Wednesday 26 June 2019

Jr NTR: తారక్‌ని నటుడిగా తీర్చిదిద్దింది నాని!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తరవాత ఆ కుటుంబం నుంచి మళ్లీ నటనలో అంతటి ప్రశంసలు అందుకున్న నటుడు . తాతకు తగ్గ మనవడిగా నేటితరం హీరోల్లో ఉత్తమ నటుడిగా ఆయన ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఎలాంటి పాత్రనైనా తాను అవలీలగా చేసేయగలనని ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల ద్వారా చెప్పకనే చెప్పారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన ఈ నందమూరి యంగ్ టైగర్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి అంటూ ఒక బహిరంగ సభలో మంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చిన తరవాత వరుసగా రెండుసార్లు గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కు గుడివాడలో ఆత్మీయ అభినందన సభ జరిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సభలో నానిని సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖ, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కొడాలి నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాటిలేని నిరంత విజేత కొడాలి నాని అంటూ పేర్ని నాని కొనియాడారు. హరికృష్ణ అనుంగ శిష్యుడిగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దడంలో నాని పాత్ర ఎంతో ఉందన్నారు. తారక్ ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనుక నాని ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ సభలో ఆ పార్టీకి చెందిన మంత్రి ఎన్టీఆర్ ప్రస్తావనను తీసుకురావడం టీడీపీ శ్రేణులకు నచ్చడంలేదు. పార్టీ సభలో అధినేత జగన్‌ను పొగుడుకోవడం మాని హరికృష్ణ, ఎన్టీఆర్‌లను లాగడం ఏంటని మండిపడుతున్నారు. వాస్తవానికి కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తారక్‌ను చిన్నప్పటి నుంచి నాని ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ‘సెలవు రోజుల్లో నాని అన్న నన్ను గుడివాడ తీసుకెళ్లేవాడు. అక్కడే సెలవులు గడిపేవాడిని’ అని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. తారక్‌తో ‘సాంబ’ సినిమాను కూడా నాని నిర్మించారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసుకున్నంత మాత్రాన, ఒక సినిమా నిర్మించినంత మాత్రాన ఎన్టీఆర్‌ను నటుడిగా తీర్చిదిద్దింది నానినే అని మంత్రి నాని అనడం ఎంత వరకు సమంజసం!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YdM5Jv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...