Tuesday, 19 October 2021

Prabhas వదిలిన రొమాంటిక్ ట్రైలర్.. ప్రేమ కాదు మోహం.. ఆ సన్నివేశాల్లో రెచ్చిపోయిన కేతిక శర్మ

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా రూపొందిన కొత్త సినిమా 'రొమాంటిక్'. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అక్టోబరు 29న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా 'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రభాస్. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల ఘాటు సన్నివేశాలను ఫోకస్ చేస్తూ రమ్యకృష్ణ పాత్రను హైలైట్ చేసి చూపించారు. ఈ ట్రైలర్‌లో వినిపిస్తున్న డైలాగ్స్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలాన్ని పెంచేస్తున్నాయి. ఇక ఆకాష్ పూరి నటన పరిణితి చెందినట్లు కనిపిస్తుండగా.. తొలి సినిమాతోనే కేతిక యువత గుండెల్లో గూడు కట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్ సినిమా వైపు అందరి దృష్టిని లాగేయగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ హైప్ పెంచేసింది. చూస్తుంటే ఈ సినిమాతో ఆకాష్ పూరి కెరీర్ టర్న్ కావడం పక్కా అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aT1ln3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...