Sunday 30 June 2019

‘దొరసాని’ ట్రైలర్.. ప్రేమ కూడా ఒక ఉద్యమమే!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘దొరసాని’. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. ఇదే ఈయనకు తొలి సినిమా. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 12న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చి్ంది. ఆనంద్ దేవరకొండను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతుంది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆ నాటి కాలాన్ని కళ్లకు కట్టేటట్టు సహజసిద్ధమైన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చిన ఆనంద్ దేవరకొండకు ఆమె చెంబుతో తాగడానికి నీళ్లు ఇస్తుంది. ఆ చెంబు పట్టుకుని ‘మేం తాగొచ్చా’ అని ఆనంద్ అడుగుతాడు. వెంటనే దొరసాని అతనికి ముద్దు పెడుతుంది. ఈ ఎమోషనల్ సీన్ ట్రైలర్‌కే హైలైట్. ఈ సినిమాలో హీరో జైలుకు వెళ్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జైలులో ఉన్న సమయంలో అతనికి ఒక ఉద్యమకారుడు తగులుతాడు. ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే’ అని ఆ ఉద్యమకారుడు అనగానే.. ‘నా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని అంటాడు హీరో. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అచ్చం విజయ్ దేవరకొండలానే అనిపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టుకొట్టేలానే కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xsE9Z3
v

ఇంత అన్యాయమా.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారి ధర్నా

రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వంశస్థులు హీరో రామ్ చరణ్ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు మాటిచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తమను ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. ఉయ్యాలవాడ వంశానికి చెందిన ఒక మహిళ రామ్ చరణ్ ఆఫీసు ముందు మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ వచ్చి మా ఇండ్లలోకి దూరి షూటింగ్‌లు చేసుకున్నారు. ‘సైరా’ సెట్ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం కూడా మాదే. మా సొంత ప్రాపర్టీలో వీళ్లు సెట్ వేసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు వీళ్లు ఎవరూ లేకపోయినా మేం వెళ్లాం. తిరుపతి ప్రసాద్ అనే వ్యక్తి చరణ్ బాబు మీకు న్యాయం చేస్తారని మాటిచ్చారు. నా భర్తను నన్ను తీసుకెళ్లి చరణ్ బాబుతో మాట్లాడించారు. మా దగ్గర ఆధారాలున్నాయి(ఫొటోలు). మమ్మల్ని తల్లిదండ్రులులా రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా మాట్లాడారు. న్యాయం చేస్తానన్నారు’ అని ఆమె వెల్లడించారు. అయితే, 30 రోజుల తరవాత తాము తిరుపతి ప్రసాద్‌కు ఫోన్ చేస్తే పరిహారం అడిగే హక్కు మీకులేదంటూ మాట దాటేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ప్రాపర్టీలో ఆరబోసిన ధాన్యం, శనగలు, దనియాలు తొక్కకుంటూ పోయి షూటింగ్ చేశారు. ఇప్పుడు మేం ఇక్కడికొస్తే మా ప్రాపర్టీలో కూర్చోవద్దు అంటున్నారు. లీగల్‌గా మీకు హక్కులేదు అంటున్నారు. ఏంటి ఈ అన్యాయం. కోట్ల బిజినెస్ చేసుకుంటున్నారు. మా రక్తం అది. మా బంధం అది’ అంటూ ఆమె ఆవేశంగా మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. కాగా, చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ‘సైరా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XGp8lg
v

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు.. సి.కళ్యాణ్ ఘన విజయం

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘మ‌న కౌన్సిల్‌-మ‌న ప్యానెల్‌’ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నిక‌ల్లో సి.క‌ల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 477 ఓట్లు పోలుకాగా సి.కళ్యాణ్‌కు 378 వచ్చాయి. కళ్యాణ్ ప్రత్యర్థి ఆర్కే గౌడ్‌కు డిపాజిట్ దక్కలేదు. ఆయనకు కేవలం 95 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లలేదు. కాగా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులుగా కె.అశోక్‌కుమార్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి.. సెక్రట‌రీగా టి.ప్రస‌న్నకుమార్‌, మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రటరీగా, ట్రెజ‌ర‌ర్‌గా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. అలాగే ఈసీ మెంబ‌ర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వ‌ల్లభ‌నేని, బండ్ల గ‌ణేశ్‌, ఆచంట గోపీనాథ్, ప‌ల్లి కేశ‌వ‌రావు, శివ‌లెంక కృష్ణప్రసాద్‌, జి.వి.న‌ర‌సింహారావు, ఎస్‌.కె.న‌యీమ్ అహ్మద్‌, ప‌రుచూరి ప్రసాద్‌, టి.రామ‌స‌త్యనారాయ‌ణ‌, వి.సాగ‌ర్‌, వ‌జ్జా శ్రీనివాస‌రావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంక‌టేశ్వర‌రావు, వి.వెంక‌టేశ్వర‌రావు ఎన్నిక‌య్యారు. అధ్యక్షుడుగా ఎన్నికైన సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధ‌న్యవాదాలు. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌ను కాపాడ‌టానికి, హక్కుల కోసం పోరాటం చేయ‌డానికి మా మీద న‌మ్మకంతో ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా మ‌న ప్యానెల్ త‌ర‌పున ధ‌న్యవాదాలు. మా మీద ఈర్ష్యతోనో, బాధ‌తోనో, కోపంతోనో, మ‌రే ఇబ్బందుల్లో ఉండో ఈరోజు ఓటింగ్‌కి రాలేక‌పోయిన వారికి కూడా మా ధ‌న్యవాదాలు. ఎందుకంటే ఇది క్లిష్టమైన పరిస్థితి. 1999 నుండి నేను హైద‌రాబాద్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో కీల‌క మెంబ‌ర్‌గా ఎదుగుతూ వ‌చ్చాను. ఎలాంటి ఎన్నిక‌లు లేకుండా, ఆర్గనైజేష‌న్ విడిపోయింది. దాన్ని ఒక‌టిగా క‌లుపుదామ‌నే స‌దుద్దేశంతో పెద్దల‌తో చ‌ర్చించి, ఒక ప్యానెల్‌గా ఉండాల‌ని నిర్ణయించుక‌న్నాం. నేను, ప్రస‌న్నకుమార్‌, ఆదిశేష‌గిరిరావు, మ‌ల్టీడైమ‌న్షన్ రామ్మోహ‌న్‌రావు, చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుతో చ‌ర్చించి అంద‌రం ఒక తాటిపై ఉండాల‌ని నిర్ణయించుకున్నాం. ప‌ద‌వీ వ్యామోహ‌ం ఏమో కానీ.. ఓ ఆర్గనైజేష‌న్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి క‌నీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేక‌పోయాడు. అలాంటి సంద‌ర్భంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డ‌మే వృథా. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఉండుంటే ల‌క్ష, ల‌క్షన్నర రూపాయలు మిగిలి ఉండేవి. అది ఓ చిన్న నిర్మాత‌కు ఉప‌యోగ‌ప‌డేవి. జ‌రిగిందేదో జ‌రిగింది. ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ దారికి వ‌చ్చి లీడ్ చేయాల్సిందే. పుట్టగొడుగుల్లాంటి ఆర్గనైజేష‌న్స్ వ‌స్తే అవి బత‌క‌వు. అంద‌రం వ్యాపారం చేసుకునేవాళ్లమే. ఎవ‌రు ఎన్ని ఆర్గనైజేష‌న్స్ పెట్టినా, ముందు ఇక్కడ‌కు వ‌చ్చి ఎదిగిన‌వాళ్లే. ఆర్గనైజేష‌న్ ఒక‌టిగా ఉండ‌టానికి ఎన్నికైన 23 మంది ఎలాంటి త్యాగం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. ఎన్నిక‌లు కాగానే మీ వెనుక నేనున్నానంటూ మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. రేపు ఆయ‌న్ని వెళ్లి క‌లుస్తున్నాం. ఆయ‌న స‌హ‌కారంతో, అంద‌రి సినీ పెద్దల స‌హకారంతో అంద‌రికీ న్యాయం జ‌రిగేలా పోరాటం చేస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను. మా పోరాటం జ‌ర‌గ‌ని రోజు రోడ్డు మీద‌కి వ‌చ్చి ధ‌ర్నాలు చేసి ఆర్గనైజేష‌న్‌ను నిల‌బెట్టుకోవ‌డానికి నేను ముందుంటానని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసుకుంటున్నాను. ఆర్గనైజేష‌న్ ఒక‌టిగా ఉండాల‌నేదే మా స్లోగ‌న్‌. సంక్షేమం జ‌ర‌గాలి. ట్రైల‌ర్స్ కానీ, యాడ్స్ కానీ.. ఏదైనా కానీ.. ఈ కౌన్సిల్ నుండే పంపాలి, వేరే దొంగ‌చాటు వ్యాపారం వ‌ద్దు. గిల్డ్ వాళ్లు కూడా ఈ ఆర్గనైజేష‌న్‌లో ఉండాల‌ని కోరుతాం. అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ‌తాం’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FFfSn5
v

పాలకొల్లులో ‘జనసేన’ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్.. ఇప్పటికే అన్నీ సిద్ధం

సినీ హీరోగా టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించడంతో పాటు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవర్ స్టార్ వాటన్నిటినీ వదిలి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ, హీరోగా పవన్‌ను ఆదరించిన ప్రజలు నాయకుడిగా మాత్రం ఎన్నుకోలేదు. అయినప్పటికీ తన జీవితం ప్రజాసేవకే అంకితం అని పవన్ చెప్పకనే చెప్పారు. ఓడినా గెలిచినా తాను ప్రజలకు అండగానే ఉంటానని అంటున్నారు. ఓ వైపు రాజకీయాలు చూసుకుంటూనే ఔత్సాహిక యువత కోసం ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను ఆదివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, ఈ సందర్భంగా పాలకొల్లులో జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హరిరామ జోగయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా ఉంటారు. నిర్మాత బన్నీ వాసు ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలు చూసుకుంటారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు.. ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో శ్రీ ఎస్‌.వి.రంగారావు ఫిల్మ్‌ ఇన్ఫిట్యూట్‌‌ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్ఫిట్యూట్‌ కి హరిరామ జోగయ్య గారు చైర్మన్‌‌గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. పవన్‌ కల్యాణ్‌ గారికి అభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహాయసహకారాలు ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకొంటూ అందరినీ సురక్షితంగా చూసుకొనే పార్టీ ఇది. అందరం పవన్‌ కల్యాణ్‌ గారి వెన్నంటి నడుద్దాం. పాలకొల్లు ఫిల్మ్‌ ఇన్నిట్యూట్‌‌లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తాం. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయింది. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్‌ కల్యాణ్‌ వస్తారు’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IZW8gn
v

ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు అన్నారు: సందీప్ కిషన్

కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హీరో సందీప్ కిషన్ సుధీర్ఘంగా మాట్లాడారు. తన ఆవేదనను, కసిని చెప్పుకున్నారు. "అందరూ నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక యాక్టర్‌‌కు అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని తట్టుకోలేమేమో అని థియేటర్‌కి వెళ్లలేదు. ఆ సమయంలో విదేశాలు వెళ్లాను. ఇక్కడి నుంచి బయటకు వెళితే కాస్త బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి బాగా లావు అయ్యాను. మళ్లీ బరువు తగ్గి సినిమాలు చేద్దాం అనుకుని మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తిని కలిశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... 'ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు. కొత్త హీరోలు వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు' అన్నారట‌. ఆ మాట అన్న వ్యక్తికి థాంక్యూ ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్ల ఈ సినిమా చేశా. ఎందుకు అంటే.. నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నమ్మిన సినిమాలే చేస్తున్నా‌. సినిమాలు మానేసి బయటకు వెళ్లి పోయే పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒక్కటైనా చేసి వెళ్లిపోవాలి తప్ప రెగ్యులర్‌గా వెళ్ళిపోయాడనే మాట ఉండకూడదు. అలా అయితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి, నేను కన్న కలలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు జెమినీ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు. నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని వాళ్లకు చెప్పగానే వద్దన్నారు. వాళ్లు నాకు కొండంత అండగా నిలబడ్డారు. అనిల్ గారు మా సినిమాకు ప్రజెంటర్. ఈ సినిమా ఆయనది కూడా. ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసినది ఆయనే. ఆయన కాకుండా దయా పన్నెం నా ఫ్రెండ్, పార్ట్‌నర్.. ఎంతో అండగా నిలబడ్డాడు. నేను కథ చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు. నన్ను నమ్మారు. నిన్న సినిమా చూశాక దయా హగ్ చేసుకున్నాడు. మనం అనుకున్నది కరెక్ట్‌గా తీశామనే ధైర్యాన్ని ఇచ్చాడు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాం. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాం. హిట్ కొట్టాలని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్‌కి మంచి పేరు తెచ్చిపెడతా. మా దర్శకుడు కార్తీక్ రాజుగారిది 'జెర్సీ'లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే.. ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అని సందీప్ కిషన్ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RLgkoS
v

‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్.. సందీప్ కిషన్ అద్దంలో వెన్నెల కిషోర్‌లా!

ఇప్పటి వరకు హీరోగా సత్తాచాటిన ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, వి స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇవి చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. కానీ, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం భయపెడుతోంది. ‘400 సంవత్సరాల క్రితం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్నపిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయన రూపం కనిపించింది. ఆ ఊరివాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు. చదివిన విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తూన్నాను’ అంటూ చర్చి ఫాదర్ హీరోయిన్‌తో చెప్పడంతో సినిమా స్టోరీ లైన్ ఏంటో అర్థమైంది. సందీప్ కిషన్ అద్దంలో చూసుకున్నప్పుడు అతని రూపం వెన్నెల కిషోర్‌లా కనిపిస్తోంది. ఇదే అతని లోపం. ఇలాంటి క్లిష్టమైన స్టోరీలైన్‌తో స్క్రిప్టును ఎలా తీర్చిదిద్దారు, స్క్రీన్‌ప్లే ఎలా ఉండబోతోంది అనేవి ఆసక్తికరం. సినిమా చూస్తుంటే రొమాన్స్, కామెడీ, యాక్షన్‌కు లోటు ఉండదని అర్థమవుతోంది. చూద్దాం రేపు తెరమీద సందీప్ కిషణ్ ఏ మాయ చేయబోతున్నారో! ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FIspWX
v

కృష్ణను పరామర్శించిన చంద్రబాబు, బాలయ్య

భార్య విజయనిర్మలను కోల్పోయి బాధలో ఉన్న నటశేఖరుడు కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గల్లా జయదేవ్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. వీరి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు, తనయుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఈనెల 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో 27వ తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోకసంద్రంలో ముగినిపోయారు. 50 ఏళ్లుగా ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జీవించారు. ఎక్కడివెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ బాధను తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. కన్నీమున్నీరు అయ్యారు. శోకసంద్రంలో ముగినిపోయిన కృష్ణను ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య.. కృష్ణను ఓదార్చారు. కృష్ణను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయనిర్మల మరణవార్త తనను ఎంతగానో బాధ కలిగించిందని అన్నారు. నటిగానే కాకుండా రాజకీయ నేతగా ఆమెతో దగ్గర సంబంధాలున్నాయని చంద్రబాబు చెప్పారు. 1999లో టీడీపీ తరఫున కైకలూరు నుంచి విజయనిర్మల పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. కృష్ణ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZRqSWm
v

శ‌ర్వానంద్ హీరోగా మరో చిత్రానికి ‘శ్రీకారం’

హీరో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా.. ఎన్నారై శ‌శికాంత్ వ‌ల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మాటల రచయిత సాయిమాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించ‌గా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా శర్వానంద్‌కు గాయమైంది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. గుబురు గెడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. శర్వా సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘స్వామి రారా’ సినిమాతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xa5iKZ
v

Saturday 29 June 2019

‘ఓ బేబీ’ సరికొత్త ప్రయోగం.. సామ్ అదరగొట్టింది: వెంకటేశ్

‘ఓ బేబీ’లాంటి కథలు ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలని అన్నారు విక్టరీ వెంకటేశ్. కీలకపాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేశ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జులై 5న ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. ఇలాంటి కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నందినీరెడ్డిని అభినందిస్తున్నా. బేబీ పాత్రలో సమంత అదరగొట్టేసింది. తెలుగులో ఇప్పటివరకు రాని కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. రానా మాట్లాడుతూ.. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకునే వాళ్లలో నేనూ ఉంటా. బేబీ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి. బేబీగా సమంత నటన సూపర్బ్’ అని అన్నారు. సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని: రాజేంద్రప్రసాద్ ‘‘ఓ బేబీ’లో నటిస్తుంటే హాలీవుడ్ సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది. మంచి పాత్రలు ఎంపిక చేసుకోవడం వల్లే ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగగలిగా. ‘అహనా పెళ్లంట’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చింది. గతంలో నేనే నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే ‘ఓ బేబీ’లో పాత్ర మరో ఎత్తు. ఈ సినిమాలో లక్షీకి, సమంతకు నేనే బాయ్‌ఫ్రెండ్‌ని’


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YkJvl2
v

నటుడు వేణుమాధవ్ ఇంట విషాదం.. వారం కిందటే పెళ్లి, అంతలోనే గుండెపోటు

హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు. శుక్రవారం (జూన్ 28) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల స్థానిక కార్పొరేటర్‌ అంజయ్య, పలువురు స్థిరాస్తి వ్యాపారులు, టీఆర్‌ఎస్ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం సాయంత్రం లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో విక్రమ్ బాబు అంత్యక్రియలు పూర్తిచేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FF4tUA
v

‘రణరంగం’ టీజర్.. శర్వానంద్ వైవిధ్య భరితమైన పాత్రలో

తొలి చిత్రం ‘స్వామి రా.. రా..’తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కుతోన్న ‘రణరంగం’ టీజర్ విడుదలైంది. శర్వానంద్ ఇందులో గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది.. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాల’ని శర్వానంద్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కాజల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ‘కొందరికి అతను నేరస్థుడు. మిగిలిన వారికి అతను హీరో’ అంటూ 90ల నాటి కాలం కథతో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకుంది. ‘కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు’ అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌‌ను బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FFNz8n
v

Friday 28 June 2019

Dear Comrade: ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే...’ సాంగ్ ప్రోమో

‘గీతాగోవిందం’ సూపర్‌హిట్ తర్వాత , రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మకు ఇదే తొలిచిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను యూట్యూబ్‌ ద్వారా యూనిట్ విడుదల చేసింది. వీటిలో ‘కడలల్లే వేచె కనులే’, ‘గిర గిర గిర’, పాటలు యూత్‌ను ఊపేస్తున్నాయి. అయితే సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పక్కా యూత్ సాంగ్‌ను సిద్ధం చేశారు మ్యూజిక్ డైరెక్టర్. దీనికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ‘కాలేజీ క్యాంటీన్ అంటేనే ప్రేమ పక్షులకు హెవెను..’ అంటూ సాగే పల్లవిని నాలుగు భాషల్లో యూనిట్ సభ్యులతో పాడించారు. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్‌ను రెడీ చేస్తుండగా యూనిట్ సభ్యులు వచ్చి ఏం సాంగ్ చేస్తున్నారు సార్ అని అడుగుతారు. దానికి ఆయన మరో మెలోడీ చేస్తున్నా అని సమాధానం ఇస్తారు. ఇప్పటికి కంపోజ్ చేసిన పాటలన్నీ మెలోడీయే అని.. మళ్లీ మెలోడీయే చేస్తే ఎవరు చూస్తారని వారు అసహనం వ్యక్తం చేస్తారు. అదే సమయంలో ఆ రూమ్‌లోకి వచ్చిన విజయ దేవరకొండకు ఈ విషయం చెప్పినా ఆయన లైట్ తీసుకుని ఫోన్ వస్తే మాట్లాడేందుకు బయటకు వెళ్లిపోతారు. అయితే యూనిట్ సభ్యులంతా ఒత్తిడి చేయడంతో మ్యూజిక్ డైరెక్టర్ కాలేజీ నేపథ్యంలో ఓ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేస్తారు. ఈ పాట పల్లవిని కన్నడలో రష్మిక పాడగా.. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఒక్కొక్కరు పాడారు. అదే సమయంలో ‘ఈ సాంగ్‌లో నేను లేనుగా.. ఇక్కడెందుకు కూర్చున్నాను’ అనుకుంటూ రష్మిక బిత్తర చూపులు చేస్తూ ఉండటం ఫన్నీగా ఉంది. చివర్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సింగిల్ టేక్‌లో కొట్టినం... మజా వస్తది’ అంటూ వారితో కలిసి సందడి చేశారు. ఆ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X5PI2R
v

Bigg Boss Telugu 3: హోస్ట్‌గా నాగార్జున.. అదిరిపోయే ప్రొమోతో అఫీషియల్ అనౌన్స్‌మెంట్

సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లుగా ఎవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ హోస్ట్‌ ఎవరనే విషయం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఫస్ట్ సీజన్లో హోస్ట్‌గా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సీజన్‌కు దూరమయ్యారు. దీంతో రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. తర్వాత ఆయన కూడా తనదైన శైలిలో షోను నడిపించారు. ఈసారి నాని స్థానంలో కొత్త హోస్ట్ ఎవరనే విషయమై తీవ్ర ప్రచారం జరిగింది. హోస్ట్ విషయమై మా టీవీ అఫీషియల్‌గా ప్రకటన చేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను విజయవంతంగా నడిపిన ఈ సీజన్లో హోస్ట్‌గా వ్యవహరిస్తారని మా టీవీ ట్వీట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం వంద రోజులకు సరిపడా కూరగాయలు, కోడి గుడ్లు కొనుగోలు చేయడం కోసం మార్కెట్‌కి వెళ్లినట్టుగా నాగార్జునతో ప్రొమో రూపొందించి వదిలింది. ఈసారి నేను రంగంలోకి నేను దిగుతున్నానంటూ.. నాగ్ బిగ్ బాస్ ప్రారంభానికి ముందే ప్రోమోతో ఆకట్టుకున్నారు. జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. వంద రోజులపాటు నడిచే ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనున్నారు. వారాంతాల్లో హోస్ట్‌గా నాగార్జున అపియరెన్స్‌తో మహిళా ప్రేక్షకులు మరింతగా ఈ షోకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xt3B0V
v

‘బ్రోచేవారెవరురా’ సినిమా రివ్యూ

తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న డైరెక్టర్, వైవిధ్యభరిత చిత్రాల్లో నటించే హీరో కాంబినేషన్లో వచ్చిన చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. కామెడీ నవ్విస్తూ, సస్పెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XEgYKb vishnu-nivetha-thomas-starrer-brochevarevarura-telugu-movie-review-and-rating/moviereview/69989957.cms
v

అశ్రునయనాల మధ్య విజయ నిర్మలకు తుది వీడ్కోలు.. బోరున విలపించిన కృష్ణ

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ సినీ చరిత్రలో ఏ మహిళా దర్శకురాలికి సాధ్యంకాని అరుదైన గుర్తింపు పొందిన విజయ నిర్మలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. తొలుత నానక్‌రామ్ గూడలోని ఆమె ఇంటి నుంచి పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు, అక్కడ కాసేపు ఉంచి మెయినాబాద్‌ మండలం చిలుకూరు సమీపంలో వారి ఫామ్‌హౌస్‌‌‌కు తరలించారు. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తిచేశారు. అభిమాన నటి కడసారి చూపుకోసం అభిమానులు, ప్రజలు భారీగా తలివచ్చారు. మరణంతో ఆమె భర్త కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. చివరిసారిగా విజయ నిర్మల పార్ధీవదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఈ సమయంలో ఆయన పరిస్థితి చూసినవారందరూ కంటతడి పెట్టుకున్నారు. శాస్త్రోక్తంగా అన్నింటి పూర్తిచేసి కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు. నటిగా, దర్శకురాలిగానే కాదు, కుటుంబ పెద్దగానూ తనదైన ముద్రవేశారు. అప్పట్లో సినిమా షూటింగ్‌లతో కృష్ణ బీజీగా ఉంటే కుటుంబాన్ని ఆమె చూసుకున్నారు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. అంతకు ముందు మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని.. 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XebIxl
v

‘కల్కి’ సినిమా రివ్యూ

ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఎమ్మెల్యే తమ్ముడి హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపిస్తారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NjMolh
v

విజయనిర్మల కల.. కలగానే మిగిలిపోయింది

సినిమా ప్రపంచంలోనే ఏ మహిళకు దక్కని రికార్డును సొంతం చేసుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించిన ఆమె తెలుగు సినిమా పరిశ్రమకే మకుటంగా నిలిచారు. అయితే సినీ రంగంలో ఎన్నో ఘనతలు సాధించిన విజయనిర్మల తన కలను నెరవేర్చుకోకుండానే దివికేగడం విషాదకరం. ఇంతకీ ఆమె కల ఏమిటో తెలుసా?. 50 చిత్రాలకు దర్శకత్వం వహించడం. 44 సినిమాలకు దర్శకత్వం వహించిన విజయనిర్మల ఎప్పటికైనా హాఫ్ సెంచరీ కొట్టాలని అనుకునేవారట. దాని కోసం ఎంతో తపించిన ఆమె కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ‘2009లో వచ్చిన నేరము-శిక్ష’ ఆమె 44వ సినిమా. ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్లు కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో దాదాపు నాలుగేళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె 2013లో మరో సినిమా చేసేందుకు కసరత్తులు చేసేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేశ్‌బాబు మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆమెకు తెగ నచ్చేసింది. ఈ సినిమా స్ఫూర్తితోనే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలని అనుకున్నారట. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆమె 50 చిత్రాల టార్గెట్ కలగానే మిగిలిపోయింది. ఇప్పటికే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు విజయనిర్మల పేరు మీదే ఉంది. అయితే ఆమె చివర కోరిక నెరవేరకపోవడం మాత్రం అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LvNXtw
v

‘దేవదాసు’ ఫ్లాప్ తర్వాత మెగా ఫోన్ పట్టనన్నారు.. కానీ

ఆరు దశాబ్దాల సినీ కెరీర్.. 200 సినిమాల్లో నటన, 44 చిత్రాలకు దర్శకత్వం, 10కి పైగా సినిమాల నిర్మాణం. ఇది చాలదా గురించి చెప్పుకోవడానికి. సామాజిక, కుటుంబ, రాజకీయ కథాంశాలతో 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల ఒకానొక సమయంలో డైరెక్షన్‌కు స్వస్తి చెబుదామనుకున్నారట. కానీ భర్త కృష్ణ వద్దని వారించడంతో నిర్ణయం మార్చుకున్నారట. 1971లో ‘మీనా’తో డైరెక్షన్ మొదలుపెట్టిన విజయనిర్మల ‘దేవుడే గెలిచాడు’, ‘డాక్టర్‌ సినీ యాక్టర్‌’ ‘పంచాయితీ’, ‘రౌడీ రంగమ్మ’, ‘ముఖ్యమంత్రి’, ‘మూడు పువ్వులు ఆరు కాయలు’,‘రామ్‌ రాబర్ట్‌ రహీం’, ‘ఖైదీ కాళిదాసు’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘భోగీ మంటలు’, ‘అంతం కాదిది ఆరంభం’, , ‘బెజవాడ బెబ్బులి’, , ‘ముక్కోపి’, ‘లంకె బిందెలు’ ‘కలెక్టర్‌ విజయ’, ‘అజాత శత్రువు’, ‘పుట్టింటి గౌరవం’, ‘నేరము శిక్ష’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అయితే కృష్ణతో జతకట్టి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు తీరని ఆవేదనను మిగిల్చింది. 1974లో విడుదలైన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై దారుణ పరాజయం పాలైంది. దీంతో మనస్తాపం చెందిన విజయనిర్మల దర్శకత్వానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమెను వారించిన భర్త కృష్ణ జయాపజయాలు పట్టించుకోకుండా డైరెక్షన్ చేయాలని సూచించడంతో మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం మీద తీసిన ‘సాహసమే నా ఊపిరి’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు ఓసారి ఎదురైన ఎన్టీఆర్? నా ఇంకా సినిమాలు తీసే ఆలోచన ఉందా? అని సరదాగా అడిగారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XzlIR9
v

Thursday 27 June 2019

శోకసంద్రంలో కృష్ణ.. మామ పరిస్థితిపై గల్లా జయదేవ్ భావోద్వేగం

ప్రముఖ దర్శకురాలు, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి విజయనిర్మల (73) అంతిమ యాత్ర కొనసాగుతోంది. తొలుత నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చిలుకూరులోని విజయగార్డెన్స్‌కు తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతోపాటు ఎంపీ , అరుణకుమారి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వేలాది మంది అభిమానులు కూడా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. మరికాసేపట్లో చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ నటుడు ఉపేంద్ర సైతం అంతిమ యాత్రలో నరేశ్ వెంట ఉన్నారు. Read Also: మెయినాబాద్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటన్నారు. ఆయన బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని ఆయన అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు. ఆమె మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కృష్ణ, విజయనిర్మలలు కలిసి కష్టాలను, సుఖాలను పంచుకున్నారని, ఆమె ఓ డేరింగ్ మహిళని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KJVmWU
v

విజయ నిర్మల ఇంట్లో వైఎస్ ఫోటోలు చూసి భావోద్వేగానికి గురైన జగన్‌!

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఎం నానక్‌రూమ్ గూడలోని ఆమె నివాసానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోని ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని జగన్‌కు విజయ నిర్మల కుమారుడు నరేశ్ చూపించారు. ఆమెకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నరేశ్ వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్ పై ఆ ఫోటోలకు పూలమాలలు వేసి ఉన్నారు. ఈ ఫోటోలనూ చూస్తూ ఒకింత భావోద్వేగానికి గురైన జగన్, నరేశ్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సినీ రంగానికి విజయ నిర్మల చేసిన సేవలను జగన్ కొనియాడారు. Read Also: ఇదిలా ఉండగా కృష్ణ, వైఎస్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌తో చాలా దగ్గరగా ఉండేవారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. అయితే, తన విజయం వెనుక వైఎస్ కూడా ఉన్నారనే అప్పట్లో కృష్ణ చెప్పేవారు. తదనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నా, వైఎస్ కుటుంబంతో కృష్ణ సాన్నిహిత్యంగానే ఉంటూ వచ్చారు. ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తొలుత వైసీపీలోనే ఉన్నారు. ఏపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన టీడీపీలో చేరారు. సోదరి గల్లా అరుణకుమారి సైతం వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆమె చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి మంత్రిగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lpkfqo
v

విజయనిర్మల మృతి... ‘అమ్మ’ను కోల్పోయామంటున్న నానక్‌రామ్‌గూడ వాసులు

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మృతి సినీ పరిశ్రమతో పాటు ఆమె నివాసముంటున్న ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. తాము ‘అమ్మ’ అంటూ ఆప్యాయతగా పిలుచుకునే విజయనిర్మల ఇకలేరని తెలుసుకున్న నానక్‌రామ్‌గూడ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏ కష్టమొచ్చినా ఆమె చూసుకుంటారులే అన్న భరోసాతో ఉండే స్థానికులు ఇప్పుడు తమ కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనిర్మలకు నానక్‌రామ్‌గూడ ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడే తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆమె మూడు దశాబ్దాల క్రితమే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల నుంచి భర్త కృష్ణతో కలిసి అక్కడే ఉంటున్నారు. నానక్‌రామ్‌గూడ ప్రాంత వాసులకు పెద్దదిక్కుగా ఉంటూ ఆ గ్రామ బాగోగులు చూసుకుంటున్నారు. గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే వారితో కలిసి పోయేవారు. Also Read: ఆ ప్రాంతంలోని పోచమ్మ ఆలయాన్ని విజయనిర్మల 20ఏళ్ల క్రితమే దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆలయ పూజారికి నెలనెలా జీతం ఆమే ఇస్తున్నారని అక్కడివారు చెబుతున్నారు. నానక్‌రామ్‌గూడలో ఏటా అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికి కృష్ణ-విజయనిర్మల దంపతులు హాజరై అన్నదానం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.

తమ ప్రాంత వాసులకు కష్టమొచ్చినా నేనున్నానంటూ విజయనిర్మల ముందుండేవారని గుర్తుచేసుకుంటూ అక్కడివారు కన్నీరుమున్నీరవుతున్నారు. పనివాళ్లను సొంత మనుషులుగా చూసుకునేవారని, వారికి ఇళ్లు కట్టించి, పిల్లలకు పెళ్లిళ్ల ఖర్చు కూడా భరించారని గ్రామస్థుడొకరు చెప్పారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరై అందరినీ పలకరించేవారని, ఆమె మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. తమకు తోడుగా ఉండి ‘అమ్మ’లా చూసుకునే విజయనిర్మల ఇకలేరన్న విషయం నమ్మలేకపోతున్నామంటూ భోరున విలపిస్తున్నారు. Also Read: Also Read:



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JcIu8j
v

విజయనిర్మల అంతిమయాత్ర.. ఫిల్మ్ ఛాంబర్‌కు పార్థీవదేహం

బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ప్రముఖ నటి అంత్యక్రియలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలిస్తారు. అక్కడే విజయ నిర్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతకు ముందు ఏపీ సీఎం జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ‌కృష్ణ, నరేశ్‌లను వీరంతా ఓదార్చారు. నానక్‌రామ్‌ గూడలోని ఆమె నివాసం నుంచి బంధులువు, అభిమానుల కన్నీటి మధ్య కడసారి యాత్ర మొదలైంది. ముందు ప్రకటించినట్టు ఉదయం 11.00 గంటలకే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నా, కొంత ఆలస్యమైంది. మరోవైపు అంతిమయాత్రకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు. మరోవైపు, విజయ నిర్మల మరణవార్తను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. తన ప్రాణం వదిలివెళ్లిపోయిందని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరి తరంకావడంలేదు. విజయనిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తునన కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XDrlxO
v

విజయ నిర్మలకు నివాళులర్పించి కృష్ణను ఓదార్చిన జగన్

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం ఉదయం తన నివాసం లోటస్‌పాండ్‌‌ నుంచి నానక్‌రామ్‌గూడ‌లోని కృష్ణ నివాసానికి వెళ్లారు. ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేడు ఆమె పార్ధివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి, అక్కడ కొద్ది సేపు ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చిలుకూరులోని ఫాంహౌస్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల బహుముఖ ప్రతిభ చూపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 200 పైచిలుకు చిత్రాల్లో నటనతో మెప్పించారు. 44 చిత్రాలకి దర్శకత్వం వహించి, 15 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో తొలి చిత్రం మీనాతోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా విజయనిర్మల ‘మచ్ఛరేఖై’ (1953) అనే తమిళ సినిమాలో తొలిసారి నటించిన విజయ నిర్మలకు వితెలుగులో తొలి చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’. మలయాళంలో తొలి హారర్‌ చిత్రం ‘భార్గవి నిలయం’తో కథానాయికగా పరిచయమయ్యారు. తెలుగులో కథానాయికగా ‘రంగులరాట్నం’తో ఆమె ప్రస్థానం ప్రారంభమైంది. కవిత అనే మలయాళ చిత్రంతో ఆమె తొలిసారి దర్శకత్వం వహించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J9WYpv
v

Evaro Evaro Making Video | Kalki Movie


Evaro Evaro Making Video | Kalki Movie

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2KIybMp

America Naa America Full Video Song | ABCD Movie


America Naa America Full Video Song | ABCD Movie

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2RG6kNN

Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani


Kallallo Kala Varamai Full Lyrical | Dorasaani

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/320L0Hh

Ningilona Paalapuntha Cover Song | Dorasaani


Ningilona Paalapuntha Cover Song | Dorasaani

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2ZZ1BK1

Muddabanthi Lyric - Kousalya Krishnamurthy


Muddabanthi Lyric - Kousalya Krishnamurthy

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2XB8Uda

Nijamena Full Video Song | Sita


Nijamena Full Video Song | Sita

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2X9SetX

‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టు కొట్టేశారు!

సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. తన స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందిస్తున్నారు. కిందటేడాది ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది కూడా ఓ వైవిధ్యమైన చిత్రంతో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము - చిత్రమే చలనము’ అనేది ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ మన్యం నిర్మించారు. సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు కొత్తగా ఉందే అన్నారంతా. ఇక పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార కార్యక్రమాలతో సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను పిలిచి సినిమా స్థాయిని పెంచారు. హీరో నాని కూడా సినిమా హిలేరియస్‌గా ఉందంటూ కితాబిచ్చారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో పడిపోయింది. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా చేశారట. తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా మొత్తంగా సినిమా మాత్రం బాగుందని టాక్. కొంత మంది అయితే ఇప్పటి వరకు థియేటర్‌లో ఇంతలా తాము నవ్వలేదని ట్వీట్లు చేస్తున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, మిస్ కావొద్దని సలహా ఇస్తున్నారు. మొత్తంమీద ‘బ్రోచేవారెవరురా’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ఇలాంటి టాక్ వచ్చిందంటే శ్రీవిష్ణు హిట్టుకొట్టినట్టే!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xgrTej
v

‘బ్రోచేవారెవరురా’: పొట్టచెక్కలవ్వాల్సిందే.. నాని ఫస్ట్ రివ్యూ

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న చిన్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఒక కొత్త కథాంశమే.. ఒక ప్రయోగమే. ఈసారి కూడా డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చిన్నదే అయినా దీనికి కల్పించిన ప్రచారంతో ప్రేక్షకుల్లో్ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మంచి తారాగణం తోడవడంతో ప్రేక్షకుల దృష్ణి ఈ సినిమాపై పడింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు’ అని వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ కూడా చెప్పారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి పొట్టచెక్కలవడం ఖాయమట. ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు ఒకరోజు ముందు అంటే గురువారం నాడు నాని ఈ సినిమాను చూశారు. చూసిన తరవాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘ఇప్పుడే ‘బ్రోచేవారెవరురా’ చూశాను. కచ్చితంగా విపరీతంగా నవ్విస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ రాలేదు. విష్ణు, నివి, సత్య, నివేతా పేతురాజ్, రాహుల్, దర్శి అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్షన్, మ్యూజిక్‌తో ఇద్దరు వివేక్‌లు అదరగొట్టారు. రేపు విడుదలవుతోంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని తన ట్వీట్‌లో నాని పేర్కొన్నారు. కాగా, యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. మరికాసేపట్లో టాక్ ఏంటో తెలిసిపోతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FEp3nV
v

విజయ నిర్మలకు నివాళులు అర్పించిన చిరంజీవి.. కృష్ణ, నరేష్‌లను ఓదార్చిన మెగాస్టార్

ప్రముఖ నటి, దర్శకురాలు భౌతిక కాయానికి మెగాస్టార్ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి వెళ్లిన ఆయన.. విజయ నిర్మల పార్థీవ దేహం వద్ద అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ, నరేష్‌లను ఆయన పరామర్శించారు. జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విషాద వదనంతో ఉన్న కృష్ణను జీవిత ఓదార్చారు. అంతకు ముందే విజయ నిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అరుదైన దర్శక నటీమణి విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల.. ఆమె నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని చిరంజీవి తెలిపారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను విజయనిర్మల చాటారన్నారు. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని చిరంజీవి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FCzxnH
v

విజయ నిర్మల భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు, కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చిన సీఎం

హైదరాబాద్‌: సూపర్ స్టార్ కృష్ణ భార్య, నటి, దర్శకురాలు భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. విజయ నిర్మల పార్థివదేహానికి అంజలి ఘటించారు. భార్య మరణంతో విషాదంలో కూరుకుపోయిన సూపర్ స్టార్ కృష్ణను సీఎం ఓదార్చారు. నరేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు తలసాని, ఎర్రబెల్లి , శ్రీనివాస్‌ గౌడ్‌ వెళ్లారు. ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లోని ప్రముఖులంతా ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు విజయ నిర్మల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FBtjVp
v

మోహన్‌బాబుకు నేనంటే ప్రాణం: స్వరూపానంద సరస్వతి

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ , ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిలు హైదరాబాద్ ఫిలింగనర్ దైవ సన్నిధానాన్ని సందర్శించారు. సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతిలకు.. సినీ నటుడు మోహన్‌బాబు, కళాబంధు సుబ్బిరామిరెడ్డిలు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో , , పరుచూరి బ్రదర్స్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, చాముండేశ్వరినాథ్‌లో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన స్వరూపానందేంద్ర సరస్వతి.. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో.. సినిమావారు, తానంటే ప్రాణమిచ్చే మోహన్ బాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠానికి సుబ్బిరామి రెడ్డి ఎంతో చేయూతనిస్తున్నారని.. ఆయన తాను లేకుండా ఈ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరన్నారు. తన తర్వాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించామన్నారు. ఫిలింనగర్ దైవ సన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ‘మాకు చాలా ఆనందంగా ఉంది.. చాలా ఏళ్ళ క్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ ఫిలింనగర్ దైవ సన్నిధానంతో చాలా అభినాభావ సంబంధం ఉంది. రెండేళ్ల క్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్‌లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్టమైన ప్రదేశం.. అక్కడ జవాన్‌లు మాత్రమే ఉండగలరు. అక్కడ కూడా తెలుగువారు వచ్చి సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందం ఇవ్వడం కోసం అంత కష్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది’అన్నారు. ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ ‘రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు.. నేను రజినీకాంత్ గారు ఓసారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి విశాఖలోని శారదా పీఠంని దర్శించుకోవాలి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి భాధ్యతలు ఇవ్వడం మంచి పరిణామం. భారతదేశంలో 108 మఠాలు ఉన్నాయి.. వారి ఆశీస్సులు ఫిలింనగర్ దైవ సన్నిధానానికి ఎల్లవేళలా ఉంటాయి’అన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి.. ‘ఫిలింనగర్ దైవ సన్నిధానం ఎల్లప్పుడూ కళకళడానికి కారణం భారత దేశంలో అతి తక్కువ సమయంలోనే అన్ని చోట్ల పీఠాలను నెలకొల్పిన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు. స్వామి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహా జ్ఞాని.. ఆయన నాకు చాలా కాలంగా పరిచయం. నేను గత 27 ఏళ్లగా ఏ కార్యక్రమం చేసినా వారి ఆశీస్సులు నాతోనే ఉంటాయి" అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xgX8WC
v

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో గురువారం జరిగాయి. ‘ఫిదా’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్‌తో సినిమా చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోగా.. తన డైరెక్షన్‌లోనే వచ్చిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న తారాగణం కూడా ప్రాజెక్ట్‌కు పెద్ద ఎస్సెట్‌ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jebn47
v

శోకసంద్రంలో ఉన్న కృష్ణకు పవన్ కళ్యాణ్ ఓదార్పు

భార్య విజయనిర్మల మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన నటశేఖరుడు కృష్ణను జనసేన అధినేత, ప్రముఖ నటుడు ఓదార్చారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచిన విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్.. ఆ తరవాత కృష్ణను పరామర్శించారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆయన్ని ఓదార్చారు. తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న నరేష్‌కు పవన్ ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌తోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, నటుడు రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ, మెహర్ రమేష్, చార్మి, రష్మిక మందన తదితరులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. విజయనిర్మల గారి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. See Photos: కాగా.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్ గూడలోని నివాసానికి తీసుకొచ్చారు. కృష్ణ, విజయనిర్మల చాలా ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. శుక్రవారం విజయనిర్మల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xhljEg
v

తన ప్రాణం ఇకలేదని కృష్ణ కన్నీరుమున్నీరు

సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడికెళ్లినా పక్కన ఉండాల్సిందే. 50 ఏళ్లుగా వీరి ప్రయాణం కలిసే సాగింది. ఏనాడూ ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు నటశేఖరుడిని ఒంటరిని చేసి విజయనిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన ప్రాణం అయిన విజయ తనను వదిలిపెట్టి వెళ్లిపోవడాన్ని కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనిర్మల పార్థివదేహం వద్ద కూర్చొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్ గూడలోని నివాసానికి తీసుకొచ్చారు. కృష్ణ, విజయనిర్మల చాలా ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఈ ఇంట్లో విజయనిర్మల పార్థివదేహాన్ని ఉంచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కృష్ణను ఓదారుస్తు్న్నారు. మహేష్‌బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్.. కృష్ణ పక్కనే కూర్చొని ఆయనకు ధైర్యం చెబుతున్నారు. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. కె.రాఘవేంద్రరావు, మురళీ మోహన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధ, కోటి, కైకాల సత్యనారాయణ, రావు రమేష్, వంశీ పైడిపల్లి, మంచు లక్ష్మి తదితర సినీ ప్రముఖులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xcV0iA
v

Wednesday 26 June 2019

విజయనిర్మల మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, నిర్మాత మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నానక్‌రామ్ గూడలోని ఆమె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZRg0YC
v

అంతటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో చూడలేం: చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు మృతి పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని ఆయన అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయనిర్మల లేని లోటు యావత్తు సినీ పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి వెల్లడించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ‘అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌‌కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు, విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KEOoSO
v

కృష్ణ- విజయనిర్మల పెళ్లి .. రాజబాబు ముందే చెప్పారు!

సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడి అది వివాహ బంధంగా బలపడింది. అయితే కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఆ జిల్లాకు చెందినవాడే కాబట్టి ఆ కృష్ణుడి మహత్యం ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన పాట సందర్భంలో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. Also Read: రెండేళ్లు తిరిగేసరికి(1969) తిరుపతిలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఆ సమయంలో చాలామంది రాజబాబు చెప్పిందే జరిగిందంటూ గుసగుసలాడుకున్నారట. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. విజయనిర్మలకు మొదటిభర్తతో సంతానంగా నరేష్ పుట్టారు. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xighHy
v

నాన్నగారితోనే విజయనిర్మల తొలి చిత్రం: బాలకృష్ణ

సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల మృతి వార్త విని తెలు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు.. విజయనిర్మల అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Also Read: ప్రముఖు నటుడు కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. Also Read: ‘నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి "పాండురంగ మహత్యం" సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాల నటి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో "మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్ర కుటుంబం" సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IQFkbh
v

ప్రపంచంలో ఆ ఘనత ఒక్క విజయనిర్మలకే సాధ్యం

అలనాటి నటి, ప్రముఖ దర్శకురాలు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్‌కు గురిచేసింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. 1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ఏడో ఏటనే తమిళ సినిమా ‘మత్స్యరేఖ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల ప్రాయంలో ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు పోటీ పడేవి. కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి వంటి చిత్రాలు తెరకెక్కించారు. దర్శకురాలుగా 44 చిత్రాలను తెరకెక్కించిన ఆమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ప్రపంచంలో ఏ మహిళా దర్శకురాలికి ఈ ఘనత దక్కకపోవడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఇంతటి ఘనత సాధించిన దిగ్గజ దర్శకురాలు నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IOgmcC
v

విజయనిర్మల మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు: వైఎస్ జగన్

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RAaNl0
v

మిస్ యు నన్నీ.. విజయ నిర్మల మృతిపై మంచు మనోజ్ ఉద్వేగం

నటిగా, దర్శకురాలుగా, సూపర్ స్టార్ క్రిష్ణ భార్యగా తెలుగు సినిమా పరిశ్రమకు విశేషసేవలు అందించిన లెజెండరీ యాక్టర్ విజయ నిర్మల మరణంతో టాలీవుడ్‌లో విషాదవదనం నెలకొంది. బుధవారం రాత్రి గుండెనొప్పితో మరణించిన ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. Read Also: విజయ నిర్మల కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్న ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు మంచు మనోజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IOUSfD
v

విజయనిర్మల మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XdHhrl
v

విజయనిర్మల కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏడేళ్లకే బాలనటిగా.. విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి... పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు . అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ‘సాక్షి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణతో బంధం.. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XHonsp
v

డైరెక్టర్‌ వీవీ వినాయక్‌కు షాక్.. భవనాన్ని కూల్చేసిన జీహెచ్ఎంసీ

సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌కు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. రాజేంద్రనగర్ సమీపంలోని వట్టినాగులపల్లిలో ఆయన నిర్మిస్తోన్న భవంతిని అధికారులు కూల్చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యాక ఆ ఇంట్లోకి వెళ్దామని వినాయక్ భావిస్తున్నారు. కానీ అనుమతి లేకపోవడంతోనే దాన్ని కూల్చామని అధికారులు స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఇక్కడ జీ+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ వీవీ వినాయక్ జీ+6 భవంతిని నిర్మాణానికి పూనుకున్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో.. అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. డైరెక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఆ భవనంలోని నాలుగు అంతస్థులను అధికారులు కూల్చివేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XwwJCN
v

నన్ను ఏడిపించగలిగే ఏకైక మగాడు అతను: శ్రీవిష్ణు

వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న నటుడు శ్రీవిష్ణు. ఆయన హీరోగా ‘మెంటల్‌ మదిలో’ ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ట్యాగ్‌ లైన్‌. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. సరసన నివేదా థామస్ హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించారు. వివేక్‌ సాగర్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజైన త‌ర్వాత తెలుస్తుంది.. చిన్న సినిమా చేశామో, పెద్ద సినిమా చేశామో! నేను "మెంట‌ల్ మ‌దిలో" సినిమా చూశాను. వివేక్ చాలా బాగా చేశాడు. ఇలాంటి మంచి డైర‌క్టర్‌కి మంచి స్టార్ కేస్ట్ దొరికింది. ‘నిన్నుకోరి’లో ఫ‌స్ట్ షాట్ చూసిన త‌ర్వాత నివేదా మంచి పెర్ఫార్మర్ అని తెలిసింది. నేను ద‌ర్శితో ‘ఉన్నది ఒక్కటే జింద‌గీ’ చేశా. త‌ర్వాత కూడా చాలా సార్లు అనుకున్నా. కానీ ఇంకా కుద‌ర‌లేదు. రాహుల్ రామకృష్ణతో నాకు పెద్ద ప‌రిచ‌యం లేదు. కానీ కొన్ని క్యారెక్టర్లు వింటుంటే ఆయ‌నే గుర్తుకొస్తున్నారు. స‌త్య చాలా ఇన్టెన్స్ పెర్ఫార్మర్‌. స‌త్య క‌ళ్లల్లో అది క‌నిపిస్తుంది. "ఇస్మార్ట్ శంక‌ర్‌"లో స‌త్య చాలా మంచి పాత్ర చేశారు’ అని చెప్పారు. See Photos: వివేక్ మ్యూజిక్ బావుంటుందని.. తన ఫేవ‌రేట్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్యశాస్త్రి అని రామ్ వెల్లడించారు. "ఎందుకంటే ప్రేమంట" సినిమాలో "నాకు త‌దుప‌రి జ‌న్మకైనా.." పాటను రామజోగయ్య శాస్త్రి రాసినట్టు రామ్ గుర్తు చేశారు. ‘శ్రీవిష్ణుని ఫ‌స్ట్ టైమ్ నేను ఉన్నది ఒక్కటే జింద‌గీ టైమ్‌లో క‌లిశా. ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్‌లో స‌గం క్రెడిట్ శ్రీవిష్ణుదే. చాలా మంచి పెర్ఫార్మర్ అత‌ను. ఈ నెల 28న విడుద‌ల‌వుతుంది ఈ సినిమా. నాకు అరుణ‌భిక్షుగారు యాక్టింగ్ నేర్పించారు. ఆవిడ ఈ చిత్రానికి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది’ అని రామ్ అన్నారు. ఇక శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘వివేక్ స్టోరీ చెప్పిన‌ప్పుడు చాలా న‌చ్చింది. టైటిల్ ఏంటంటే ‘బ్రోచేవారెవ‌రురా’ అని అన్నారు. స‌రే `బ్రో` అని అనుకునేవాళ్లం. ఈ క‌థ‌లో `మిత్ర` అనే పాత్ర న‌చ్చి ఈ సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ ఎవ‌రు చేస్తారా? అని ఎదురుచూశాను. దానికి భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి చేయాలి. ‘నిన్నుకోరి’లో ఆమె డ్యాన్సులు చూశాం. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు చూసి ఈ చిత్రంలో ఎలా చేస్తారోన‌ని అనుకున్నాం. ఆమె 20 రోజులు అరుణ మేడ‌మ్ ద‌గ్గర డ్యాన్సులు నేర్చుకున్నారు. పొట్టోళ్లు గ‌ట్టోళ్లు అని అంటారు క‌దా.. అలా నివేదా చాలా క‌ష్టప‌డి డ్యాన్సులు నేర్చుకుంది. ఒక‌రోజు నేను కిటికీ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది. స‌త్య, నివేతా పేతురాజ్ చాలా బాగా చేశారు. స‌త్య క్యారెక్టర్లో ఇంకెవ‌రినీ ఊహించుకోలేం. ఈ ప్రాజెక్ట్‌లో నాకు కొత్తగా ప‌రిచ‌య‌మైంది వివేక్ సాగ‌ర్‌. చాలా టాలెంటెడ్. వివేక్ సాగ‌ర్ పాట‌లు వింటే ఇళ‌య‌రాజాగారి పాట‌ల్లా అనిపించాయి. ఆయ‌నంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైర‌క్టర్ వివేక్ సాగ‌ర్‌. మా కెమెరామేన్ మ‌మ్మల్ని చాలా బాగా చూపించారు. మా ప్రొడ్యూస‌ర్లు మూడు సార్లు హైద‌రాబాద్ వ‌చ్చారు. ఏం కావాల‌న్నా ఇచ్చేవారు. ‘బాగా చేయండి సార్‌’ అంటూ ప్రోత్సహించేవారు. మంచి సినిమాలు తీయ‌గానే సురేష్‌బాబుగారి లాంటి వాళ్లు వ‌చ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంక‌టేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయ‌న ఫ్యాన్‌గా చేస్తున్నాను. దానికి చాలా ఆనందంగా ఉంది. ప్రియ‌ద‌ర్శి, రాహుల్‌తో షూటింగ్‌లో ఉన్నంత సేపు న‌వ్వుతూనే ఉంటాం. నేను కేవ‌లం ఆడ‌పిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంట‌న్నది సినిమాలో చూడండి. న‌వ్వులు కూడా చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు. వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడితే నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. వివేక్ ఆత్రేయ అంటే నాకు చాలా ఇష్టం. న‌న్ను ఏడిపించ‌గ‌లిగే ఏకైక మ‌గాడు ఉన్నాడంటే ఆయ‌న వివేక్ ఆత్రేయ‌’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZLIu5R
v

Jr NTR: తారక్‌ని నటుడిగా తీర్చిదిద్దింది నాని!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తరవాత ఆ కుటుంబం నుంచి మళ్లీ నటనలో అంతటి ప్రశంసలు అందుకున్న నటుడు . తాతకు తగ్గ మనవడిగా నేటితరం హీరోల్లో ఉత్తమ నటుడిగా ఆయన ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఎలాంటి పాత్రనైనా తాను అవలీలగా చేసేయగలనని ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల ద్వారా చెప్పకనే చెప్పారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన ఈ నందమూరి యంగ్ టైగర్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి అంటూ ఒక బహిరంగ సభలో మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చిన తరవాత వరుసగా రెండుసార్లు గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కు గుడివాడలో ఆత్మీయ అభినందన సభ జరిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సభలో నానిని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కొడాలి నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాటిలేని నిరంత విజేత కొడాలి నాని అంటూ పేర్ని నాని కొనియాడారు. హరికృష్ణ అనుంగ శిష్యుడిగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దడంలో నాని పాత్ర ఎంతో ఉందన్నారు. తారక్ ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనుక నాని ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ సభలో ఆ పార్టీకి చెందిన మంత్రి ఎన్టీఆర్ ప్రస్తావనను తీసుకురావడం టీడీపీ శ్రేణులకు నచ్చడంలేదు. పార్టీ సభలో అధినేత జగన్‌ను పొగుడుకోవడం మాని హరికృష్ణ, ఎన్టీఆర్‌లను లాగడం ఏంటని మండిపడుతున్నారు. వాస్తవానికి కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తారక్‌ను చిన్నప్పటి నుంచి నాని ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ‘సెలవు రోజుల్లో నాని అన్న నన్ను గుడివాడ తీసుకెళ్లేవాడు. అక్కడే సెలవులు గడిపేవాడిని’ అని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. తారక్‌తో ‘సాంబ’ సినిమాను కూడా నాని నిర్మించారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసుకున్నంత మాత్రాన, ఒక సినిమా నిర్మించినంత మాత్రాన ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది నానినే అని మంత్రి నాని అనడం ఎంత వరకు సమంజసం!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YdM5Jv
v

నిఖిల్ ‘శ్వాస’ మధ్యలోనే ఆగిపోయిందా!

ఆ మధ్య వరుస హిట్లతో మంచి జోరుమీద కనిపించిన యంగ్ హీరో ఇప్పుడు కాస్త వెనకబడ్డారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘కేశవ’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని నిఖిల్ తనవైపు తిప్పుకున్నారు. అయితే, కిందటేడాది వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక నిఖిల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముద్ర’ సినిమా ఆ తరవాత ‘అర్జున్ సురవరం’గా పేరు మార్చుకున్నా విడుదలకు నోచుకోలేదు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాలు పడుతూ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే, నిఖిల్ ‘శ్వాస’ అనే మరో సినిమాను కిందటేడాది మొదలుపెట్టారు. గతేడాది దసరా సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. నివేదా థామస్ హీరోయిన్. కిషన్ కట్టా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై చరణ్ తేజ్ ఉప్పలపాటి, హరిణికేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయిపోయింది. అయితే, ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. సినిమాను తెరకెక్కిస్తున్న విధానం నిఖిల్‌కు నచ్చలేదని, ఔట్‌పుట్‌పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఆపేసి చాలా రోజులైంది. ఇక మొదలవదని అంటున్నారు. అయితే, స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేసి సినిమాను రీషూట్ చేస్తారా? లేదంటే ఇక్కడితో చాలని పక్కన పెట్టేస్తారా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఒక సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా విడుదలకు నోచుకోకపోవడం.. మరో సినిమా మధ్యలోనే ఇలా గాడితప్పడం నిఖిల్ అభిమానులకు జీర్ణించుకోలేని అంశాలు. ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నా నిఖిల్ కెరీర్‌లో మంచి సినిమాగా మిగిలిపోయిన ‘కార్తికేయ’కు సీక్వెల్ వస్తుండటం ఆయన అభిమానులను సంతోషపెట్టే విషయం. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ షూటింగ్‌లో నిఖిల్ బిజీగా ఉన్నారు. ‘కార్తికేయ’కు దర్శకత్వం వహించిన చందు మొండేటినే దీన్ని కూడా తెరకెక్కిస్తు్న్నారు. పీపుల్స్ మీడియా ప్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RB0qgw
v

చిరంజీవి కోసం ఫ్రెష్ ఫేస్.. కొరటాల వేట!

మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫైనల్ చేయలేదు. చిరంజీవి సరసన ఒక కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల శివ చూస్తున్నట్లు సమాచారం. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కథతో పాటు దానిలో ఉన్న పాత్రల విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే చిరంజీవి పక్కన చేయబోయే హీరోయిన్ విషయంలో కూడా కొరటాల చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని అంటున్నారు. మెగాస్టార్ వయసుకు, ఇమేజ్‌కు సరిపోయే ఒక కొత్త ముఖం కోసం కొరటాల వెతుకుతున్నారట. వాస్తవానికి చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్‌ను తీసుకోవాలని కొరటాల చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. కొరటాల కొత్త హీరోయిన్ కోసం చూస్తుండటం వల్లే వీళ్లపై ఆసక్తి చూపలేదని అంటున్నారు. చూద్దాం చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి హీరోయిన్‌ను తీసుకొస్తారో! కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ILfNAh
v

Tuesday 25 June 2019

‘సైరా’ షూటింగ్‌లో అనుష్కకు గాయం.. సీక్రెట్‌గా డాక్టర్‌ను కలిసిన జేజమ్మ!

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రాయలసీమ పోరాటయోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సినిమాకు కీలకమైన ఒక సన్నివేశంలో అనుష్క నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయమైందట. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ‘సైరా’ చిత్ర యూనిట్, అనుష్క జాగ్రత్త పడ్డారని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అనుష్క హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారని, కాలికి ఫ్యాక్చర్ కావడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగశౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అంతేకాదు, వీరి గాయాల కారణంగా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అనుష్కకు కూడా గాయమంటే ఇది కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుందని బహుశా దాచి ఉంచారనుకుంటా! ఏదేమైనా ఈ గాయం నుంచి అనుష్క త్వరగా కోలుకుని మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని కోరుకుందాం. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు నటించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా డైలాగులు రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Neii2g
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...