Sunday 13 March 2022

ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. అందుకు కార‌ణం.. మూవీ. బాహుబ‌లితో తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న చిత్రం. దీంతో పాటు టాలీవుడ్‌లో అగ్ర హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించడంతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు న‌టించారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో సినిమా రిలీజ్ అవుతుంది. RRR సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర అవుతుండ‌టంతో క్రేజ్ హ‌ద్దులు దాటేస్తుంది. మ‌న దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. సినిమాను బీభ‌త్సంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఒక వైపు మెగాభిమానులు, మ‌రో వైపు నంద‌మూరి అభిమానులు సోష‌ల్ మీడియాతో పాటు ప‌లు చోట్ల హంగామా చేస్తున్నారు. తార‌క్ అభిమానులు త‌మ అభిమాన హీరో సినిమాను అంద‌రికీ తెలిసేలా చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. కార్ల‌తో ఎన్‌.టి.ఆర్ అని డిజైన్ చేయ‌డం, ఆర్ఆర్ఆర్ అని డిజైన్ చేయ‌డం ఇప్ప‌టికే మ‌నం చూశాం. ఇక కొంద‌రు వీరాభిమానులు అయితే మ‌రో అడుగు ముందుకేశారు. అమెరికాకు చెందిన యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ ఓ విమానంకు ‘తొక్కుకుంటూ పోవాలే.. జై ’ అనే బ్యానర్‌ను క‌ట్టి ప్ర‌దర్శింప చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. RRR సినిమాకు సంబంధించిన ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావ‌డం.. టికెట్స్ అన్నీ హాటు కేకుల్లా అమ్ముడ‌వ‌డం జ‌రిగిపోయాయి. ఓవ‌ర్ సీస్‌లో అయితే RRR ప్రీమియ‌ర్స్‌కే వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్లుగా రావ‌డం చూస్తే సినిమాపై ఉన్న అంచ‌నాలు మామూలుగా లేదని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇది 1920 నేప‌థ్యంలో జ‌రిగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xkW9mOh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...