Sunday 13 March 2022

భీమ్లా నాయక్ 16 డేస్ కలెక్షన్స్.. అనూహ్యంగా యూ టర్న్! బ్రేక్ ఈవెన్‌కి ఇంకెంత దూరం?

ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' రాకతో థియేటర్స్ కళకళలాడాయి. అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడంతో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఫస్ట్ వీక్ యమ దూకుడు ప్రదర్శించాడు . కలెక్షన్స్ పరంగా ఆ జోరు చూసి అతి త్వరలో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తాడని అంతా భావించారు. కానీ రెండో వారానికి వచ్చే సరికి భీమ్లా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. సెకండ్ వీక్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇక మూడో వారం కూడా అదే పరిస్థితులు కనిపిస్తుండటంతో భీమ్లా బ్రేక్ ఈవెన్‌ కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గత మూడు నాలుగు రోజులుగా భీమ్లా నాయక్ కలెక్షన్స్‌లో హ్యూజ్ డ్రాప్ కనిపిస్తోంది. ఓ వైపు రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ రంగంలోకి దూకడం మరింత ఎఫెక్ట్ అయింది. అయితే నిన్నటితో 16 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏ మేర వసూళ్లు రాబట్టింది? ఏయే ఏరియాలో ఎంతెంత వసూలైంది? అనే దానిపై ఓ లుక్కేద్దాం. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. రిలీజ్‌కి ముందు భారీ బజ్ నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 106.75 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో 108 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా ఈ 16 రోజుల్లో 96 కోట్ల మేర రాబట్టాడు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజుతో పోల్చితే 16వ రోజుకు వసూళ్లు పుంజుకోవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా 16 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ నైజాం: 34.76 కోట్లు, సీడెడ్‌: 11.06 కోట్లు ఉత్తరాంధ్ర: 7.57 కోట్లు ఈస్ట్‌ గోదావరి: 5.48 కోట్లు వెస్ట్‌ గోదావరి: 4.99 కోట్లు గుంటూరు: 5.20 కోట్లు కృష్ణా: 3.78 కోట్లు నెల్లూరు: 2.54 కోట్లు మొత్తంగా AP- TG కలిపి 75.35 కోట్ల షేర్ 115.25 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కర్ణాటక, ఓవర్‌సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే మొత్తంగా 96.07 కోట్ల షేర్, 156.41 గ్రాస్ వసూలైంది. సో.. మరో 11.93 కోట్ల షేర్ వసూలు చేస్తే గానీ భీమ్లా నాయక్ క్లీన్ హిట్ అని చెప్పలేం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/bNYOBLn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...