Saturday 12 March 2022

పరుచూరి వెంకటేశ్వర రావు ఇలా మారిపోయారేంటి? ఇంతకీ ఆయనకేమైంది?

పరుచూరి బ్రదర్స్‌ అంటే తెలియని ప్రేక్షకుడే ఉండడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వారిది తిరుగులేని ప్రస్థానం. మాటల రచయితలుగా పరుచూరి గోపాల కృష్ణ, ఎంతో కీర్తి గడించారు. ఆ రోజుల్లో కూడా తెర వెనుక ఉంటూనే కేవలం డైలాగ్స్ రాస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించి వెండితెరపై టాలెంట్ నిరూపించుకున్నారు. కళామతల్లి ముద్దు బిడ్డలుగా ఈ అన్నదమ్ములది టాలీవుడ్‌లో గొప్ప స్థానం. ఈ ఇద్దరు సోదరుల్లో పరుచూరి గోపాలకృష్ణ అయితే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పరుచూరి పలుకులు అంటూ ప్రతీ వారం ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటారు. కానీ ఆయన అన్నయ్య అయిన పరుచూరి వెంకటేశ్వర రావు మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఫొటో ఒకటి బయటకు రావడంతో అది చూసి ప్రేక్షకలోకం షాకైపోయింది. పరుచూరి వెంకటేశ్వర రావు ఇలా అయిపోయారేంటి? అసలు ఆయనకు ఏమైంది అని ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు రీసెంట్‌గా పరుచూరి వెంకటేశ్వర రావుని కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయనతో దిగిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు జయంత్‌ సి పరాన్జీ. ''గురూజీ పరుచూరి వెంకటేశ్వర రావుని కలిసినందుకు చాలో సంతోషంగా ఉంది. ఆయన వృద్ధాప్య స్థితిని చూసి బాధేసింది కానీ ఆయన మేధస్సు ఇంకా షార్ప్ గానే ఉంది'' అని జయంత్‌ పేర్కొన్నారు. కాగా, ఈ ఫొటోల్లో పరుచూరి వెంకటేశ్వర రావు అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో అంతా షాకయ్యారు. ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఆయన బక్కచిక్కి వృద్ధాప్యం మీద పడినట్లుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడు తరాల హీరోలతో పనిచేసిన అనుభవం పరుచూరి బ్రదర్స్ సొంతం. కొన్ని వందల సూపర్ హిట్ సినిమాలకు మాటలు రాసిన ఈ సోదరులు.. ఇటీవల 'సైరా' చిత్రంతో మరోసారి తమ మార్క్ చూపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Zahe7V2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...