూర్తి ల‌వ్ యాంథ‌మ్‌ను డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఇందులో ఎదుటివారి చేతి రేఖ‌ల‌ను చూసి వారి భ‌విష్య‌త్తును చెప్ప‌గ‌ల నేర్ప‌రి అయిన హీరో.. త‌న ప్రేయ‌సి చేతి రేఖ‌ల‌ను చూసి ఆమె ప్ర‌మాదాల‌ను ప‌సిగ‌డ‌తాడు. ఆమెను ఆ ప్ర‌మాదాల బారి నుంచి ఎలా ర‌క్షించుకున్నాడ‌నేదే సినిమా అని వార్త‌లు వినిపించాయి. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ల‌వ్ స్టోరి ఇది. విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్‌.. ప్రేర‌ణ‌గా పూజా హెగ్డే మ‌ధ్య ల‌వ్ ప్రేమికుల‌ను ఎలా అల‌రించ‌నుందో తెలియాలంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 14న సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. యువీ క్రియేష‌న్స్‌, టి సిరీస్ సంస్థ‌ల‌పై మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు. సాహో విడుద‌లై రెండేళ్ల దాటేసింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆతృత‌గా రాధే శ్యామ్ కోసం ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lhmgWL
v

Samantha: త్రివిక్రమ్‌కు హాండిచ్చిన హాట్ బ్యూటీ.. సమంతతో మాటల మాంత్రికుడి స్కెచ్!

ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న హీరోయిన్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయింది. నేటితరం కుర్ర హీరోలకు బెటర్ ఛాయిస్ కావడంతో దర్శకనిర్మాతల చూపు ఈ సుందరిపైనే పడుతోంది. దీంతో కొత్త ప్రాజెక్ట్‌లకు డేట్స్‌ సర్దుబాటు చేయడం పూజా కాస్త కష్టంగా మారుతోందట. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు కాదనుకుంటున్న ఆమె.. త్రివిక్రమ్ సినిమాను కూడా పక్కనబెట్టిందని సమాచారం. #SSMB28గా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు శ్రీనివాస్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ త్వరలోనే పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ కోసం బలమైన కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్.. మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టి పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారట. అయితే ముందు ఒప్పుకున్న పూజా హెగ్డే చివరకు కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డేట్స్ సర్దుబాటు కాకనే ఇలా రిజెక్ట్ చేసిందా? లేక వాళ్ళ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయా? అనేది సినీ సిర్కిల్స్‌లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే కాదని చెప్పిందని వెంటనే సమంతను అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇందుకు సామ్ ఓకే చెప్పేసిందని, డేట్స్ కూడా ఇచ్చిందని టాక్. ఇదే నిజమైతే ''దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం'' సినిమాల తర్వాత మరోసారి హిట్ పెయిర్ మహేష్ బాబు- సెట్స్‌పై వాలిపోతుంది. ఈ జోడీకి సిల్వర్ స్క్రీన్‌పై మంచి డిమాండ్ ఉంది కూడా. అందుకే పూజా నో చెప్పగానే త్రివిక్రమ్ కన్ను సమంతపై పడి ఉండొచ్చు!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FXbvk4
v

అల్లు అర్జున్ Pushpa The Riseలో స్పెషల్ సాంగ్ షురూ చేసిన సమంత..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఓ సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఆ సాంగ్ కూడా స్పెష‌ల్ సాంగ్‌. ఇలాంటి సాంగ్స్ తెర‌కెక్కించ‌డంలో సుక‌మార్‌కంటూ ఓ స్టైల్ ఉంది. ఆయ‌న సినిమాలు చూస్తే ఆ విష‌యం అంద‌రికీ అవ‌గ‌త‌మ‌వుతుంది. అదే పంథాను ‘ ది రైజ్‌’ కోసం ఆయ‌న ఫాలో అవ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. స్పెష‌ల్ పాట‌పై చాలా ఫోక‌స్ పెట్టారు. బ‌న్నీతో ఓ సాంగ్‌లో ఎవ‌రినీ తీసుకుంటే ఆడియెన్స్‌లో క్రేజ్ పీక్స్‌లో ఉంటుందా? అని సుక్కు తెగ ఆలోచించాడు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న ఊహించ‌ని స్టార్‌ హీరోయిన్ స‌ద‌రు సాంగ్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది. ఇంత‌కీ ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. స‌మంత‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించేసింది కూడా. స‌మంత ఎందుకంత స్పెష‌ల్ అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి సాంగ్‌లో ఏ హీరోతోనూ డాన్స్ చేయ‌లేదు. తొలిసారి బ‌న్నీతోనే న‌టిస్తుంది. స‌మంత ప‌ర్టికుల‌ర్‌గా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల‌నే కాదు. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గానే మారింది. ఏదేతైనేం ఎట్ట‌కేల‌కు సోమ‌వారం హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెష‌ల్ సెట్‌లో అల్లు అర్జున్, స‌మంత‌ల‌పై సుకుమార్ స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ను షురూ చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నాలుగైదు రోజుల పాటు ఈ పాట చిత్రీక‌ర‌ణ సాగుతుంది. గ‌ణేశ్ ఆచార్య ఈ పాట‌కు నృత్య రీతుల‌ను కంపోజ్ చేస్తున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా పుష్ప సినిమా ట్రైల‌ర్‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 6న పుష్ప ది రైజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. అందులో భాగంగా ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో బ‌న్నీ త‌గ్గేదే లే.. అనే లుక్‌లో క‌నిపిస్తుండ‌టం విశేషం. దీంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సుక్కు తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. పుష్ప సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. డిసెంబ‌ర్ 17న తొలి బాగం పుష్ప ది రైజ్ విడుద‌ల‌వుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ పాజిల్ మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇంకా సునీల్‌, అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అదీ కాకుండా, బ‌న్నీ, సుకుమార్ తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ljwENz
v

పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఫైనల్ కట్ రెడీ చేసిన సుకుమార్.. తగ్గేదే లే!!

మోస్ట్ ఎవైటెడ్ మూవీ '' విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది చిత్రయూనిట్. ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచేసిన డైరెక్టర్ .. చిత్ర ట్రైలర్ కూడా రెడీ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 17న రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు సుకుమార్. గత పోస్టర్స్ లాగే మాస్ లుక్ ప్రెజెంట్ చేస్తూ డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దృష్టి డిసెంబర్ 6పై పడింది. ఇప్పటికే విడుదలైన అన్ని వీడియోస్, ఫొటోస్ ఓ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టి 'పుష్ప' ట్రైలర్ అంతకుమించి అనేలా అంటుందని భావిస్తున్నారు ఆడియన్స్. మరోవైపు సుకుమార్ కూడా ట్రైలర్ కట్ చేయడంపై స్పెషల్ కేర్ తీసుకున్నారని సమాచారం. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఓ రకమైన వైబ్రేషన్స్ క్రియేట్ చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టేలా ఉంటుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం. ఈ మూవీలో సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ చేస్తోంది. అల్లు అర్జున్ మాస్ రోల్ చేస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఆయన కనిపించనుండగా.. పల్లెటూరు అమ్మాయిగా రష్మిక మందన ఆడిపాడనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బలమైన ఈ పుష్ప కథను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CWMy6F
v

Sunday 28 November 2021

Bimbisara Teaser: రాచరికం నుంచి మోడ్రన్ యుగం.. బింబిసారుడిగా నందమూరి వారసుడి నెత్తుటి సంతకం

హీరోగా, నిర్మాతగా తనదైన దారిలో వెళుతున్న '' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూనే ఈ మూవీ ప్రమోషన్స్‌ చేపడుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. ''ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బిబిసారుడి ఏకచక్రాధిపత్యం'' అనే పవర్ ఫుల్ డైలాగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుండగా రణరంగంలో శివమెత్తాడు కళ్యాణ్ రామ్. అదిరిపోయే విజువల్స్, అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ టీజర్‌లో హైలైట్ అయ్యాయి. టీజర్ చివరలో కళ్యాణ్ రామ్‌ను రాచరికం నుంచి నేటి మోడ్రన్ యుగంలోకి తీసుకొచ్చారు. విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన బింబిసార పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేయగా.. తాజాగా విడుదలైన ఈ టీజర్ భారీ అంచనాలు నెలకొల్పింది. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ మొన్నామధ్య చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన , హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32GYe0R
v

బిగ్ బాస్‌లో రవికి అన్యాయం!! అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. యాంకర్ షాకింగ్ రియాక్షన్

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అంతా షాకైపోయారు. బిగ్ బాస్ సీజన్ 5లో అప్పటిదాకా బాగా ఆడుతున్నాడనుకున్న రవి.. ఊహించని విధంగా పన్నెండో వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఆయన ఎలా ఎలిమినేట్ అయ్యాడనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. తక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున చెప్పినా అది నిజమని జనం నమ్మడం లేదు. యాంకర్ తట్టుకోలేకపోయిన ఆయన ఫ్యాన్స్.. బిగ్ బాస్‌లో రవికి అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. గత రాత్రి హైదరాబాద్ ఎదుట రచ్చ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రవి లేకుంటే అసలు బిగ్ బాస్ ఎందుకు? అంటూ మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. రవి కంటే తక్కువ ఓట్లు వచ్చినా కొందరిని హౌస్ లోనే కొనసాగిస్తున్నారని, ఓటింగ్ పరంగా చూస్తే మూడో స్థానంలో ఉన్న రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. రవికి కావాలనే అన్యాయం చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇంకొందరైతే ప్రాంతీయ భావాన్ని తెరపైకి తెచ్చి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే రవికి అన్యాయం చేశారని, అందుకే ఎలిమినేట్ చేశారని ఆరోపించడం పలు చర్చలకు తావిచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన రవి.. తన ఎలిమినేషన్‌పై రియాక్ట్ అయ్యారు. తాను ఎలిమినేషన్ అవుతానని ఊహించలేదని, ఎలిమినేషన్‌ అయిన సమయంలో చాలా బాధగా అనిపించిందని, అయితే ఇక్కడ మీ అందరి అభిమానం చూశాక గెలుపు తకదే అని అనుకుంటున్నానని అన్నారు. బిగ్ బాస్ విన్నర్ వాళ్లెవరో చేయడం కాదు మీరు చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రవి. నేను బాగా ఆడానని, తప్పు తీర్పు వచ్చిందని జనం నమ్ముతుండటం పట్ల గర్వంగా ఉందని అన్నారు. తన ఎలిమినేషన్‌పై పూర్తి అనాలిసిస్ చేస్తానని తెలిపారు యాంకర్ రవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3I1sVOr
v

శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి.. ఎమోషనల్ కామెంట్స్

ఫేమస్ సినీ కొరియోగ్రాఫర్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ , నందమూరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి తుది శ్వాస విడిచారనే వార్త మనసును కలచివేసింది. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైనది. ఖైదీ చిత్రానికి సలీం మాస్టర్ నృత్య దర్శకత్వం చేసినా ఆయన అసిస్టెంట్‌గా వెనకుండి డాన్సులు కంపోజ్ చేసింది శివ శంకర్ మాస్టర్. ఆ రోజు మొదలుకొని మగధీర వరకు అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు మరపురాని డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ఆయన్ను చివరిసారిగా 'ఆచార్య' సెట్స్ మీద కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఆయన మరణం కేవలం ఒక నృత్య రంగానికే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు'' అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'' అన్నారు. స్పందిస్తూ.. ''శివ శంకర్ మాస్టర్‌ను కాపాడుకునేందుకు శక్తిమేర కృషి చేశాం. కానీ దేవుడు మరోలా నిర్ణయించాడు. ఆయన మరణవార్త కలచివేసింది'' అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D40qfj
v

శివ శంకర్‌ మాస్టర్‌ జాతకం అలాంటిది! ఇంట్లో అందరూ ఒకటే తిట్లు.. ఆయన జర్నీలో ఆసక్తికర విషయాలు

ప్రముఖ కొరియోగ్రఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ (72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. మరి శివ శంకర్‌.. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎలా మారారు? ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆయన పట్టుదల ఏంటి? లాంటి విషయాలను పరిశీలిస్తే ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మమకారం పెంచుకున్న ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరేమనుకున్నా తన టార్గెట్ రీచ్ అయ్యారు. అప్పట్లో ‘సభ’ అనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివ శంకర్‌ తండ్రి ఓ సభ్యుడు కావడంతో నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేసి తీరాలనే పట్టుదల పెరిగింది. దాంతో ఆయనంతట ఆయనే డాన్స్ నేర్చుకుని 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేసేవారట. అయితే ఓ రోజు ఆయన డ్యాన్సులు చేస్తున్న విషయం వాళ్ళ నాన్నకు తెలియడంతో చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ బాగా తిట్టారట. అలా అలా ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశాక ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడగడంతో ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివ శంకర్ మాస్టర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు. వదిలెయ్‌’ అని చెప్పారట. ఆ తర్వాత మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద నృత్యం నేర్చుకున్న ఆయన.. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికించాలి? లాంటి ఎన్నో విషయాలపై పట్టు సాధించారట. అలా కెరీర్ స్టార్ట్ చేసిన శివ శంకర్ మాస్టర్.. వందల చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు గాను ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు. 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసిన మూడు తరాల కథానాయకులతో స్టెప్పులు వేయించారు. నటుడి గానూ మెప్పించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cX0aUH
v

బ్రేకింగ్ : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు కరోనాతో పోరాడి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోాయాయి. శివ శంకర్ మాస్టర్ మరణ విషయం తెలియడంతో గుండె బద్దలైందని రియల్ హీరో సోనూ సూద్ ఎమోషనల్ అయ్యాడు. కాపాడేందుకు శాయ శక్తులా ప్రయత్నించామని కానీ అవేవీ ఫలించలేదని కన్నీరుమున్నీరయ్యాడు. సినిమా పరిశ్రమ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతుందని సోనూ సూద్ ట్వీట్ వేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు. మెలోడీ పాటలకే కాదు కుర్రకారుకు మత్తెక్కించే హుషారు పాటలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాటకు జాతీయ అవార్డు లభించింది. ఇక దొంగ దొంగది సినిమాలోని మన్మథ రాజా మన్మథ రాజా అనే పాటకు శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫాస్ట్ బీట్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. కేవలం కొరియోగ్రఫర్‌గానే కాకుండా.. నటుడిగా ఎన్నో చిత్రాల్లో తన ప్రతిభను చూపించారు. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన మార్క్ చూపించారు. జబర్దస్త్ వంటి కామెడీ షోల్లోనూ నవ్వించారు. అలా అన్ని రకాలుగా శివ శంకర్ మాస్టర్ దక్షిణాది సినీ ప్రేమికులను అలరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/316a6ch
v

మళ్ళీ ఇన్నేళ్లకు అదే భయం.. నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ సమయంలో! షాకింగ్ విషయం బయటపెట్టిన సమంత

ఈ రోజుల్లో సినిమా ఛాన్స్ రావడమే గొప్ప. అలాంటి ఛాన్స్ ఒడిసిపట్టుకుని స్టార్ స్టేటస్ పట్టేయడమంటే మామూలు విషయం కాదు. ఈ ఫీట్ అలవోకగా అధిగమించిన .. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ నాగ చైతన్యతో ఫస్ట్ మూవీ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. అంతేకాదు ఆనాటి భయాన్ని గుర్తుచేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ మాయ చేశావే అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత.. అదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్న ఈ జోడీ ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలువలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నడుమ మరోసారి తన తొలి సినిమా 'ఏ మాయ చేశావే'ను గుర్తు చేసుకుంది సమంత. తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్న సమంత.. తొలిసారి ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతోంది. '' పేరుతో అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ పిలిప్ జాన్ ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా సినిమా ఆడిషన్స్ గురించి, ఆ భయం గురించి పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది సామ్. మొదటిసారి 'ఏమాయ చేశావే' సినిమా కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్న సమంత.. మళ్లీ ఇప్పటిదాకా ఏ సినిమా కోసం కూడా ఆడిషన్స్ ఇవ్వలేదట. అయితే ఇప్పుడు 'ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌' కోసం మాత్రం మరోసారి ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందట. ఇదే విషయాన్ని చెప్పిన సమంత.. ''పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఆడిషన్స్‌లో పాల్గొన్నా. సరికొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టబోతున్నా. మళ్లీ ఆడిషన్‌కు వెళ్లా. 2009లో ఏమాయ చేశావే సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు ఎలా భయపడ్డానో.. ఇప్పుడు కూడా అదే భయం వెంటాడింది'' అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32zcMPT
v

బండ్ల గణేష్‌ మంచి మనసు.. నిన్ను నిందించే స్థాయి ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికీ లేదు!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌ది ప్రత్యేకమైన స్థానం. కమెడియన్‌‌గా కెరీర్ ఆరంభించి నిర్మాతగా సెట్టయి ఇప్పుడు హీరోగా అవతారమెత్తిన బండ్ల గణేష్ ఏది చేసిన అది సెట్టర్ కావడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలు, రాజకీయాలే కాదు సామజిక దృక్పథం దానికి తోడు దైవ భక్తి మెండుగా ఉన్న ఈ కమెడియన్ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఆయన మంచి మనసు. ఇంతకీ విషయం ఏంటంటారా..? తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు బండ్లన్న. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపను పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటి కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారని చెప్పిన బండ్ల గణేష్.. తాను మాత్రం ఈ పాపను పెంచుకొని గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపారు. తన భార్య చెప్పిందని ఈ నేపాలీ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన బండ్లన్న.. ఇప్పుడీపాప తమ ఇంట్లో మెంబర్‌ అయిపోయిందని, తమ ఇంట్లో వాళ్లందరినీ బెదిరించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో బండ్లన్నపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై ''అన్న నిన్ను నిందించి, అగౌరవ పరిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికీ లేదు'' అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ఆలోచింపజేస్తోంది. ఏదేమైనా సాటి మనిషి పట్ల బండ్ల గణేష్ చూపుతున్న ఆప్యాయతను మెచ్చుకోవాల్సిందే. కరోనా సమయంలో కూడా చాలామందికి తన వంతు సాయం అందించి మంచి మనసు చాటుకున్న .. మరోసారి ఇలా అందరి ప్రశంసలందుకోవడం విశేషం. ఇక బండ్ల గణేష్ సినీ కెరీర్ విషయానికొస్తే.. మరికొద్ది రోజుల్లో 'డేగల బాబ్జి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు తెరపై గతంలో చూడని డిఫరెంట్ కథతో రాబోతున్న ఈ సినిమాలో బండ్లన్న హీరోగా నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ విశేష స్పందన తెచ్చుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rh3kuX
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...