Thursday 27 June 2019

తన ప్రాణం ఇకలేదని కృష్ణ కన్నీరుమున్నీరు

సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడికెళ్లినా పక్కన ఉండాల్సిందే. 50 ఏళ్లుగా వీరి ప్రయాణం కలిసే సాగింది. ఏనాడూ ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు నటశేఖరుడిని ఒంటరిని చేసి విజయనిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన ప్రాణం అయిన విజయ తనను వదిలిపెట్టి వెళ్లిపోవడాన్ని కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనిర్మల పార్థివదేహం వద్ద కూర్చొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కృష్ణను అలా చూసి కుటుంబసభ్యులు, సినీ పరిశ్రమకు చెందినవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కృష్ణ గారిని అలా చూడలేకపోతున్నాం అంటున్నారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రవేసిన విజయనిర్మల గురువారం (జూన్ 27) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్ గూడలోని నివాసానికి తీసుకొచ్చారు. కృష్ణ, విజయనిర్మల చాలా ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఈ ఇంట్లో విజయనిర్మల పార్థివదేహాన్ని ఉంచారు. విజయనిర్మల పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కృష్ణను ఓదారుస్తు్న్నారు. మహేష్‌బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్.. కృష్ణ పక్కనే కూర్చొని ఆయనకు ధైర్యం చెబుతున్నారు. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు. కె.రాఘవేంద్రరావు, మురళీ మోహన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధ, కోటి, కైకాల సత్యనారాయణ, రావు రమేష్, వంశీ పైడిపల్లి, మంచు లక్ష్మి తదితర సినీ ప్రముఖులు విజయనిర్మల పార్థివదేహానికి నివాళులర్పించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xcV0iA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...