Sunday 13 March 2022

నయనతార సీక్రెట్ మ్యారేజ్.. బయటికు చెప్పకుండా దాచేస్తున్నారా?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉండటం చూస్తూనే ఉన్నాం. లవ్ చేయడం, ఇష్టమైన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకు తిరగడంలో ఏ మాత్రం మొహమాట పడదు నయన్. అయితే గత కొంతకాలంగా తన ప్రియుడు విగ్నేష్ శివన్‌తో తెగ షికార్లు కొడుతున్న నయనతార ఇప్పుడు అతన్నే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని తెలుస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నయనతార- లవ్ ఎఫైర్ మొదట సీక్రెట్‌గా నడిచింది. ‘నానూ రౌడీదాన్‌’ మూవీ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట చాలాకాలం పాటు రహస్యంగా తమ రిలేషన్ మెయిన్‌టైన్ చేసి ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో నయనతార- విగ్నేష్ జోడీ ఎక్కడికి వెళ్లినా అదో పెద్ద న్యూస్ కావడం, అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడం జరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు లాక్‌డౌన్‌లో సీక్రెట్‌ నిశ్చితార్థం చేసుకోవడంతో అందరి దృష్టి నయన్ పెళ్లి పైనే పడింది. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఘనంగా ఇరు కుటుంబాల సమక్షంలో నయనతార పెళ్లి జరగుతుందని అంతా భావించారు. కానీ అందుకు ముహూర్తం కుదరలేదు. ఇంతలో నయన్- విగ్నేష్ జంటగా దేశంలోని దేవస్థానాలన్నీ చుట్టివస్తుండటం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. నిశ్చితార్థం లాగే వీళ్ళిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారా అనే డౌట్స్ కొందరిలో తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో ఆ అనుమానాలను రెట్టింపు చేసింది. ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మవారి ఆలయానికి వెళ్లారు నయన్- విగ్నేష్. అయితే ఆ ఆలయంలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించడంతో వీళ్లిద్దరి సీక్రెట్ మ్యారేజ్ టాపిక్ తెరపైకి వచ్చింది. నయనతార- విగ్నేష్ జోడీని అలా చూసిన నెటిజన్లు సదరు వీడియోను వైరల్ చేస్తూ వీరి పెళ్లి జరిగిపోయింది కానీ బయటికి మాత్రం చెప్పడం లేదంటూ కామెంట్లు పెడుతున్నాయి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ కావడమే గాక మరోసారి నయన్ పెళ్లి ఇష్యూని చర్చనీయాంశంగా మార్చింది. సో.. చూడాలి మరి ఇలాంటి వార్తలపై ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/t4Fz7DA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...