Tuesday 31 March 2020

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కలిసి ఇచ్చింది కేవలం రూ.3 కోట్లా?

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా నటి అనుష్క శర్మ, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు పీఎం-కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిన్న విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని వీరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి (మహారాష్ట్ర)లకు విరాట్, నేను మా వంతు సహకారం అందజేస్తున్నాం. దేశంలో ఎంతో మంది పడుతున్న బాధను చూసి మా గుండెలు బద్దలైపోతున్నాయి. మేం అందించే విరాళం మన పౌరుల ఆకలిని తీర్చడానికి కొంత మేర ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. భారత్ కరోనాతో పోరాడుతోంది’’ అని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, తాము ఎంత విరాళాన్ని అందజేస్తున్నాం అనే విషయాన్ని మాత్రం అనుష్క ప్రకటించలేదు. అయితే, ముంబై మిర్రర్ రిపోర్ట్ ప్రకారం ఈ స్టార్ కపుల్ రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో కొంత మంది పెదవి విరుస్తున్నారు. ఇండియాలోనే టాప్ సెలబ్రిటీలుగా ఉన్న కోహ్లి, అనుష్క కలిసి ఇచ్చేది ఇంతేనా అని నిట్టూరుస్తున్నారు. దీనికి కారణం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పీఎం-కేర్స్ ఫండ్’ను ప్రారంభించగానే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. కరోనాపై పోరాటానికి ఒక సెలబ్రిటీ ఇంత భారీ మొత్తం ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో ప్రతి ఒక్కరూ అక్షయ్‌తో పోలిక తీసుకొస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి వాణిజ్య ప్రకటనల ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అనుష్క శర్మ కూడా బాగానే వెనకేశారు. ఇంత సంపాదన ఉన్నవారు కేవలం రూ.3 కోట్లు విరాళంగా ఇవ్వడమేంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నిజానికి మన టాలీవుడ్ హీరోలే భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. రెబల్ ప్రభాస్ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగిలిన హీరోలు సైతం తమ వంతు సాయం అందజేశారు. బాలీవుడ్ నుంచి కూడా హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, భూమి పెడ్నేకర్, వరుణ్ ధావణ్ వంటి ఎంతో మంది సెలబ్రిటీలు విరాళాలు అందజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39r2Gyo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...