Tuesday 31 March 2020

కరోనా కంటే ప్రమాదంగా వర్మ సాంగ్.. వైరస్‌కి బాంబు పెడతావా? కత్తితో పొడుస్తావా? వార్నీ!

సమయం తనది కాకపోవచ్చు.. సందర్భం రాకపోవచ్చు.. కాని పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రమోషన్స్ పొందటంలో వర్మకు వర్మే సాటి. ప్రపంచంలో ఎక్కడ ఏమూల చిన్న ఇష్యూ జరిగిన దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో మొదటి నుంచి కూడా తన మార్క్ ట్వీట్లతో వైరల్ అవుతున్నారు. కరోనాపై వర్మ చేసిన ట్వీట్లు ఆలోచింపచేసే విధంగా.. మరికొన్ని ఫన్నీగా.. ఇంకొన్ని కొన్ని వర్గాలలకు ఎప్పటిలాగే మంట పుట్టించే విధంగా ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోనాపై పాటరాసి ఎవడితోనే ఎందుకు నేనే పాడేస్తే పోలా అనుకున్నాడో ఏమో కాని తన గొంతుకు పనిచెప్పి ఈ పాట ప్రోమో వదిలాడు. పూర్తి పాట వినడానికి సాయంత్రం వరకూ టైం ఉందిలే కాని.. ఈలోపు ఈ ప్రోమో వదులుతున్నా.. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన "కనిపించని పురుగు" అనే పాట ప్రోమో..చెవులకు మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం (ఏప్రిల్ 01) సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను’ అంటూ సోమవారం అర్థరాత్రి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ పెట్టాడు వర్మ. ఇక వర్మ అర్థరాత్రి పూట పెట్టిన పోస్ట్‌లు ఎలాగు ఉంటాయో ఆయన్ని ఫాలో అయ్యేవాళ్లకు దాదాపు ఓ క్లారిటీ ఉంటుందిలే కాని.. తాజాగా వర్మ కరోనాపై పాడిన "కనిపించని పురుగు" పాట చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేట్టుగానే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. అది పాట లాంటి పాట మాట.. ఇంతకు ముందెప్పుడూ విని ఉండరు అంటే నమ్మాలి. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు కరోనా అనే ఒక పురుగు.. నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి.. పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి దాని దాని బలం.. అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ దాన్ని కత్తితో పొడవచ్చు.. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చొచ్చు.. బట్ ఇట్ ఈజ్ జస్ట్ పురుగు’ అంటూ ఆయనే రాసేసి ఆయనే పాడేశారు. జస్ట్ ఇది ప్రోమో పూర్తి పాట ఈరోజు 5.30 గంటలకు అంటూ ప్రోమో వదిలారు వర్మ. ఇక ఈయన రాసి పాడిన పాటపై జనం ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. దయచేసి నువ్ పాటలు పాడకు వర్మా.. నీ పాట వింటే మాకు కరోనా రాకుండానే పోయేట్టుగానే ఉన్నాం.. మమ్మల్ని ఇలా బతకనియ్యి., ఈ పాట కనుక కరోనా పేషెంట్‌కి వినిపిస్తే వెంటనే కరోనా వైరస్ వెంటనే చచ్చిపోతుంది., కరోనా కనిపించని వైరస్ అయితే నువ్ కనిపించే వైరస్.. ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ తిప్పలు?., నోడౌట్ ఎవరికి మందు దొరక్కపోయిన నువ్ మాత్రం ఓడ్కా ఫుల్ స్టాక్ పెట్టుకున్నట్టు అర్థమైంది., నీ సాంగ్ కంటే ఆ కేఏ పాల్ సాంగ్ బెటర్ సామీ., చాలు వర్మా.. చాలు దయచేసి ఫుల్ సాంగ్ విడుదల చేయకు నీకు దండం పెడతాం., కరోనా కంటే నువ్వంటేనే భయం రా నాయనా., ఏంటేంటి కత్తితో పొడుస్తావా?? బాంబు పెడతావా?? పనిలేని పిచ్చోడు నోటికొచ్చిన పదాలను పాటగా పాడుకున్నట్టుంది.. కరోనా ఉన్నచోట కెమికల్ స్ప్రేలు చేసే బదులు మున్సిపాలిటీ వారు ఈ పాటను మైక్ లో వినిపిస్తే కరోనా ఏం ఖర్మ మనుషులు కూడా పోతారనుకుంటా., కరోనాకి మేం ఈ పాటకు చచ్చేలా ఉన్నాం’ అంటూ నెటిజన్లు వర్మ పాటపై గగ్గోలు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34569BB
v

కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్... లైవ్‌లో మాట్లాడుతూ ఏడ్చేసిన జబర్దస్త్ బ్యూటీ

కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపత్యంలో సెలబ్రిటీలంతా స్పందిస్తున్నారు. ప్రజలంతా క్షేమంగా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పలువురు టీవీ నటులు, ప్రముఖ యాంకర్లు కూడా ప్రస్తుతమున్న పరిస్థితులపై స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్... లాక్ డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికి కొన్ని ప్లేసుల్లో పేదలకు ఎలాంటి సహాయం అందడం లేదు. దీంతో ఈ విషయమై రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పేదలకు తినడానికి సరిగా ఫుడ్ కూడా దొరకడం లేదని పేర్కొంది. దయచేసి అందరూ విరాళాలు ఇవ్వాలని కోరింది. ఎవరికి చేతనైనంత సాయం వారు చేయాలని కోరింది. కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా చాలు అని రష్మీ వేడుకోంది. విరాళాలు అంటే పెద్ద మొత్తంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని, చాలా మంది కలిసి ఒక్కో రూపాయి సాయం చేసినా చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. పేదవారు తిండికి దూరమవుతున్నారంటూ రష్మీ ఫేస్ బుక్‌లో లైవ్‌‌లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్లీజ్ ప్రీజ్ అంటూ అందర్నీ బతిమాలింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. పేదలతో పాటు మూగజీవాల పట్ల మానవత్వంగా ఉండాలని ఈ సందర్భంగా రష్మీ కోరింది. మూగజీవాల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తాజాగా రష్మీ శునకాల కోసం కొంత ఆహారాన్ని సిద్ధం చేసింది. తన దగ్గర్లో ఉన్న ప్రాంతాలకు కుక్కల కోసం ఆహారాన్ని అందించింది. అంతే కాకుండా పీఎం కేర్స్ ఫండ్‌కు రష్మీ రూ. 25వేలు విరాళంగా ఇచ్చింది సమాజంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదంది ఈ జబర్దస్త్ భామ. కానీ ఇలాంటి ఆపద సమయంలో మానవత్వాన్ని చాటుకొని విరాళాలు ప్రకటిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పింది. రష్మీ చేస్తున్న ఈ పని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WZsYoI
v

కరోనా వైరస్‌తో ప్రముఖ నటుడు మృతి

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ మృతిచెందారు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో ఆయన సర్రేలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. 76 ఏళ్ల జాక్‌ స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌ లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్‌ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ కూడా ఆయన మృతిపై స్పందిచారు. రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ప్రముఖ నటులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 45 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై తీవ్ర ఆందోళన నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aBpNHV
v

హరీశ్ శంకర్‌కు సర్‌ప్రైజ్... పెళ్లైన హీరోయిన్ నుంచి మెసేజ్

మంగళవారం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలంతా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనకు తన సినిమాల్లో నటించిన హీరోయిన్ నుంచి ఓ సర్ ప్రైజ్ మెసేజ్ వచ్చింది. ఆ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ భామ ఇంకెవరో కాదు... బొద్దుగుమ్మ . మిర్చీ, మిరపకాయ వంటి సినిమాలతో హాట్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా రిచా ... సందర్భంగా శుభాకాంక్షలు తెలపింది. మంగళవారం రోజున తన ట్విట్టర్‌ ద్వారా విషెస్ చెప్పింది. ‘ హాయ్ హరీశ్. మీరు నాకిచ్చిన మంచి క్యారెక్టర్ ఎప్పుటికీ మరిచిపోలేను. ఇప్పటికీ గుర్తుంది. ఈ స్పెషల్ డేన మీరు మీ ఫ్యామిలీతో బాగా గడుపుతున్నారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను చూసిన హరీశ్ శంకర్ సర్ ప్రైజ్ అయ్యాడు. నిజంగా సర్ ప్రైజ్.. చాలా రోజుల తర్వాత కలిసావు ఎలా ఉన్నావు. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు. రిచా గంగోపాధ్యయ, హరీశ్ డైరెక్షన్‌లో రవితేజకు జంటగా మరిపకాయ్ సినిమాలో నటించింది. ఇందలో దీక్షా సేథ్ మరో హీరోయిన్. 2011లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రిచా మొదటి సినిమా లీడర్. రాణాతో కలిసి చేసిన ఈ మూవీ 2010లో విడుదలైంది. ఆ తర్వాత భాయ్ సినిమా రిచాకు లాస్ట్ మూవీ. ఈ మధ్యకాలకంలో కొన్ని సినిమాలు చేసిన రిచా.. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. తన చిన్ననాటి స్నేహితుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడారు. రిచా, జో స్కూల్‌ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్స్. చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందు, క్రైస్తవ సంప్రదాయంలో జరిగింది. అయితే పెళ్లైన సమయంలో ఆమె సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పేసిందన్న వార్తలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు ఆమె ట్విట్టర్ వేదికగా హరీశ్‌కు విషెస్ చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R1lVsa
v

కరోనాపై పాట పాడిన వర్మ.. ఇవాళ సాయంత్రం రిలీజ్

వివాదాస్పద దర్శకుడు మరోసారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఎప్పటికప్పుడ జరిగే పరిణామలపై వర్మ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా పై కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. అయితే తాజాగా కరోనాపై కూడా పాట విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. ఈ వైరస్ పై సొంతంగా పాట పాడానని ట్విట్టర్లో తెలిపాడు. ఆ పాటను బుధవారం సాయంత్రం 5:30లకు విడుదల చేస్తాననన్నాడు. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమో...చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను. అని మంగళవారం వర్మ ట్వీట్ చేశారు. ‘ కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు. నలిపేద్దామంటే అంత సైజ్ లేదు దానికి... పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చోచ్చు. but it is just పురుగు అంటూ వర్మ పాట పాడి పోస్టుచేశారు. మొత్తం పాట ఇవాళ సాయత్రం 5:30లకు విడుదల చేస్తానన్నారు. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే... వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకరిస్తున్నాడు. గతంలో కూడా ‘ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా కోసం వర్మ పాట పాడారు. ఆ పాటను కూడా అయినా ఇలానే నెటిజన్ల కోసం ముందుగా సోషల్ మీడియాలోనే పోస్టు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wGXyJj
v

మొత్తం రూ. 6.2 కోట్లు.. ఛారిటీ లెక్కలు చెప్పిన చిరంజీవి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు. చిరంజీవి స్వయంగా ఈ ఛారిటీకి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే తమ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్ అకౌంట్‌కు పంపొచ్చన్నారు. ఈ మేరకు విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించారు. బ్యాంక్: ఐసీఐసీఐ, బంజారాహిల్స్ బ్రాంచ్, అకౌంట్ నంబర్: 0076 01 019951, ఐఎఫ్ఎస్‌సీ కోడ్: ICIC0000076. కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి వివరాలు ✦ చిరంజీవి - కోటి రూపాయలు ✦ నాగార్జున - కోటి రూపాయలు ✦ ప్రభాస్ - రూ.50 లక్షలు ✦ రామ్ చరణ్ - రూ. 30 లక్షలు ✦ నాని - రూ. 30 లక్షలు ✦ ఎన్టీఆర్ - రూ. 25 లక్షలు ✦ నాగచైతన్య - రూ. 25 లక్షలు ✦ అల్లు అర్జున్ - రూ. 20 లక్షలు ✦ వరుణ్ తేజ్ - రూ. 20 లక్షలు ✦ రవితేజ - రూ. 20 లక్షలు ✦ శర్వానంద్ - రూ. 15 లక్షలు ✦ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - రూ. 10 లక్షలు ✦ యూవీ క్రియేషన్స్ - రూ. 10 లక్షలు ✦ సాయిధరమ్ తేజ్ - రూ. 10 లక్షలు ✦ విశ్వక్ సేన్ - రూ. 5 లక్షలు ✦ శ్రీకాంత్ - రూ. 5 లక్షలు ✦ శ్రీమిత్ర చౌదరి - రూ. 5 లక్షలు ✦ సుశాంత్ - రూ. 2 లక్షలు ✦ కార్తికేయ - రూ. 2 లక్షలు ✦ వెన్నెల కిషోర్ - రూ. 2 లక్షలు ✦ సప్తగిరి - రూ. 2 లక్షలు ✦ లావణ్య త్రిపాఠి - రూ. 1 లక్ష ✦ సంపూర్ణేష్ బాబు - రూ. 1 లక్ష ✦ బ్రహ్మాజీ - రూ. 70వేలు గమనిక: చిరంజీవి ట్వీట్ చేసిన వివరాల ఆధారంగా విరాళాలు ఇచ్చినవారి పేర్లను పేర్కొన్నాం. ఇంకా విరాళాలు ఇచ్చినవాళ్లు ఉండొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wTDza9
v

అనాథ పిల్లలకు అండగా హరీష్ శంకర్.. సినీ కార్మికులకు శ్రీకాంత్, సప్తగిరి విరాళం

డైరెక్టర్ హరీష్ శంకర్ తన మంచి మనసును చాటుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో అనాథ పిల్లలకు రెండు నెలలపాటు వారికి ఆహారాన్ని అందించనున్నారు. హరీష్ శంకర్ మంగళవారం (మార్చి 31న) తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సరిపడే స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్, తదితర ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలంతా విరాళాలు అందజేయగా.. ఇప్పుడు చిన్న నటులు కూడా తమ వంతు సాయం అందజేస్తున్నారు. హీరో, సహాయ నటుడు శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, కమెడియన్ సప్తగిరి రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు. Also Read: కాగా, కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ దాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. షూటింగ్‌లు లేకపోవడం వల్ల సినీ పరిశ్రమల రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో వాళ్లకు ఇల్లు గడవడం కూడా కష్టమే. అందుకే, వారిని ఆదుకోవాలని సినీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిని చేశారు. తన బాధ్యతగా కోటి రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39tCnI1
v

ముంబై నుంచి వస్తారు.. కోట్లు తీసుకుంటారు: హీరోయిన్లపై బ్రహ్మాజీ ఫైర్

కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి హీరోయిన్లు ముందుకు రాకపోవడంపై నటుడు బ్రహ్మాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఈ ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఇండస్ట్రీలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయాలు. వారందరినీ ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ హీరోల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అయితే, లావణ్య త్రిపాఠి మినహా ఏ హీరోయిన్ విరాళాలు ప్రకటించలేదు. లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముంబై నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లుగా కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. కానీ, వారెవ్వరూ కార్మికుల సంక్షేమం గురించి స్పందించడం లేదు. లావణ్య త్రిపాఠి ఒక్కరే విరాళం ఇచ్చారు. మిగిలిన వారు ఛారిటీకి విరాళం ఎందుకు ఇవ్వడం లేదు? దీన్ని డబ్బు ఇవ్వడంగా భావించకూడదు.. ఇండస్ట్రీకి వారు చూపించే కృతజ్ఞత’’ అని బ్రహ్మాజీ అన్నారు. Also Read: అలాగే, ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్‌లో నటిస్తోన్న సహాయ నటులపై కూడా బ్రహ్మాజీ ఫైర్ అయ్యారు. వాళ్లు కూడా విరాళాలు ఇవ్వాలని అన్నారు. కాగా, సీసీసీకి బ్రహ్మాజీ రూ.70వేల విరాళాన్ని ప్రకటించారు. ఆయన తనయుడు సంజయ్ రావు కూడా రూ.25 వేలు అందించారు. ఇక హీరోలు అయితే భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున చెరో కోటి రూపాయలు అందించారు. మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు.. ఇలా చాలా మంది హీరోలు విరాళాలు అందజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JpNp6v
v

బెల్లంకొండ‌కు షాక్ ఇచ్చిన నిధి అగర్వాల్!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి పరిచయం అవసరంలేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో సెటిల్ అయిన ఈ మోడల్.. బాలీవుడ్ మూవీ ‘మున్నా మైఖేల్’తో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాలోనే టైగర్ ష్రాఫ్ పక్కన ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరవాత 2018లో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా నిధి అగర్వాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. డాన్సులు ఇరగదీస్తుందని అంతా ప్రశంసించారు. ఈ సినిమా తరవాత ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించినా కలిసిరాలేదు. అయితే, కిందటేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసి కుర్రకారును కట్టిపడేసింది. తన కెరీర్లో ఐటమ్ సాంగ్స్ చేయనని చెప్పిన నిధి.. ‘‘జిల్లేలమ్మా జిట్టా’’ సాంగ్‌లో దుమ్ముదులిపి ఐటమ్ గర్ల్ కన్నా ఎక్కువ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత నిధిని అందరూ ఇస్మార్ట్ గర్ల్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, తాజాగా నిధి అగర్వాల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారట. అయితే, రెమ్యునరేషన్‌తో నిర్మాతలకు నిధి షాక్ ఇచ్చిందట. Also Read: బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘‘అల్లుడు అదుర్స్’’ అనే సినిమాను చేస్తున్నాడు. సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే హీరోయిన్లు, స్పెషల్ సాంగ్స్‌లో నర్తించే నటీమణుల విషయంలో వెనకడుగు వేయరు. అందుకే, ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం నిధి అగర్వాల్‌ను సంప్రదించారట దర్శక, నిర్మాతలు. అయితే, ఒక్క సాంగ్ కోసం ఏకంగా రూ.60 లక్షలు డిమాండ్ చేసిందట నిధి. దీంతో షాకైన నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3awNS2J
v

పవన్ కోసం 40 రోజులు కేటాయించిన జాక్వెలిన్!

బాలీవుడ్ సినిమాలు చూసేవారికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కిందటేడాది ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘బ్యాడ్ బోయ్’ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి ఆడిపాడింది. అయితే, ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు తెలుగులో పూర్తి స్థాయి పాత్ర చేయబోతోందని టాక్. ఈ మేరకు ముంబై మిర్రర్ ఒక కథనాన్ని ప్రచురించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాను అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ నుదిటిన పొడవాటి బొట్టుపెట్టుకుని ఉన్న ఫొటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ మూవీ కూడా పవన్ చేస్తున్నారట. అయితే, ఈ సినిమాలో ఒక పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారట. ఈ మేరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ పేర్కొంది. Also Read: ‘‘ఇది 1870 కాలానికి చెందిన కథ ఇది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. జాక్వెలిన్ ఇతర భాషల్లో నటించాలని చూస్తోంది. దానిలో భాగంగానే ఈ సినిమాను అంగీకరించారు. ఈ ఏడాది చాలాసార్లు జాక్వెలిన్ హైదరాబాద్ వెళ్లొచ్చింది. డైరెక్టర్ క్రిష్, పవన్ కళ్యాణ్‌ను ఆమె కలిశారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ వెల్లడించింది. ఈ సినిమా కోసం 40 రోజుల కాల్‌షీట్లను జాక్వెలిన్ కేటాయించారట. ‘‘హైదరాబాద్‌లో పలు స్టూడియోల్లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ చేయనున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించేలా చిత్రీకరించనున్నారు. జాక్వెలిన్ విభిన్నపాత్రలో కనిపించనున్నారు. పురాతన ఆభరణాలు, హెవీ డిజైనర్ క్లాత్స్‌ను ఆమె ధరించనున్నారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34aai7D
v

పవన్ కన్నా ఎన్టీఆర్ చాలా బెటర్.. ఫ్యాన్స్ కిరికిరి!

స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇప్పటి విషయం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టైం నుంచే హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలు పేలేవి. కాకపోతే, అప్పట్లో థియేటర్ల వద్దో, ఏదైనా కార్యక్రమంలోనో ఫ్యాన్స్ గొడవపడేవారు. ఇప్పుడు కాలం మారింది కదా.. సోషల్ మీడియా అనే వేదిక వచ్చింది. ఇక ఈ ఫ్యాన్స్ వార్‌కు అడ్డు అదుపు అంటూ లేకుండా పోయింది. ఎక్కడికో వెళ్లిపోతుంది. కొంత మంది ఫ్యాన్స్ అయితే హద్దులు దాటి మరీ బూతులు తిడుతూ ఉంటారు. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అని హెచ్చులు పోతూ ఉంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే ఉండటంతో ఈ సోషల్ మీడియా వార్ మరీ ఎక్కువైపోయింది. తాజాగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఇటీవల ‘RRR’ మూవీ నుంచి రామ్ చరణ్ స్పెషల్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. చరణ్ బర్త్‌డే కానుకగా ఆయన పరిచయ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు ఈ సినిమాలో మరో హీరో అయిన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ వీడియోలో రామ్ చరణ్ ప్రెజెన్స్ ఒక ఎత్తయితే.. ఎన్టీఆర్ వాయిస్ మరో ఎత్తు. అంత గొప్పగా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ తన వాయిస్‌తో ఎలివేట్ చేశారు. దీంతో ఎన్టీఆర్‌పై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. Also Read: ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘RRR’లో ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌కు.. ‘సైరా’లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌కు ముడిపెడుతున్నారు తారక్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ వాయిస్ కన్నా ఎన్టీఆర్ వాయిస్ బాగుందంటూ పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. నిజానికి ‘RRR’ సినిమాను ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు అభిమానం కురిపిస్తూ మాట్లాడారు. దీంతో వీరిద్దరి అభిమానుల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధాన్ని పెద్దగా సోషల్ మీడియాలో చూడలేదు. తాజాగా విడుదలైన వీడియోలో.. ‘‘నా అన్న, మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’’ అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు చరణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మొత్తం మీద ఈ సినిమా వల్ల అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. కానీ, మధ్యలోకి పవన్‌ ఫ్యాన్స్‌ను లాగారు. Also Read: నిజానికి, ‘సైరా’ సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మంచి హైప్ వచ్చింది. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. కానీ, ఆయనిచ్చిన వాయిస్ ఓవర్‌పై మాత్రం విమర్శకులు పెదవి విరిచారు. వాయిస్ ఓవర్ విషయంలో సరిగా కేర్ తీసుకోలేదని.. ఇంకాస్త బాగా చేయించి ఉంటే బాగుండేదని అన్నారు. కాకపోతే, అప్పట్లో పవన్ అభిమానులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రాజమౌళికి పర్ఫెక్షన్ విషయంలో అస్సలు తగ్గరుకదా. అందుకే, చరణ్‌ను పరిచయం చేసే వీడియోలో ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సెంథిల్ కుమార్ విజువల్స్, సాయిమాధవ్ బుర్రా డైలాగులు.. వీటన్నిటినీ మించి తారక్ వాయిస్ అద్భుతమే చెప్పాలి. దీంతో పోలిస్తే.. ‘సైరా’కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ అంతలేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3460U4Q
v

ఛారిటీ అంటే రౌడీ మామూలు కాదు: డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. వీటిలో మన దేశం ఉన్నప్పటికీ ఆ దేశాలతో పోలిస్తే మన దగ్గర కరోనా ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలన నిర్ణయాలు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా కరోనా నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మన సినీ తారలు విరాళాలు ప్రకటించారు. అలాగే, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో తెలుగు సినీ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్లను ఆదుకోవడం కోసం తెలుగు సినీ పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని ప్రారంభించింది. ఈ ఛారిటీ విరాళాలు ఇవ్వాల్సిందిగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రముఖులను అభ్యర్థించారు. ఆయన వంతుగా కోటి రూపాయలు ఇచ్చారు. చిరంజీవి పిలుపు మేరకు చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు అందజేస్తున్నారు. విరాళాలు అందజేస్తున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. Also Read: అయితే, విరాళాలు ఇచ్చిన వారి పేర్లలో కొంత సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా వాళ్లపై కొంత మంది నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా ట్విట్టర్ ద్వారా స్పందించారు. కోవిడ్-19 అనే కాకుండా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టమొచ్చినా తమ వంతు సాయాన్ని అందించే ఎంతో మంది మంచి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని, వారంతా తనకు వ్యక్తిగతంగా తెలుసని దేవా కట్టా అన్నారు. వారికి పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టలేక విరాళాల విషయాన్ని బయటికి చెప్పరని స్పష్టం చేశారు. దాన్ని వారొక ఆధ్యాత్మిక, వ్యక్తిగత చర్యగా భావిస్తారని అన్నారు. అయితే, విరాళాలు ఇచ్చినట్టు ప్రకటించుకున్న వారి ఆలోచన వెనుక కూడా ఒక పాయింట్ ఉందన్నారు. ఇలా చేయడం వల్ల మరికొంత మంది విరాళాలు ఇవ్వడానికి ప్రోత్సహించినట్టు అవుతుందని దేవా కట్టా అన్నారు. విరాళాలు ఇచ్చి బయటకు చెప్పని కొంతమంది ఉన్నారని.. విషయం తెలుసుకోకుండా అలాంటి వాళ్లను విమర్శించడం తెలివితక్కువ తనం అని కాస్త ఘాటుగానే అన్నారు. వాళ్ల దృష్టికోణాన్ని అర్థం చేకోవడం మన బాధ్యత అని చెప్పారు. ఛారిటీ అంటే సామాజిక ఒత్తిడి వల్ల ఇచ్చే రౌడీ మామూలు కాదని స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UwBc6r
v

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కలిసి ఇచ్చింది కేవలం రూ.3 కోట్లా?

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా నటి అనుష్క శర్మ, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు పీఎం-కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిన్న విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని వీరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి (మహారాష్ట్ర)లకు విరాట్, నేను మా వంతు సహకారం అందజేస్తున్నాం. దేశంలో ఎంతో మంది పడుతున్న బాధను చూసి మా గుండెలు బద్దలైపోతున్నాయి. మేం అందించే విరాళం మన పౌరుల ఆకలిని తీర్చడానికి కొంత మేర ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. భారత్ కరోనాతో పోరాడుతోంది’’ అని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, తాము ఎంత విరాళాన్ని అందజేస్తున్నాం అనే విషయాన్ని మాత్రం అనుష్క ప్రకటించలేదు. అయితే, ముంబై మిర్రర్ రిపోర్ట్ ప్రకారం ఈ స్టార్ కపుల్ రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో కొంత మంది పెదవి విరుస్తున్నారు. ఇండియాలోనే టాప్ సెలబ్రిటీలుగా ఉన్న కోహ్లి, అనుష్క కలిసి ఇచ్చేది ఇంతేనా అని నిట్టూరుస్తున్నారు. దీనికి కారణం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పీఎం-కేర్స్ ఫండ్’ను ప్రారంభించగానే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. కరోనాపై పోరాటానికి ఒక సెలబ్రిటీ ఇంత భారీ మొత్తం ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో ప్రతి ఒక్కరూ అక్షయ్‌తో పోలిక తీసుకొస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి వాణిజ్య ప్రకటనల ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అనుష్క శర్మ కూడా బాగానే వెనకేశారు. ఇంత సంపాదన ఉన్నవారు కేవలం రూ.3 కోట్లు విరాళంగా ఇవ్వడమేంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నిజానికి మన టాలీవుడ్ హీరోలే భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. రెబల్ ప్రభాస్ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగిలిన హీరోలు సైతం తమ వంతు సాయం అందజేశారు. బాలీవుడ్ నుంచి కూడా హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, భూమి పెడ్నేకర్, వరుణ్ ధావణ్ వంటి ఎంతో మంది సెలబ్రిటీలు విరాళాలు అందజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39r2Gyo
v

కాజోల్‌కు కరోనా వైరస్... క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగణ్

సినీ సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లా కాజోల్ ఒకరు. వీరిద్దరూ అన్యూన్యంగా కలిసి మెలిసి ఉంటారు. అంతేకాదు.. అజయ్ దేవగణ్‌కు టాలీవుడ్ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వీరికి సంబంధించిన ఏ వార్త వచ్చిన అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే తాజాగా పాజిటివ్ వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు కూతురు నైసాకు కూడా వైరస్ సోకిందన్న పుకార్లు వినిపించాయి. దీంతో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్పందించాడు. తన భార్య కూతురు క్షేమంగా ఉన్నారని తెలిపాడు. కాజోల్, నైసాకు ఎలాంటి వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చాడు. కాజోల్, నైసాలకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు రావడంతో అజయ్ సోషల్ మీడియా వేదికగానే స్పందించాడు. వారిద్దరి ఆరోగ్యం బాగుందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇదంతా అసత్యపు ప్రచారమన్నాడు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు వారిద్దరు క్షేమంగానే ఉన్నారంటూ పోస్టు పెట్టాడు. కాజోల్ 1992లో ‘బేఖుది’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 1993లో షారుఖ్‌తో కలిసి నటించిన ‘బాజీగర్’ సినిమాతో హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖాన్‌తో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ ‘ కుచ్ కుచ్ హోతా హై’ వంటి బ్లాక్ బస్లర్ హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్‌లో వెండితెరపై షారుఖ్ కాజోల్‌ది సూపర్ హిట్ జోడీగా నిలిచింది. అంతేకాదు వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఎక్కడ ఎలాంటి పార్టీల్లో కలుసుకున్నా ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించుకుంటారు. ఇక 1999లో కాజోల్ అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు. అజయ్ కాజోల్ జంటగా దిల్ క్యా కరే, ప్యార్ తో హోనా హీ థా, రాజూ చాచా, గూండారాజ్ తదితర చిత్రాలను చేశారు. తాజాగా చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఇద్దరూ కలిసీ ఇటీవల వచ్చిన ‘తానాజీ’సినిమా ద్వారా వెండిపై మెరిశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33YwGAw
v

55 ఏళ్ల ‘తేనెమనసులు’.. కృష్ణ సినిమాపై మహేష్ ఆసక్తికర పోస్ట్

దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ‘తేనెమనసులు’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికి 55 ఏళ్లు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా ద్వారా నటీనటులు రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృష్ణ.. టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు అద్భుతమైన కెరీర్‌ను చూసిన ఈ 75 ఏళ్ల నటుడు 350కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త జానర్లు, టెక్నికల్ అంశాలను పరిచయం చేసిన ఘనత కృష్ణది. ఇదిలా ఉంటే, ఈరోజు (మార్చి 31న) ‘తేనెమనసులు’ సినిమా 55వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సినిమాను ప్రేక్షకులకు గుర్తుచేశారు. ఈ సినిమా తనకు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘నాకు ఎప్పటికీ ఇష్టమైన సినిమా. మరిచిపోలేని క్లాసిక్. మన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రయాణం 55 ఏళ్ల క్రితం ఇదే రోజు ‘తేనెమనసులు’తో మొదలైంది. బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ లెజండరీ జర్నీలోకి ఒక్క క్షణం వెనక్కి వెళ్దాం’’ అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. Also Read: కాగా, సూపర్ స్టార్ కృష్ణ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేశారు. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌లో ఆయన ఎన్నో సినిమాలను నిర్మించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) సినిమాతో కౌబోయ్ జానర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. అంతేకాదు తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా (ఈనాడు - 1982), తొలి సినిమాస్కోప్ ఫిల్మ్ (అల్లూరి సీతారామరాజు - 1974), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం - 1986), తొలి డీటీఎస్ మూవీ (తెలుగు వీర లేవరా - 1995)లను పరిచయం చేసిన ఘనత ఆయనదే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WTXroa
v

Akira Nandan: అకిరా నా ప్రాణం.. ఒక తల్లితో అలా చెప్తారా?: రేణు దేశాయ్ దిమ్మతిరిగే ఆన్సర్

వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని రేణూ దేశాయ్ లైవ్ చాట్‌లో సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య . ‘అన్నా.. అకిరా మీకు హీరో కావొచ్చేమో.. వాడు నా కొడుకు. మీ కంటే కూడా నా ప్రాణం వాడు. ఒక తల్లికి అలా చెప్పకూడదు.. వాడు హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటాం అని కాదు.. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత’ అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇక ఒక్కసారి అకిరాని చూపించండి వదినా అంటే.. వాడికి చాలా సిగ్గు. నా ఇన్ స్టాగ్రామ్‌కి రాడు. అందుకే వాడి ఫొటో కూడా పెట్టడం లేదు’ అని సమాధానం ఇచ్చింది. ఇక ‘అలవైకుంఠపురములో’ సాంగ్స్ విన్నారా? అంటే.. యా.. సూపర్బ్ సాంగ్స్.. అన్నీ పాటలు విన్నాను. అందులోని సామజవరగమన సాంగ్ అకిరా ఎన్నిసార్లు విన్నాడో.. వాడి వల్ల నేను ఎన్నిసార్లు విన్నానో. అద్భుతమైన సాంగ్ అది’ అని అన్నారు రేణు. చిగురాకు చాటు చిలకా.. ఇక మరో నెటిజన్ లైవ్‌లోకి వచ్చి రేణు దేశాయ్ పాపులర్ హిట్ సాంగ్‌ ‘చిగురాకు చాటు చిలకా’ అనే పాట పాడమనగా.. ఆ పాటను గుర్తుతెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది రేణు. ఆ పాట నాకు తెలుసుకాని.. అది గుర్తురావడం లేదు.. ఏ పాట ఇది అంటూ మూడు పదాలు చెప్పి పాట పాడమని అనొద్దు. పూర్తి పాట చెప్తే గుర్తుకు వస్తుందని’ సరదాగా ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు రేణు దేశాయ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X2xFOV
v

Monday 30 March 2020

సల్మాన్ ఖాన్ ఇంట విషాదం... మేనల్లుడు మృతి

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సల్మాన్, "ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము" అంటూ తన ట్విటర్‌ ఖాతాతో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించారు. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అబ్ధుల్లా లేరన్న విషయాన్ని తెలిపారు. మరోవైపు , అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌ తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యమూ జిమ్ కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇప్పుడు అతను అకస్మాత్తుగా చనిపోవడంతో సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. అటు బాలీవుడ్‌లో కూడా అబ్దుల్లాతో సన్నిహిత్యంగా ఉన్నవారు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UykNyp
v

Chiranjeevi: శ్రీరామనవమికి చిరు ట్రీట్.. ట్విట్టర్ హీటెక్కడం ఖాయమే బాసూ!

మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకులకు ఏప్రిల్ 2న అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారంటే అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొరటాల దర్శకత్వంలో చిరు 152 మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ టైటిల్‌‌ను మెగాస్టార్ ‘పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేసేశారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగా ట్వీట్స్‌తో ట్విట్టర్ హీటెక్కిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత నిరంతరం ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటూ అప్డేట్స్ అందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన సూచనలు చూస్తూ.. కష్టల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)ని ఏర్పాటు చేసి విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ మరి కొంతమంది స్టార్లలో సాయం చేయలనే ప్రేరణ కలిగిస్తున్నారు. ఇక వీటితో పాటు హీరోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. మోహన్ బాబు లాంటి మిత్రులతో సరదాగా సంభాషిస్తూ ట్విట్టర్‌లోనూ మెగాస్టార్ సత్తా చూపిస్తున్నారు. కాగా గురువారం నాడు ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా ఏదో ఒక అప్డేట్ మాత్రం పక్కాగానే కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రెజీనా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ సాంగ్‌కి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీరామనవమి నాడు విడుదలయ్యే ఫస్ట్‌లుక్‌తో అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QX2XCC
v

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. అక్కడ థియేటర్స్ తిరిగి ప్రారంభం

కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమాలు విడుదల కాక.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో వేలది మంది కళాకారులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సినీ కార్మికుల ఆకలి కేకలతో ఇండస్ట్రీ క్షీణదశలో ఉంది. సుమారు ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రూ. 2000లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇక థియేటర్ యజమానులు అందులో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బొమ్మ పడితేనే వాళ్లకు బువ్వ.. కరోనా మహమ్మారి కాటు వేయడంతో వాళ్లకు కూడు లేకుండా పోయింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి సాయం చేస్తూ సినీ కార్మికుల ఆకలి తీర్చుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలంతా పెద్ద మనసు చాటుకుంటూ సినిమా వర్కర్స్‌కి సాయం చేస్తూ విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ కరోనాను మోసుకువచ్చిన చైనా దేశంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగౌతున్నాయి. అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సినిమా ఇండస్ట్రీ‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా సినిమాలు విడుదలకు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో తిరిగి థియేటర్స్ ప్రారంభం కాబోతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ సిటింగ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వ సూచనల పాటిస్తూ పక్క పక్కను కూర్చునేలా కాకుండా సిటింగ్‌లో కనీసం మూడు అడుగుడు దూరం పాటిస్తూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చైనాలోని షాంఘై నగరంలోని శనివారం నుంచి సుమారు 200 థియేటర్స్‌లో తిరిగి ఓపెన్ కానున్నాయి. అయితే కరోనాతో కళ తప్పిన థియేటర్స్‌కి తిరిగి ప్రేక్షకుడు చేరుకోవడం కాస్త టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పాత సినిమాలనే వేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలు కరోనా ఎఫెక్ట్‌తో రెండు మూడు రోజుల మాత్రమే ప్రదర్శితం అయ్యాయి. తిరిగి వాటిని రీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో థియేటర్స్ పునరుద్దరించి కొత్త సినిమాలను విడుదల చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bHBrBj
v

సినీ కార్మికులకు నాని, బన్నీ విరాళం.. ప్రభుత్వాలకు నారా రోహిత్ రూ.30 లక్షల సాయం

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ త‌ప్పకుండా పాటించాలని ప్రజ‌ల‌ను ఆయ‌న కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ లాక్‌డౌన్ కాలంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఛారిటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రా ముఖ్యమంత్రుల సహాయ నిధులకు మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు సీసీసీకి మరో రూ.20 లక్షలు అందజేశారు. దీంతో ఆయన విరాళం మొత్తం రూ.1.45 కోట్లకు చేరింది. Also Read: ఇదిలా ఉంటే.. పేద సినీ క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ భాగ‌స్వాముల‌య్యారు. క‌రోనా క్రైసిస్ చారిటీకి తన వంతు సాయంగా సందీప్ కిష‌న్ రూ. 3 ల‌క్షలు విరాళంగా ప్రక‌టించారు. దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్లలో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు. మరో హీరో సుశాంత్ క‌రోనా క్రైసిస్ చారిటీకి రూ. 2 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. అలాగే, షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సీసీసీకి రూ. 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. ఇక వెన్నెల కిషోర్ రూ.2 లక్షలు, సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33V9285
v

వినాశకాలే విపరీత బుద్ధి.. వారిపై మోహన్ బాబు ఫైర్

పెద్దల మాట‌ల‌ను గౌర‌వించ‌క‌పోతే విప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని మ‌న భార‌త, భాగ‌వ‌త‌, రామాయ‌ణ గాథ‌లు తెలియ‌జేస్తున్నాయ‌ని.. పెద్దలు చెప్పిన‌దాన్ని విన‌క‌పోతే ఏం జ‌రుగుతుందో ప్రస్తుతం మనకు క‌నిపిస్తోంద‌ని క‌లెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహ‌న్‌బాబు అన్నారు. క‌రోనా వైర‌స్ నుంచి త‌ప్పించుకోవాలంటే ప్రధాని మోదీ మొదలుకొని పెద్దలు చెబుతున్న సూచ‌న‌ల‌ను ప్రజలకు తప్పక పాటించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ విష‌యాల‌ను ఒక వీడియో సందేశం ద్వారా ఆయ‌న తెలిపారు. సోమవారం విడుదల చేసిన వీడియోలో మోహ‌న్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘ప్రకృతిని గౌర‌వించాల‌ని ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. ఏదో ఒక మ‌హ‌త్తర శ‌క్తి మ‌న‌ల్ని న‌డిస్తున్న సంగ‌తీ అర్థమై ఉంటుంది. పెద్దల మాట‌ల‌ను గౌర‌వించ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో కూడా మీకు తెలిసుంటుంది. భార‌త‌, భాగ‌వ‌త‌, రామాయ‌ణ గాథ‌ల‌ను మీరు చ‌దివే ఉంటారు. రామాయ‌ణంలో వాలి సుగ్రీవులు అన్నద‌మ్ములు. వాళ్లిద్దరూ గొడ‌వ ప‌డ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు. మ‌ళ్లీ వెంట‌నే వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య అతనితో.. ‘ఏమండీ ఇప్పుడే వెళ్లాడు, ర‌క్తపు మ‌ర‌క‌లు కూడా ఆరి ఉండ‌వు, వెంట‌నే మ‌ళ్లీ యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో మ‌ర్మం ఉంది.. వెళ్లకండి’ అని చెప్పింది. భార్య మాట‌ను వాలి విన‌లేదు. వినాశ‌కాలే విప‌రీత బుద్ధి. అత‌నికి ఆమె చెప్పిన మంచి రుచించ‌లేదు. వెళ్లాడు, ఓడిపోయాడు.. చ‌నిపోయాడు. అలాగే సీతా మ‌హాసాధ్విని గీత దాటొద్దని ల‌క్ష్మణుడు చెప్పాడు. ఆమె గీత దాటింది. అంటే పెద్దల మాట‌ను గౌర‌వించ‌క‌పోతే విప‌రిణామాలు జ‌రుగుతాయ‌ని ఈ క‌థ‌లు చెబుతాయి. మ‌న ప్రధాని న‌రేంద్ర మోదీ ద‌గ్గర్నుంచి ప్రతి ఒక్కరూ.. మీరు ఇంట్లో ఉండండి, సుర‌క్షితంగా ఉండండి.. ఎన్ని రోజులు లాక్‌డౌన్ ఉంటే అన్ని రోజులు ఇంట్లో ఉండండి.. భ‌గ‌వంతుడ్ని ప్రార్థించండి.. ఈ క‌రోనా వ్యాధి వెళ్లిపోవాలని ప్రార్థించండి. బ‌య‌ట‌కు వ‌చ్చి ఇష్టమొచ్చిన‌ట్లు న‌డ‌చుకోకండి అని చెప్తున్నా ఎవ‌రూ విన‌డం లేదు. వాళ్ల ఇష్టప్రకారం న‌డుచుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దల‌ను గౌర‌వించిన‌ప్పుడే మ‌నం బాగుంటాం, ప‌క్కింటివాళ్లూ బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, యావ‌త్ ప్రపంచ‌మూ బాగుంటుంది. అతి త్వర‌లో ఈ క‌రోనా నుంచి మ‌నంద‌రం త‌ప్పించుకొని క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. అయితే, దీన్ని కొంత మంది పాటించడంలేదు. సామాజిక దూరం పాటించకుండా ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నారు. అలాంటి వాళ్లను ఉద్దేశించి మోహన్ బాబు ఈ వీడియోలో మాట్లాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Tgukb
v

‘ఆ మూడు గ్రహాలు కలుసుకోబోతున్నాయి.. బయటికి వెళ్లొద్దు’

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కొన్ని వేలమందిని బలితీసుకుంది. లక్షల్లో ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. అమెరికాను కూడా కోలుకోలేని దెబ్బతీసింది కరోనా. అయితే, భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పరిస్థితి ప్రస్తుతానికి చేయిజారి పోలేదు. కానీ, ఈ 21 రోజుల లాక్‌డౌన్ ప్రజలు కచ్చితంగా పాటిస్తేనే కరోనాను జయించగలం. అందుకే, ప్రజల్లో ఈ విషయం పట్ల అవగాహన కల్పించడానికి సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని స్మిత దీనిపై మాట్లాడారు. వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు ఎంతో కీలకమని చెప్పిన స్మిత.. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న ఈ స‌మ‌యంలో అంద‌రూ బ‌య‌ట‌కు క‌ద‌ల‌కుండా ఎవ‌రింటిలో వారు సుర‌క్షితంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ‌చ్చే వారం రోజులు ఎందుకు కీల‌క‌మో ఒక వీడియో సందేశం ద్వారా ఆమె తెలిపారు. Also Read: వీడియోలో స్మిత మాట్లాడుతూ.. ‘‘అంద‌రూ మీ ఇళ్లల్లో సుర‌క్షితంగా ఉన్నార‌ని ఆశిస్తున్నా. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తొలి ఐదు రోజులు నేను బాగానే ఎంజాయ్ చేశాను. నా హాబీలు.. క్లీనింగ్‌, కుకింగ్‌, మా అమ్మాయి శివితో గ‌డ‌ప‌డం.. అన్నీ చేసేశా. వీటికి సంబంధించిన‌ వీడియోలు కూడా పోస్ట్ చేశా. ఆరో రోజు ఒక విష‌యం న‌న్ను బాగా క‌ల‌వ‌ర‌పెట్టింది. మ‌న‌మంటే నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటితో బ‌తికేయ‌గ‌లం. కానీ ఇల్లులేని వాళ్లు, దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే కార్మికులు ఏమై పోతున్నారు, వాళ్ల ప‌రిస్థితేంటి? అనే ఆలోచ‌న వ‌చ్చేస‌రికి ఒకరోజంతా నిద్ర స‌రిగా ప‌ట్టలేదు, తిన‌లేక‌పోయాను. అలాంటి వాళ్లకు చాలా మంది చాలా ర‌కాలుగా సాయం చేస్తున్నార‌ని నాకు తెలుసు. ఈ సంక్లిష్ట కాలంలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా ప‌నిచేస్తోంది. మ‌నంద‌రం కూడా ఒక‌రికొక‌రం చేత‌నైనంత సాయం చేసుకోవాలి. ఎవ‌రింట్లో వారుండి దేశాన్ని కాపాడే స‌మ‌యం వ‌చ్చింది అని చెబుతున్నారు. అది నిజం. వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు చాలా కీల‌క‌మైన‌వి. వైర‌స్ బాగా వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉన్న కాలం ఇది. ఆస్ట్రాల‌జీ ప్రకారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌స్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్రహాలు మూడూ క‌లుసుకోబోతున్నాయి. జ్యోతిషం ప్రకారం ఇది చాలా ప్రమాద‌క‌రం. అంటే ఆ స‌మ‌యంలో వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌డానికి అవ‌కాశం ఉంది. ఈ టైమ్‌లో మ‌నం బ‌య‌ట‌కు వెళ్లక‌పోవ‌డం చాలా ముఖ్యం. ఈ రోజు (మార్చి 30) రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి స‌రుకులు కొన‌డం మానుకొని, ఇంట్లో ఉన్నవాటితో స‌రిపెట్టుకొంటే మంచిది. అలాగే వేడి నీళ్లలో ప‌సుపు, తుల‌సి, వాము క‌లిపి.. ఆవిరి ప‌ట్టుకుంటే వైర‌స్ దూరంగా తొల‌గిపోతుంది. ఆవిరి ప‌ట్టిన కొద్దిసేప‌టి వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాతే ముఖం క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకున్నవాళ్లమ‌వుతాం. చెప్పిందే మ‌ళ్లీ మ‌ళ్లీ చెపుతున్నార‌నుకోవ‌ద్దు.. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం.. ఎప్పటిక‌ప్పుడు చేతులు శుభ్రంగా క‌డుక్కుంటూ ఉండండి, సామాజిక దూరం పాటించండి, ఇంట్లో ఉండండి. అంతేకాదు, ఏప్రిల్ 14 త‌ర్వాత మ‌న‌కు స్వేచ్ఛ వ‌స్తుంది, బ‌య‌ట‌కు వెళ్లవ‌చ్చు అనుకోకండి. ఇంకో ప‌దిహేను రోజులు లేదా నెల రోజులు లేదా రెండు నెల‌లు కూడా ఇంట్లోనే ఉండాల్సి రావ‌చ్చు. మ‌న‌కు తెలీదు. ప్రభుత్వం చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించండి. అప్పుడే రాష్ట్రం, దేశం ప‌రిశుభ్రంగా ఉంటాయి’’ అని స్మిత వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WRbXwW
v

ప్రభాస్ పెద్ద మనసు.. అదనంగా మరో రూ.50 లక్షల విరాళం

రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 అందజేసిన ప్రభాస్.. ఇప్పుడు సినీ కార్మికుల సహాయార్థం రూ. 50 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వెల్లడించారు. దీంతో ప్రభాస్ విరాళం మొత్తం రూ.4.5 కోట్లకు చేరింది. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ఆర్థికంగా సాయం అవసరం. అందుకే, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు. ప్రభాస్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వానికి రూ.3 కోట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున అందజేశారు. ఇప్పుడు, తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి ప్రభాస్ రూ.50 లక్షలు అందజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసింది ప్రభాస్ ఒక్కరే. Also Read: ఇదిలా ఉంటే, సినీ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ.10 లక్షలు, విశ్వక్‌సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, బ్రహ్మాజీ రూ.75వేలు, ఆయన తనయుడు సంజయ్ రావు రూ.25 వేలు విరాళంగా అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dDmSAv
v

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... మరో మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్

మెగాస్టార్ అభిమానులకు మరో శుభవార్త రానుంది. మరో మూడు రోజుల్లో చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ‘ఆచార్య’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంతో మెగా స్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఉగాది సందర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుదల చేద్దామని భావించినప్పటికీ అదే రోజున చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే కూడా రావడం. ఆ తర్వాత చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ కూడా విడదుల కావడంతో... ఆచార్య పోస్టర్ రిలీజ్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో మూడు రోజుల్లో శ్రీరామినవమి వస్తుండంతో ఫస్ట్ లుక్‌తో మెగాస్టార్‌ సంద‌డి చేస్తారనేది టాలీవుడ్ టాక్. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగ‌స్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిన సంగతి తెలిసింది. దీంతో మూవీ విడుదల కూడా ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే... ఇందులో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరుతో మరోసారి కాజల్ జతకట్టనుంది. ముందుగా త్రిష అనుకున్నప్పటికీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో అందాల చందమామ టీమ్ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఆచార్య నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ RRR మూవీ మోషన్ పోస్టర్‌తో మెగా అభిమానులంతా పండగ చేసుకున్నారు. ఇప్పుడు చిరు సర్ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ykiwxZ
v

Nithiin Birthday: నితిన్‌కి ‘మెగా’ సర్ ప్రైజ్.. బర్త్ డే బాయ్ ఆనందానికి అవధుల్లేవ్

ఈ మధ్యనే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ‘రాననుకున్నావా?? రాలేననుకున్నావా’? అంటూ వరుస ట్వీట్‌లతో చెలరేగిపోతున్నారు. ఇప్పటికే 282 K ఫాలోవర్స్‌ చిరుని ఫాలో అవుతున్నారు. తాజాగా నేడు హీరో నితిన్ పుట్టిన రోజు కావడంతో విషెష్ అందిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్ డే నితిన్.. మీరు ప్రజాక్షేమం కోసం మీ పర్శనల్ లైఫ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు. కరోనాపై పోరాడుతున్నయోధుడు అని అనిపించారు. ఇలాంటి పోరాటం ఉంటే కరోనా మన దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. మీకు మీకు కాబోయే భార్య షాలిలికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక కరోనాకు తన వంతుగా అందరికంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించిన నితిన్‌కి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. కాగా మెగాస్టార్ నుంచి తనకు మెగా బర్త్ డే విషెష్ అందడంతో నితిన్ ఆనందానికి అవధులు లేవు.. ‘థాంక్యూ సోమచ్ సార్.. వెరీ స్వీట్ ఆఫ్ యు సార్’ అంటూ రిప్లై ఇచ్చి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు నితిన్. ఇక నితిన్‌తోనే కాకుండా నితిన్‌కి కాబోయే భార్య షాలిని ఫ్యామిలీతో చిరుకి మంచి రాజకీయ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షాలిని రెడ్డి తెలంగాణ నాగర్ కర్నూల్‌కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నూర్జహాన్ పీఆర్పీలో చేరి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి మెగాస్టార్‌కి నితిన్ అత్తింటితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని నెలకొల్పారు. ఈ ఛారిటీకి ఇండస్ట్రీ తరుపున మంచి స్పందన లభించింది. వరుణ్ సందేశ్ 20 లక్షలు, రవితేజ 20 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ. 1 విరాళాలు ప్రకటించడంతో వారిని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు చిరు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bydtIz
v

Sunday 29 March 2020

నితిన్ బర్త్ డే గిఫ్ట్.. కొత్త సినిమాల పోస్టర్స్ సందడి

నేడు (మార్చి 30) హీరో బర్త్ డే కావడంతో తన అప్ కమింగ్ మూవీస్ పోస్టర్స్‌తో సందడి చేస్తున్నారు నితిన్. ఆదివారం నాడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగ్ దే’ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో నితిన్‌ని జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నితిన్, కీర్తి సురేష్‌లు అను అర్జున్‌లుగా కనిపించబోతున్నారు. కాగా భవ్యా క్రియేషన్స్ టీమ్ ప్రొడక్షన్ నెం. 12లో నితిన్ మరో సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కగా.. నితిన్‌కి బర్త్ డే విషెష్ అందిస్తూ బర్త్ డే పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా కన్ను కొట్టుడుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా వారియర్ నటిస్తోంది. ఎం.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధంచిన పోస్టర్‌లో నితిన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే హీరో నితిన్.. కరోనా వైరస్ ప్రభావంతో వచ్చేనెల 16న దుబాయ్‌లో జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అందరికంటే ముందు స్పందించి ప్రభుత్వానికి రూ.20 లక్షల సాయం అందించారు నితిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bzVMZ3
v

ఇంకెవరు మన లచ్చక్కే... వర్మ ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై

ఆదివారం ఓ ట్వట్ చేశారు. ఓ చిన్నపాప చేసిన టిక్ టాక్ వీడియోను ఆయన తన పేజీలో పోస్టు చేశారు. అందులో ఆ అమ్మాయి తల్లి మిలుకు తాగుతావా మిలుకు అంటూ చిన్నారిని అడుగుతుంది. దానికి ఆ చిన్నారి మిలుకు కాదది మిల్క్. అంటూ ఆ పదాన్ని ఎలా పలకాలో వివరిస్తాది. అయితే ఆ వీడియోలో లిటిల్ గర్ల్ ఎవరిని ఇమిటేట్ చేస్తుంది అని వర్మ నెటిజన్లకు ప్రశ్నించాడు. దీనిపై స్పందించని ఇవాళ బదులిచ్చాడు. ట్విట్టర్ ‌లో ‘ ఇంకెవరు మన లచ్చక్క. అమ్మో నేను అయిపోయాను. ఎటూ పారిపోలేను కూడా’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వర్మ పెట్టిన ట్వీట్‌కు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. అంటూ ట్వీట్ చేశారు. మరికొందరు అయితే అదే టిక్ టాక్ వీడియోను కూడా పోస్టు చేశారు. ఇంకొందరు మంచు లక్ష్మీ డైలాగ్స్‌ను ఇమిటేట్ చేసిన వీడియోలను పెట్టారు. ఇక మంచు మనోజ్ పెట్టిన పోస్టుకు కూడా ఆయన అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. నువ్వు సూపర్ అన్న అంటూ కితాబిస్తున్నారు. మనోజ్ చాలా స్పోర్టివ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకొందరు అయితే ఎక్కడికి పారిపోలేవు అన్నా ఇప్పటికే దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ ట్వీట్ పెడుతున్నారు. మొత్తం మీద మరోసారి వర్మ వల్ల మంచు లక్ష్మీ హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో మరోసారి లక్ష్మక్క డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై మరి ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QTsNYv
v

మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన బన్నీ పోస్ట్.. అది అవసరమా అంటూ ట్రోల్స్

‘చెప్పను బ్రదర్’.. అంటూ ఆ రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూశారు స్టైలిష్ స్టార్ . పనికట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘డీజే’ సమయంలో అల్లు అర్జున్‌ని ట్రోల్ చేశారు. మెగా హీరోగా మెగా ఆశీస్సులతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే.. కానీసం వాళ్ల పేరుని కూడా చెప్పడానికి ఇష్టం లేదు బ్రదర్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కాలింది. అసలే పవన్ ఫ్యాన్ పైగా ఇగో హర్ట్ అయితే రచ్చ మామూలుగా ఉండదుగా.. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏది వచ్చినా దాన్ని పనికట్టుకుని డిస్ లైక్స్ చేసేవారు. అప్పట్లో దువ్వాడ జగన్నాథం టీజర్, ట్రైలర్‌లు డిస్ లైక్స్‌తో రికార్డుల కెక్కాయి అంటే అది పవన్ ఫ్యాన్స్ చేసిన పనే అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది కదా.. ప్రతి హీరో సినిమాకి వెళ్లి పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం కరెక్ట్ కాదని నాగబాబుతో సహా అందరూ చురకలేశారు. అరే ఇదంతా అయిపోయి ముచ్చట. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో బన్నీ కలవడం. ఇద్దరి మధ్య సమస్యసమసిపోవడం జరిగిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంటే బన్నీ కూడా. మెగా హీరోల్లో బన్నీ కూడా టాప్ స్టార్. పలు సందర్భాల్లో సైతం బన్నీ.. తమకి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది అంటే అది కేవలం గారు మాకు ప్లాట్ ఫామ్ వేయడం వల్లే అని చెప్పారు కూడా. అయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయిన సందర్భంగా థాంక్స్ చెప్తూ ఫేస్ బుక్‌ల పెట్టిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ మధ్య మళ్లీ చిచ్చు పెట్టింది. గంగోత్రి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. 17 ఏళ్లుగా తనని సపోర్ట్ చేస్తూ వస్తున్న తెలుగు ప్రేక్షకులకు అలాగే తన ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగోత్రి సినిమాతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అశ్వనీదత్, అల్లు అరవింద్‌లకు ఆ చిత్రంలో నటీనటీనటులకు, టెక్నీషియన్‌లకు థాంక్స్ తెలియజేశారు. Read Also:

కాగా ఈ పోస్ట్‌లో ఎక్కడా మెగా స్టార్ ప్రస్తావన లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మెగా హీరోగా అరంగేట్రం చేసిన బన్నీ చివరకి ఆ మెగా స్టార్‌నే మరిచిపోవడం ఏంటి?.. పైగా తన పోస్ట్‌‌లో ‘మై ఆర్మీ’ అని పెట్టుకోవడం అవసరమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక అదే పోస్ట్‌లో Greatfull అని రాయడంతో ‘అన్నయ్యా ఆక్స్ ఫర్డ్‌తో పాటు అన్ని డిక్షనరీలు తిరగేశా.. కాని ఈ Greatfull పదానికి అర్థం చెప్పలేకపోతుంది. అది Greatfull కాదు Grateful అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wCLXLl
v

‘మహానుభావుడు’గా మారండి: శర్వానంద్ ‘ఓసీడీ’ టిప్స్

శర్వానంద్ హీరోగా మూడేళ్ల క్రితం ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ ఓసీడీతో బాధపడే వ్యక్తిగా నటించారు. ఓసీడీ ఫుల్ ఫాం ‘అబ్సెషన్‌ కంపల్షన్‌ డిసీజ్’. ఓసీడీ ఉన్నవాళ్లు కడిగిన చేతులే కడుగుతుంటారు.. వేసిన తాళాలు మళ్లీ మళ్లీ చెక్‌ చేస్తుంటారు.. కట్టేసిన గ్యాస్‌ సిలెండర్‌ను మాటిమాటికీ చూస్తుంటారు.. అంతేకాదు, ఎదుటివాళ్లు కూడా శుభ్రంగా ఉన్నారా లేదా అనే అనుమానంతో సతమతమవుతూ ఉంటారు. ‘మహానుభావుడు’ సినిమాలో శర్వానంద్ కూడా అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. శానిటైజర్ జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు మనందరినీ అలాగే ఉండమంటున్నారు శర్వానంద్. శర్వానంద్ నిన్నటి వరకు ట్విట్టర్‌లో లేరు. అయితే, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పాటు ప్రజలతో టచ్‌లో ఉండాలని నిర్ణయించకుని ఆదివారం అకౌంట్ ఓపెన్ చేశారు. ఉద‌యం 11 గంట‌ల‌కు తొలి ట్వీట్ చేశారు. దిన‌స‌రి వేతనంతో ప‌నిచేసే కార్మికులు సినిమా సెట్లపై అంద‌రికంటే ఎక్కువ‌గా క‌ష్టప‌డుతుంటార‌ని ట్వీట్‌లో పేర్కొన్న ఆయ‌న‌.. షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన క‌రోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 15 ల‌క్షలు విరాళం ప్రకటించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేప‌థ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను త‌ప్పనిస‌రిగా పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్లల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటిక‌ప్పుడు అందిస్తున్న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను పాటించి ఆరోగ్యంగా ఉండాల‌ని శ‌ర్వానంద్ కోరారు. ఆ తర్వాత కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు. ‘‘మన ప్రజల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం మీరు ఒక మహానుభావుడు’’ కావాలి అని తన సినిమాను గుర్తు చేస్తూ జాగ్రత్త చెప్పారు. ఆసక్తికరమైన ఇలస్ట్రేషన్ ఇమేజ్‌లు తన ట్వీట్‌లో పొందుపరిచారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JkhFjb
v

బర్త్‌డే రేపు.. ఫ్రెండ్ అంటావ్ మళ్లీ: కీర్తి సురేష్ గాలి తీసేసిన నితిన్

హీరో నితిన్ సినిమాల్లో చాలా క్యూట్‌గా, లవర్ బోయ్‌లా కనిపిస్తారు కానీ.. బయట మాత్రం చాలా అల్లరి. అవతలవాళ్లని ఆటపట్టిస్తూ ఉంటారు. ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రష్మిక మందనను ఎలా ఆటపట్టించారో మనం చూశాం. రష్మిక కుక్క బిస్కెట్లు తింటారంటూ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కీర్తి సురేష్ గాలి తీసేశారు నితిన్. దీనికి కారణం ఆమె ఒక్కరోజు ముందు నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం. నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘రంగ్ దే’ అనే సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం (మార్చి 30న) నితిన్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒక్కరోజు ముందు.. అంటే ఆదివారం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అర్జున్‌గా నితిన్, అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. Also Read: అయితే, ఈ మోషన్ పోస్టర్‌ను ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విషింగ్ యు ఎ హ్యాపీ క్వారంటైన్ బర్త్‌డే అర్జున్! లవ్, అను’’ అని కీర్తి సురేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నితిన్ రిప్లై ఇచ్చారు. తన చమత్కారాన్ని ప్రదర్శించారు. ‘‘పుట్టినరోజు రేపు అను.. బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ.. రేపు విష్ చెయ్యి మళ్లీ.. బై’’ అని సీరియస్‌గా కామెడీగా ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. రచన, దర్శకత్వం వెంకీ అట్లూరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X2M7qb
v

కరోనా కష్టాలు.. బుద్ధిగా భార్య చెప్పింది చేస్తోన్న ఆలీ

కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ కరోనాపై పోరాడుతున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను సెలబ్రిటీలు కష్టంగా భావించడంలేదు. తమ కుటుంబ సభ్యులతో గడపడానికి దొరికిన క్షణాలుగా భావిస్తున్నారు. అందుకే, తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఇన్నాళ్లు తమకోసం పనిచేసినవాళ్లకు కాస్త విశ్రాంతిని ఇస్తున్నారు. కమెడియన్ ఆలీ అయితే తన భార్య చెప్పిన పనులన్నింటినీ బుద్ధిగా చేసేస్తున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో ఇల్లు శుభ్రంచేసే ఆలీ మాప్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఆయన భార్య సుల్తానా బేగం ఇల్లు శుభ్రంచేసే లిక్విడ్‌ను మాప్ బాక్స్‌లో పోస్తుండగా.. స్టిక్ పట్టుకుని ఇళ్లు ఒత్తగానికి సిద్ధంగా ఉన్నారు ఆలీ. తాను రోజూ కార్లు కడుగుతున్నానని, ఇంట్లో పని చేస్తున్నానని ఆలీ చెప్పారు. కూరగాయలు కట్ చేస్తున్నానని, ఇల్లంతా శుభ్రపరుస్తున్నానని వెల్లడించారు. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నానన్నారు. తన భార్య ఏ పని చెబితే అది బుద్ధిగా చేసేస్తున్నానని.. వంట కూడా చేస్తున్నానని తెలిపారు. Also Read: ‘‘నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాడిని. నేను వంట చేయడం వల్ల నా రూమ్‌‌మేట్స్ నన్ను అద్దె కట్టమనేవాళ్లు కాదు. అప్పుట్లో నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాడిని. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vVRyvG
v

Nithiin: ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్.. ఊపిరి తగిలే శ్వాసల్లో నితిన్, కీర్తి సురేష్

‘భీష్మ’ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న హీరో జోరు మీద ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ క్వీన్, జూ. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రేపు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్‌లుక్‌లో నితిన్, కీర్తి సురేష్‌లు ఊపిరి తగిలేటంత శ్వాసల్లో బందీలు అవుతూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ చిత్రంలో అను, అర్జున్‌లుగా కనిపించబోతున్నారు నితిన్, కీర్తి సురేష్‌లు. తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం హిట్ కావడంతో నితిన్‌-నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3apMsac
v

మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటా: రేణు దేశాయ్

రేణు దేశాయ్.. పరిచయం అవసరంలేని పేరు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భార్యగా మారారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ముద్రను పోగొట్టాలని చూస్తున్నారు. రేణు. అందుకే, తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లపాటు పిల్లలతో పూణేలో ఉన్న రేణు అక్కడ మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన టీమ్‌తో కలిసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అయితే, అది సినిమా షూటింగా లేదంటే ఏదైనా డాక్యుమెంటరీనా అనే విషయం తెలీదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆపేశారు. అప్పుడు షూటింగ్ చేసే సమయంలో వికారాబాద్‌లోని మారుమూల గ్రామాలను రేణు దేశాయ్ సందర్శించారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇప్పటికే రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ గ్రామాల్లో తిరగడం, అక్కడి వాతావరణాన్ని దగ్గరగా చూడటంతో రేణు దేశాయ్‌లో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. Also Read: వికారాబాద్‌లోని ఓ గ్రామంలో అక్కడి పిల్లలతో తీసుకున్న వీడియో, అక్కడి పశువులు, వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే వీడియోలను తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాను వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ఈ పోస్ట్‌లోనే పేర్కొన్నారు. ‘‘గ్రామీణ జీవనాన్ని కోల్పోతున్నా.. అస్సలు ఇబ్బందిలేని సాధారణ జీవితం.. నా పిల్లలు కాలేజీకి వెళ్లడం ప్రారంభించిన తరవాత ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయం చేయాలని నాకు బలమైన కోరిక ఉంది. కొన్ని కూరగాయలను పండించడం, 10 పిల్లులు, 10 కుక్కలు, పశువులను పెంచడం, అపరిమితంగా పుస్తకాలను సరఫరా చేయడం. ఇలా జరిగితే అదే నాకు స్వర్గం అవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది’’ అని రేణు పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WTxh50
v

అమేజాన్ ప్రైమ్‌లో ఆ సినిమా ఉంది... మీరిద్దరూ చూడండి: వర్మ

ివివాదాస్పద దర్శకుడు మరో ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఆయన రకరకాల ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస పనిలో పడ్డారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు , కూడా క్వారంటైన్‌లో ఉన్నారన్నారు వర్మ. అందుకే వాళిద్దరు అమేజన్ ప్రైమ్‌లో ఉన్న ‘’ సినిమా చూడాలని కోరారు. అంతేకాదు ఆ సినిమా చూసి వారిద్దరు తనకు ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వాలన్నారు వర్మ. మరసారి వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ మారుతోంది. అప్పుడు పై నెటిజన్స్ స్పందించడం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్లను ఎందుకు కదుపుతున్నావని ప్రశ్నిస్తున్నారు. కొందరు లోకేష్‌కు ట్యాగ్ చేసే దమ్ములేదా అని కూడా అడుగుతున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమా విషయంలో టీడీపీ వర్మపై అనేక రకాల విమర్శలు చేసింది. ర్మ కూడా ఈ సినిమాలో చంద్రబాబును, లోకేష్‌ను నెగిటివ్ క్యారెక్టర్లతో చూపించారని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. అయితే ఇప్పుడు వర్మ మరోసారి చంద్రబాబును లోకేష్‌ను ఆ సినిమా చూడాలంటూ ట్వీట్ చేయడంతో ఇప్పుడు మరోసారి అమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరపైకి వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dEu932
v

చిరంజీవిని అప్పుడూ ఏరా అనేవాడిని ఇప్పుడూ ఏరా అనే పిలుస్తా: భాను చందర్

1978 నుంచి 2020 వరకూ హీరో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. 80 నాటి హీరోల్లో ఇతనూ ఒకరు. మన ఊరి పాండవులు, ఆడవాళ్లు మీకు మా జోహార్లు, సత్యం శివం, గూడచారి నెం.1, తరంగిణి ఇలా వందకు పైగా చిత్రాల్లో నటించిన భానుచందర్.. ఇటీవల హిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. గారు నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మన ఊరి పాండవులు మూవీ షూటింగ్‌ టైంలో మేం ఒకే రూంలో ఉన్నాం. అసలు వాడే నాకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ డ్రైవ్ చేయడం నేర్పించాడు దోయకాయల పల్లిలో. రేయ్.. నీకు బైక్ తోలడం వచ్చా? అని అడిగాడు.. నాకు టూ వీలర్ రాదురా.. కారు తోలుతా అంటే.. ఛా!! రారా అని ఆ దగ్గర్లో ఎవరో రాజుగారో రెడ్డిగారో ఉండేవారు ఆయన బైక్ తీసుకుని నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మేం ఇద్దరం చాలా సరదాసరదాగా ఉండేవాళ్లం. రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే.. గంట గంటకు వర్షం వచ్చేది. ఆ టైంలో బాపు గారు పిలిచి.. భాను నువ్ కరాటే చేస్తావ్ అంట కదా.. చేయి అంటే చిరంజీవి, నేను స్లోమోషన్‌లో కరాటే చేసేవాళ్లం. మేం ఇద్దరం చాలా క్లోజ్. వాడికి నాకు స్నేహంలో ఎప్పుడూ మార్పులేదు. అప్పుడు ఏరా ఏరా అనుకున్నాం ఇప్పుడు ఏరా ఏరా అనుకుంటాం. వాడు చాలా సరదా మనిషి. దాన్ని గురించి చెప్పడం కంటే అనుభవిస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఏడాది మేం అంతా కలుస్తూ ఉంటాం.. ఈ ఏడాది కూడా కలిశాం. నెక్స్ట్ ఇయర్ మేం అంతా కలిసి గోవా వెళ్లబోతున్నాం’ అంటూ చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు భాను చందర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3asNNNo
v

హ్యాపీ బర్త్‌డేరా జున్ను.. కొడుకుతో నాని ఆటలు

సాధారణంగా సినిమా హీరోలకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. రాత్రింబవళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు.. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్యలో వచ్చే విరామంలో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లు వేస్తుంటారు. కానీ, ఇంట్లోనే భార్య, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే, కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ సినిమా హీరోలను తమ ఫ్యామిలీకి బాగా దగ్గర చేసిందని చెప్పుకోవాలి. ఈ 21 రోజులూ ఇంట్లోనే ఖాళీగా ఉండే హీరోలు భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని తన కుమారుడు జున్ను (అర్జున్)తో ఆడుకుంటూ మధుర క్షణాలను గడుపుతున్నారు. ఈరోజు (మార్చి 29)న జున్ను మూడో పుట్టినరోజు. ఈ సందర్భంగా జున్నుకి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డేరా జున్ను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో జున్నును ముద్దాడుతున్న ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ తరవాత కాసేపటికి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నాని. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. కొడుకుతో పాటు మంచం మీద పడుకుని ఐరన్ మ్యాన్ కోసం ఊసులాడుతున్నారు. వచ్చీరాని మాటలతో జున్ను నాన్నకు ఐరన్ మ్యాన్ గురించి చెప్పేస్తున్నాడు. నాన్న ముక్కుపట్టుకుని పిసికేస్తు్న్నాడు. ముద్దులు పెడుతున్నాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం చాలా ముద్దుముద్దుగా ఉంది. కాగా, 2012 అక్టోబర్ 27న నాని, అంజన వివాహం జరిగింది. 2017 మార్చి 29న నాని భార్య అర్జున్‌కు జన్మనిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QRxPV6
v

నితిన్ పెళ్లి వాయిదా.. ఎమోషనల్ పోస్ట్‌తో అఫీషియల్ ప్రకటన

కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు హీరో నితిన్. తన స్నేహితురాలు, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌లో ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో పాటు అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారడంతో హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా చేశారు. ‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిఉన్నాయో మీకు తెలుసు. అత్యవరస పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మిల్ని ప్రార్ధిస్తున్నాను. అంతే కాదు.. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసి కట్టుకట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లలో మనం కాలు మీద కాలేసుకుని కూర్చుని మన కుటుంబంతతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు, ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్’’ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు నితిన్. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తన వంతు సాయంగా రూ. 20 లక్షలు విరాళాన్ని ప్రకటించారు హీరో నితిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wK8mGt
v

సింగర్ కనికా కపూర్‌కు నాలుగోసారీ కరోనా పాజిటివ్.. ఆందోళనలో కుటుంబం

గాయని కనికా కపూర్‌కు ఇప్పటికే మూడు సార్లు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. నాలుగోసారి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆమె కుటుంబ సభక్యులు ఆందోళన చెందుతున్నారని వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ పేర్కొంది. కనికా ట్రీట్‌మెంట్‌కు స్పందించకపోవడం పట్ల కుటుంబం చాలా కంగారుపడుతోందని ఫ్యామిలీ మెంబర్ ఒకరు తెలిపినట్టు ఐఏఎన్‌ఎస్ వెల్లడించింది. ‘‘టెస్ట్ రిపోర్ట్స్ చూసి మేం చాలా ఆందోళన చెందుతున్నాం. ట్రీట్‌మెంట్‌కు కనికా స్పందించడంలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విదేశాలు కూడా తీసుకెళ్లలేం. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని కనికా కుటుంబసభ్యుడు వెల్లడించారు. అయితే, కనికా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చిన కనికా కపూర్.. అక్కడి నుంచి కాన్పూర్, లక్నో వెళ్లారు. ఆ తరవాత కనికా దగ్గు, జ్వరంతో బాధపడటంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు కరోనా వైరస్ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. కనికాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మీడియా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనికి కారణం ఉంది. లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్.. క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీల్లో పాల్గొన్నారు. ఆమె ఎంత మందికి అంటించారో అని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆమెతోపాటు పార్టీలో పాల్గొన్న ఎవరికీ కరోనా వైరస్ పాజిటివ్ రాలేదు. కాగా, కనికా కపూర్‌ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ()లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, అక్కడ డాక్టర్లు కనికాపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఒక స్టార్‌లా కాకుండా ఒక పేషెంట్‌లా వ్యవహరిస్తే వైద్యం అందించగలమని స్పష్టం చేశారు. గత 9 రోజులుగా చికిత్స పొందుతోన్నా కనికాను మాత్రం కరోనా వదిలిపెట్టడంలేదు. వరుసగా నాలుగోసారి పరీక్ష చేసినా పాజిటివ్ రావడం ఆందోళనకరం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UOjo5o
v

సినీ కార్మికులకు అండగా మాస్ మహారాజ్... రూ. 20లక్షలు అందించిన రవితేజ

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా మూతపడింది. షూటింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పేద సినీ కార్మికుల కోసం ప్రముఖ సినీ స్టార్స్ తమ వంతు సాయాన్నిఅందిస్తున్నారు. వారి కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అగ్రహీరోల నుంచి కుర్ర హీరోల వరకు అంతా తమవంతు సాయంగా తోచినంత విరాళం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రూ20 లక్షలు సాయం ప్రకటించారు. సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తున్నానన్నాడు. పనుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు రవితేజ. లాక్ డౌన్ తో రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కోసం ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దగ్గుబాటి ఫ్యామిలీ తరపున రాణా, వెంకటేష్, సురేష్ బాబు కోటి రూపాయాలు విరాళం అందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్, తారక్ రూ. 25 లక్షలు ఇచ్చారు. 21 రోజుల లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ మనకి అత్యంత అవసరమని… అందరూ ఇంటిలోనే ఉండి విధిగా పాటించాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రవితేజ అభిమానులు ఆయన విరాళంపై ప్రశంసలు అందిస్తున్నారు. నాలుగు మూవీలు వరుసగా ప్లాప్ అయినా.. కూడా 20 లక్షలు అందించిన నువ్వు సూపర్ అంటూ రవితేజపై ట్వీట్లు వేస్తున్నారు. ఈ ట్వీట్ కోసమే వెయిట్ చేస్తున్నామంటూ మరికొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. నువ్వు రియల్ హీరో అన్న ప్లాప్స్‌లో కూడా ఇంత పెద్ద సాయం చేశావు అంటూ మరికొందరు రవితేజ అభిమానులు ప్రశంసలతో ఆయనను ముంచెత్తుతున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ సినిమా డిస్కో రాజా కూడా బాక్స్ ఫీస్ వద్ద బోల్తా పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bvJG3h
v

Saturday 28 March 2020

Corona Crisis Charity: వరుణ్ తేజ్ 20లక్షలు, శర్వా 15, దిల్ రాజు 10 ఇంకా..

కరోనా కష్టానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా వైరస్ విజృంభనతో షూటింగ్‌లు లేక సినిమాలు విడుదల కాక వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని చాలా మంది కార్మికులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్‌లు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తూ వాళ్ల ఆకలి తీర్చుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ కరోనా క్రైసిస్ ఛారిటీకి మెగా ప్రిన్స్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే శర్వానంద్ 15 లక్షలు, మాస్ కా దాస్ రూ. 5 లక్షలు, బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Up4dAI
v

మళ్లీ మిడిల్ ఫింగర్ ఎత్తిందండోయ్.. బూతుల వరద బాబోయ్

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మనందరం వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. చేతులకు గ్లౌజ్, శానిటైజర్స్ ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా వైరస్ ఉన్న వ్యక్తి నోటి నుండి వచ్చే తుపర్లు, తుమ్ములు, దగ్గు కారణంగా కారణంగా ఒకర్నుంచి ఒకరికి ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుండటంతో ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించే వాటిని మాస్క్‌లు అని పిలుస్తున్నాం. అయితే వీటికి కూడా తన మార్క్ నామకరణం చేసుకుంది వివాదాస్పద నటి . బూతుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వల్గారిటీ లేనిదే పోస్ట్ పెట్టినా కిక్ ఉండదని అనుకుంటారో ఏమో కాని.. ఈ మాస్క్‌కి ‘మై నోస్ డ్రాయర్’ అంటూ పేరుపెట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అంతటితో ఆగిందా... ఏమైందో ఏమో కాని తనకు అలవాటుగా మారిన మిడిల్ ఫింగర్‌ని మళ్లీ లేపింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను బండబూతులు తిడుతూ మీడియా ముందే మిడిల్ ఫింగర్‌ని చూపించింది శ్రీరెడ్డి. ఆ తరువాత పలు సందర్భాల్లోనూ వేలికి పనిచెప్పింది. తాజాగా మరోసారి తన మిడిల్ ఫింగర్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ మిడిల్ ఫింగర్ పోస్ట్‌పై నెటిజన్లు రెచ్చిపోయారు.. బూతుల పంచాంగం విప్పుతూ రెండు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. వాళ్ల బూతులకు సైతం శ్రీరెడ్డి రిప్లైలు ఇస్తూ వాళ్లను మరింత రెచ్చగొట్టింది. కొంతమంది అయితే కరువు బాపతు సంఘం నుంచి వచ్చిన వాళ్లలా శ్రీరెడ్డిని డైరెక్ట్‌గానే మ్యాటర్ గురించి అడిగేస్తున్నారు. వామ్మో ఇంతమంది బ్యాడ్ కోబ్రాస్ ఉన్నారా అంటూ రియాక్ట్ అయ్యి బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్లకు హాట్ రిప్లైస్ ఇస్తోంది శ్రీరెడ్డి. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే కరోనాతో ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటంతో అదే పనిగా శ్రీరెడ్డి పోస్ట్‌లకు లైక్‌లు కామెంట్స్ షేర్స్ మోత మోగిస్తున్నారు. ఈ పోస్ట్‌లతో పాటు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నిర్మూలకు చాలా మంది డొనేషన్లు అందిస్తుండటంతో వారిని అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టింది. ఎన్టీఆర్, ప్రభాస్‌లను అభినందిస్తూ.. జగన్ ప్రభుత్వానికి సాయంగా నిలిచిన వారికి జైకొట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jpf4nU
v

మద్యం షాపులు తెరవాలన్న స్టార్ హీరో... నెటిజన్ల మద్దతు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేవలం నిత్యవసరాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నింటిని బంద్ చేయించారు. మద్యం దుకాణాల్ని కూడా మూసివేయించారు. దీంతో మద్యం ప్రియులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రంలో అయితే మద్యం దొరక్క కొందరు వింత ప్రవర్తనలతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీంతో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశాడు. రోజులో రెండు గంటలైనా మందు షాపులు తెరవాలని ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయ రిక్వెస్ట్ చేశారు. మందు బాబులకు తన మద్దతుని తెలియజేశారు. ప్రతిరోజూ సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ''ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుండి డబ్బులు అవసరం. అందుకోసం లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను కొంతకాలం సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుంది. తప్పుగా అర్థం చేసుకుని నన్ను తిట్టొద్దు. లాక్ డౌన్ సమయంలో మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో మద్యం అవసరం. కాబట్టి బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాటు చేయండి'' అని ట్వీట్ చేశారు రిషి కపూర్. అయితే రిషి కపూర్ చేసిన ఈ పోస్టుకు చాలామంది మద్దతు పలుకుతున్నారు. మీ అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు సూపర్ సార్ అంటూ.... ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే మద్యంపై కవితలు సైతం రాసి పోస్టు పెడుతున్నారు. ఆకలితో ఉన్నవాడు అన్నం, దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఎలా అవసరమో... తాగుబోతుకు తాగుడు కూడా అంతే అవసరం ... అంటూ ఓ నెటిజన్ కవిత కూడా రాసి పోస్టు పెట్టాడు. మరికొందరు మాత్రం ఇలాంటి సమయంలో మద్యం షాపుల్ని తెరిస్తే... ఆ రద్దీని తట్టుకోలేమని చెబుతున్నారు. అలాంటివారిని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుందని చెబుతున్నారు. మరి ప్రభుత్వం రిషి కపూర్ రిక్వెస్ట్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి. కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ నెలకొంది. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజలు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైయారు. ఇదే సమయంలో మందుబాబులకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UNp3Zu
v

మరో సినీనటికి కరోనా పాజిటివ్.. మూలికలు తీసుకుంటూ వీడియో

కరోనా మహమ్మారి విజృంభనకు మరో నటి బలైంది. ఇతర దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలబ్రిటీలు, దేశ ప్రధానుల్ని సైతం కబలిస్తోంది ఈ భయంకర వైరస్. రోజుకి వందలాది మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. వేలాదిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రముఖ అమెరికన్ నటి, జుమాంటీ ఫేమ్ లారా బెల్ బండీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరించింది బెల్ బండీ. ఈమె వయసు 38 ఏళ్లు కాగా.. గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, చాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్నతాను.. అంతకంతకూ వ్యాధి తీవ్రత పెరగడంతో శ్వాసకోస సంబంధమైన సమస్యలు సైతం వచ్చాయని.. ఈ తరుణంలో కరోనా వైరస్‌పై సరైన అవగాహన లేక వ్యాధి నిర్థారణకు ఆలస్యం అయ్యిందని చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ అని తేలినతరువాత స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నాను.. పరిస్థితి అదుపులోనే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.. వారి వైద్యంతో పాటు మూలికలను తీసుకుంటున్నా. భయపడాల్సిన అవసరం లేదు.. దయచేసి ఎవరూ బయటకు రాకండి.. పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించండి. కరోనా వస్తే చనిపోతారనే భయం వద్దు.. సరైన ఆరోగ్య పరిరక్షణలు పాటిస్తే తిరిగి మామూలు మనుషులు అవ్వొచ్చు’ అంటూ తెలియజేశారు బెల్ బండీ. కాగా ఈమెతో పాటు హాలీవుడ్ నటులు ప్రముఖ నటుడు టామ్‌ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, ‘జేమ్స్‌ బాండ్‌’ నటి ఓల్గా కురీలెన్కో ఆల్రెడీ, ఇద్రిస్ ఎల్బా, ఆండీ కెహెన్ తదితరులు కరోనా బారిన పడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UMNneb
v

డాక్టర్లకు అండగా నిఖిల్.. భారీగా ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్ కిట్స్ అందించిన హీరో

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలాగే, తెలుగు చిత్ర ప‌రిశ్రమలో ప్రముఖులు సైతం త‌మ వంతుగా ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌కు యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్స్‌, మెడిక‌ల్ సిబ్బందికి చేయూత‌గా వారి ర‌క్షణ‌కి ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్స్ కిట్స్ భారీగా అందించారు. 2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు, 2000 రీ-యూజ‌బుల్ గ్లోవ్స్, 2000 ఐ-ప్రొట‌క్షన్ గ్లాసులు, శానిటైజ‌ర్లు, 10000 ఫేస్ మాస్కులు.. ఈ కిట్స్ అన్నింటినీ గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘క‌రోనా నివార‌ణ మ‌నంద‌రికీ ఎంత ముఖ్యమో, డాక్టర్లును సైతం ఆ క‌రోనా భారిన ప‌డ‌కుండా, వారికి శ్రమ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. డాక్టర్లతో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మున్సిప‌ల్ కార్మికులు, అధికారులు మనంద‌రి కోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయ‌కుండా క‌ష్టప‌డుతున్నారు. అందుకు నేను కృత‌జ్ఞత‌గా ఈ ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్ కిట్స్ అందిస్తున్నాను. క‌రోనా నివార‌ణ జ‌ర‌గాలంటే మ‌నంద‌రం ఇంటిలోనే ఉంటూ ఆరోగ్య ప‌ర‌మైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌కి మ‌నంద‌రం స‌హ‌క‌రించాలి’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33YrTPB
v

కమల్‌పై కరోనా వదంతులు.. కారణం గౌతమీనా!!

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిందని, ఆయన తన ఇంట్లోనే నిర్బంధంలోనే ఉన్నారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దానికి కారణం చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లోని ఆయన ఇంటికి చెన్నై కార్పోరేషన్ వాళ్లు అతికించిన ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్. కమల్ హాసన్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించగానే వదంతలు మొదలైపోయాయి. దీంతో కమల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కమల్‌కు కరోనా పాజిటివ్ అనే వదంతలు రావడంతో వెంటనే ఆ స్టిక్కర్‌ను కార్పోరేషన్ వాళ్లు తొలగించారు. అభిమానులు ఆందోళనకు గురవుతోన్న విషయం తెలిసి కమల్ హాసన్ కూడా స్పందించారు. తనకు కరోనా సోకింది అనే వదంతులో నిజం లేదని స్పష్టం చేశారు. అసలు ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ అతికించిన ఇంటిలో కొన్నేళ్లుగా తాను ఉండటం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. Also Read: అయితే, కమల్ ఇచ్చిన వివరణ తర్వాత చాలా మందిలో ఒక అనుమానం తలెత్తింది. అసలు కమల్ ఇంటికి ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ ఎందకు అతికించారనే ప్రశ్న తలెత్తింది. దీనికి చెన్నై కార్పోరేషన్ వివరణ ఇచ్చింది. దీనికి కారణం కమల్ మాజీ భార్య గౌతమి. నటి గౌతమితో ఆల్వార్‌పేట్ ఇంట్లోనే కమల్ ఉండేవారు. 13 ఏళ్లపాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2016లో విడిపోయారు. ఆ తరవాత ఆమె ఆ ఇంటిని ఖాళీ చేశారు. కానీ, గౌతమి పాస్ పోర్ట్‌పై ఇప్పటికే అదే ఇంటి అడ్రస్ ఉంది. ఇటీవల గౌతమి దుబాయ్ నుంచి చెన్నైకు తిరిగొచ్చారు. దీంతో ఆమె పాస్‌ పోర్ట్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా కమల్ ఇంటికి కార్పోరేషన్ వాళ్లు స్టిక్కర్ అతికించేశారు. పొరపాటు జరిగిందని తెలిసి కాసేపటి తరవాత తొలగించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33R3TOk
v

పనిమనిషిని రేప్ చేసిన రచయిత.. మండిపడ్డ సింగర్ చిన్మయి

ఆ దేశంలో అతనో ప్రముఖ రచయిత.. అలాంటి ఇలాంటి రచయిత కాదు.. ‘మమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా’ అనే పుస్తకంతో దేశ వ్యాప్తంగా పేరుగడించారు. ఈ పుస్తకం అతని ఆత్మకథే.. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారాయన. ఒకసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఓ తమిళ పని మనిషిపై అత్యాచారం చేసి పాడుచేశానని స్వయంగా ఆయనకు ఆయనే పుస్తకంలో రాసుకున్నారు. వారెవ్వా.. ఇలాంటివి కూడా వదలకుండా రాసుకున్న ఆ ప్రముఖుడు ఎవరు అంటే.. చీలీ దేశపు ప్రముఖ రచయితల్లో ఒకరైన పాబ్లో నెరుడా ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి. ఇంతవరకూ బాగానే ఉంది.. కాని మరి ఆ పుస్తకం మన వివాదస్పద శ్రీపాద కంటపడటంతో తుక్కురేగ్గొడుతూ ట్వీట్ పెట్టింది. ఇటీవల ప్రముఖ రచయిత, దౌత్య వేత్త హోదాలో ఉన్న పాబ్లో నేరుడా తమిళ పనిమనిషిని రేప్ చేశా అంటూ తన ఆత్మకథలో రాసుకున్న విషయం నాదృష్టికి వచ్చింది.. అంతా అయిపోయిన తరువాత ఆ ఘటనతో పశ్చాత్తాపం పడుతున్నానని అనడం సమజసమేనా.. ఇలాంటి వాళ్లను మహానుభావులుగా అభివర్ణించడం మన కర్మ’ అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ వదిలింది సింగర్ చిన్మయి. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UOEfG2
v

చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ.. భారీగా విరాళాలు

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ సీసీసీ మ‌న‌కోసంకు సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు.. దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ వెల్లడించారు. నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. ‘‘మ‌న సోద‌ర కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌లం అని చిరంజీవి త‌న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్‌.శంక‌ర్, క‌ల్యాణ్, దాము అంద‌రం క‌లిసి చిన్న క‌మిటీగా ఏర్పాట‌య్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్రమ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని నిర్ణయించాం. దీనికి నాందిగా మొద‌ట చిరంజీవి కోటి రూపాయ‌లను ప్రక‌టించారు. నాగార్జున కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్ రూ. 25 ల‌క్షలు ఇలా విరాళాలు ప్రక‌టించారు. వీరే కాకుండా ఎవ‌రైనా సినిమా ప‌రిశ్రమ కార్మికుల‌ను ఆదుకోవ‌చ్చు’’ అని చెప్పారు. Also Read: అనంతరం డైరెక్టర్ ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ.. ‘‘సీసీసీ మనకోసం సంస్థకి చైర్మన్‌గా మెగాస్టార్ చిరంజీవి ఉంటారు. అలాగే స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సురేష్ బాబు, సి.కల్యాణ్, దాము, బెన‌ర్జీ, నేను ఉంటాం. సీసీసీ మ‌న‌కోసం క‌మిటీతో పాటు డైరెక్టర్ మెహ‌ర్ ర‌మేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ, కొమరం వెంక‌టేష్, ఫెడ‌రేష‌న్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయ‌కులు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగ‌స్వాములు అవుతున్నారు’’ అని వెల్లడించారు. కాగా, ఈ ఛారిటీకి రామ్ చరణ్ కూడా రూ.30 లక్షలు ప్రకటించారు. ఆయన ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WQ4WN9
v

రియల్ హీరో.. రూ.25 కోట్ల భారీ విరాళం ఇచ్చిన అక్షయ్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేవలం రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని ఇప్పటికే నిరూపించుకున్నారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఆయన ఆర్మీకి డొనేట్ చేస్తూ ఉంటారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంచి అమర జవానుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. అయితే, రియల్ హీరో అనే ప్రశంసకు తాను పూర్తి అర్హుడనని మరోసారి నిరూపించారు అక్షయ్. కరోనా వైరస్‌పై పోరాటం కోసం తన వంతు సాయంగా రూ.25 కోట్ల బూరి విరాళాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు. కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. దానిపై పోరాడటానికి, దాని నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరం. అందుకే, ఈ నిధులను సేకరించడంలో దేశ ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఎవరికి తోచినంత చిన్న మొత్తమైనా విరాళంగా ఇవ్వొచ్చని ప్రధాని పేర్కొన్నారు. మీరిచ్చే ఒక్కో రూపాయి డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టం చేయడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మేరకు పీఎం-కేర్స్ ఫండ్‌ను శనివారం ప్రారంభించారు. విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అక్షయ్ కుమార్ రిప్లై ఇచ్చారు. తాను దాచుకున్న మొత్తం నుంచి రూ.25 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33SgYqA
v

మిత్రమా.. మార్పు రావాలి: మోహన్ బాబుకు చిరు మరో పంచ్

చిరంజీవికి చమత్కారం బాగా ఎక్కువైందని ఈ మధ్య వినిపిస్తోన్న మాట. నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన హాజరైన వేడుకలు, కార్యక్రమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇక రాజకీయాలకు టాటా చెప్పి తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించారు. ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రను పోషిస్తూ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలు నటించిన సినిమాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ తన చమత్కారంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌ను పంచుతున్నారు. కేవలం ఇలాంటి వేడుకల్లో అందించే ఎంటర్‌టైన్మెంట్ సరిపోదని ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి ఉగాది నాడు (మార్చి 25న) సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులు, ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అయితే, ట్విట్టర్‌లో కూడా తన చమత్కారంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు చిరంజీవి. ముఖ్యంగా తన మిత్రుడు, సహ నటుడు మంచు మోహన్ బాబుతో ఆయన చేస్తోన్న కామెడీ బాగా హైలైట్ అవుతోంది. Also Read: ట్విట్టర్‌లో చేరిన చిరంజీవికి ట్విట్టర్‌లోకి స్వాగతం పలుకుతూ మోహన్ బాబు 26వ తేదీన ట్వీట్ చేశారు. ‘‘మిత్రమా వెల్‌కమ్’’ అని చిరంజీవిని ట్యాగ్ చేసి మోహన్ బాబు సింపుల్ ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ మిత్రమా మోహన్ బాబు. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?’’ అంటూ ‘ఇంద్ర’ సినిమా డైలాగుతో చిరంజీవి పంచ్ వేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెపుతాను’’ అని పేర్కొన్నారు. మోహన్ బాబు ట్వీట్‌కు ఇప్పుడు మరోసారి పంచ్ వేశారు చిరంజీవి. ‘‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. కౌగిలింతలు వద్దు. కరచాలనాలు వద్దు. నమస్తే మాత్రమే పెడదాం! సామాజిక దూరం తప్పక పాటించాలి. మనవాళ్లని ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో మరింత అవేర్‌నెస్ కోసం మన లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు’’ అని మోహన్ బాబుకు చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు మరింత తెలివిగా స్పందించారు. ‘‘మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’’ అని రిప్లై ఇచ్చారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా సాగుతోన్న సంభాషణ అందరికీ మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39oOBl7
v

సినీ కార్మికులకు కోటి విరాళం ఇచ్చిన నాగార్జున

కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి వీళ్లేదు. కాబట్టి, అప్పటి వరకు షూటింగ్స్ అన్నీ బంద్. ఆ తరవాత కూడా ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేదు. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఆధారపడి బతికే సినీ కార్మికులపై పడింది. రోజువారీ వేతనానికి పనిచేసే చాలా మంది సినీ కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే కింగ్ నాగార్జున నడిచారు. సినీ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ మనకి అత్యంత అవసమని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి డి.సురేష్ బాబు, వెంకటేష్, రానా సంయుక్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్షన్స్‌ తరఫున కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతకు ముందు, సినీ కార్మికుల సంక్షేమం కోసం మహేష్ బాబు రూ.25 లక్షలు ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు. హీరో రాజశేఖర్ తన ఫౌండేషన్ తరఫున పేద సినీ కళాకారులు, కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూరగాయలను అందిస్తున్నారు. ఇలా, ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు తమవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WWr08y
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...