Tuesday 31 March 2020

అనాథ పిల్లలకు అండగా హరీష్ శంకర్.. సినీ కార్మికులకు శ్రీకాంత్, సప్తగిరి విరాళం

డైరెక్టర్ హరీష్ శంకర్ తన మంచి మనసును చాటుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో అనాథ పిల్లలకు రెండు నెలలపాటు వారికి ఆహారాన్ని అందించనున్నారు. హరీష్ శంకర్ మంగళవారం (మార్చి 31న) తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సరిపడే స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్, తదితర ఆహార పదార్థాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలంతా విరాళాలు అందజేయగా.. ఇప్పుడు చిన్న నటులు కూడా తమ వంతు సాయం అందజేస్తున్నారు. హీరో, సహాయ నటుడు శ్రీకాంత్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, కమెడియన్ సప్తగిరి రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు. Also Read: కాగా, కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ దాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. షూటింగ్‌లు లేకపోవడం వల్ల సినీ పరిశ్రమల రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో వాళ్లకు ఇల్లు గడవడం కూడా కష్టమే. అందుకే, వారిని ఆదుకోవాలని సినీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిని చేశారు. తన బాధ్యతగా కోటి రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39tCnI1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...