Saturday 12 March 2022

అక్కడ మాత్రం‘భీమ్లా నాయక్’ను దాట లేకపోయిన ‘రాధే శ్యామ్’

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్న ప్ర‌భాస్ త‌ర్వాత సాహో సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఆ సినిమా మ‌న ద‌క్షిణాదిన ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేదు. కానీ.. ఉత్త‌రాదిన వంద కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ తర్వాత ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ వ‌స్తున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌భాస్ హీరోగా మ‌న ముందుకు వ‌చ్చిన తాజా పాన్ ఇండియా మూవీ ‘’. పీరియాడిక్ ల‌వ్‌స్టోరిగా వ‌చ్చిన ఈ సినిమాకు తొలి రోజున మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అందుకు కార‌ణం.. ప్ర‌భాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ప‌క్కా ల‌వ్ స్టోరితో సినిమా చేయ‌డ‌మే. అయితే వ‌సూళ్ల పరంగా ‘రాధే శ్యామ్’ దేశ వ్యాప్తంగా చ‌క్క‌గానే రాబ‌ట్టుకుంది. పాన్ ఇండియాలో ఈ సినిమాకు రూ.48 కోట్లు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ‘రాధే శ్యామ్’కు తొలి రోజున బాగానే ఉంది. అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా.. రెండు సినిమాల‌ను దాట‌లేక‌పోయింద‌నేది ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ‘రాధే శ్యామ్’కు నైజాంలో తొలి రోజున షేర్ క‌లెక్ష‌న్స్‌గా రూ.10.45 కోట్లు వ‌చ్చాయి. అయితే తొలి రోజున నైజాంలో షేర్ కలెక్ష‌న్స్ ప‌రంగా భీమ్లా నాయ‌క్‌, పుష్ప చిత్రాల‌ను ఈ సినిమా క్రాస్ చేయ‌లేక‌పోయింది. అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన పుష్ప ది రైజ్ చిత్రానికి నైజాంలో తొలి రోజున రూ.11.44 కోట్లు వ‌చ్చాయి. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసిన భీమ్లా నాయ‌క్ చిత్రానికి తొలి రోజు నైజాంలో రూ.11.85 కోట్లు వ‌చ్చాయి. మూడు వంద‌ల కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిన ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ సెట్స్ వేశారు. ఇట‌లీ, రోమ్‌, జార్జియా వంటి దేశాల్లో సినిమాను చిత్రీక‌రించారు. మ‌నోజ్ ప‌ర‌మ హంస సినిమాటోగ్ర‌ఫీ, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ వేసిన భారీ సెట్స్ ఇవ‌న్నీ సినిమాకు భార‌త‌నాన్ని తెచ్చి పెట్టాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Nitk5zr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...