Wednesday 26 June 2019

కృష్ణ- విజయనిర్మల పెళ్లి .. రాజబాబు ముందే చెప్పారు!

సినీ పరిశ్రమలో నటీనటులు దంపతులుగా మారడం సాధారణమే. పాతకాలం నుంచి నేటి కాలం వరకు ఎందరో నటీనటులు జీవిత భాగస్వాములుగా మారడం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినీ పరిశ్రమ విషయానికొస్తే ఇక్కడా ఎన్నో జంటలు మనకు కనిపిస్తుంటాయి. వారిలో కృష్ణ-విజయ నిర్మల జంట మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇద్దరూ ప్రముఖ నటులే కావడం, ఎన్నో సినిమాల్లో జంటగా నటించడంతో అప్పట్లోనే వీరి వివాహం టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీ కట్టిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ జోడీగా మారారు. Also Read: 1966లో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ‘సాక్షి’ చిత్రంలో కృష్ణతో జోడీ కట్టారు. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడి అది వివాహ బంధంగా బలపడింది. అయితే కృష్ణ-విజయనిర్మల వివాహం వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ప్రముఖ చిత్రకారుడు బాపు 1967లో ‘సాక్షి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇందులో కృష్ణ-విజయనిర్మల హీరోహీరోయిన్లు. ఈ సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామంలో అవుట్‌డోర్ షూటింగ్ చేశారు. ఆ గ్రామంలోని ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉండటం ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఆ జిల్లాకు చెందినవాడే కాబట్టి ఆ కృష్ణుడి మహత్యం ఆయనకు బాగా తెలుసు. సినిమా షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన పాట సందర్భంలో కొత్త దంపతుల గెటప్‌లో ఉన్న కృష్ణ-విజయనిర్మలను చూసి ఆయన ‘ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్’ అంటూ జోక్ చేశారు. Also Read: రెండేళ్లు తిరిగేసరికి(1969) తిరుపతిలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఆ సమయంలో చాలామంది రాజబాబు చెప్పిందే జరిగిందంటూ గుసగుసలాడుకున్నారట. కృష్ణ- విజయనిర్మల ఇద్దరికీ ఇది రెండో వివాహం. విజయనిర్మలకు మొదటిభర్తతో సంతానంగా నరేష్ పుట్టారు. గతంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xighHy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...