Friday 11 March 2022

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కోసం సల్మాన్ షెడ్యూల్ ఎప్పటినుంచంటే?

సెట్స్ మీద మూడు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్ . అలా షూటింగ్ జ‌రుపుకుంటున్న మెగాస్టార్ చిత్రాల్లో గాడ్ ఫాద‌ర్ ఒక‌టి. మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్‌కి ఇది రీమేక్ అనే సంగ‌తి తెలిసిందే. మోహ‌న రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఓ సంద‌ర్భంలో తెలియ‌జేసిన సంగతి విదిత‌మే. గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ న‌టిస్తున్నారంటే సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాను బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారేమో రిలీజ్ స‌మ‌యంలో తెలియ‌నుంది. అయితే డేట్స్ కోసం గాడ్ ఫాద‌ర్ టీమ్ అంతా వెయిట్ చేసింది. స‌ల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం వారం నుంచి ప‌ది రోజుల లోపు డేట్స్ కేటాయించార‌ని స‌మాచారం. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ మ‌ధ్య చిత్రీక‌రించ‌బోతున్న ఈ స‌న్నివేశాల‌ను ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఈ షెడ్యూల్ మార్చి 12 నుంచి అంటే రేప‌టి నుంచి ప్రారంభం అవుతుంద‌ని టాక్‌. ఓ పాట‌, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిరంజీవి, స‌ల్మాన్‌పై చిత్రీక‌రించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. చిరంజీవికి, స‌ల్మాన్ ఖాన్‌ల మ‌ధ్య మంచి స్నేహ బంధం ఉంది. దాంతో ఆయ‌న్ని స‌ల్మాన్ త‌న ఫామ్‌హౌస్‌లోనే ఉంచి అతిథి మ‌ర్యాద‌లు చేస్తున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న న్యూస్‌. ఇప్ప‌టికే చిరంజీవిటైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్ 29న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇవి కాకుండా మెహ‌ర్ ర‌మేష్ దర్శ‌క‌త్వంలో చేస్తున్న భోళా శంక‌ర్‌, డైరెక్ట‌ర్ బాబి తెర‌కెక్కిస్తోన్న మ‌రో చిత్రం సెట్స్‌పై ఉన్నాయి. మ‌రో వైపు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికే చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/JeNZFAt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...