Tuesday, 19 October 2021

ఆ క్షణాలు మరువలేను.. మన బంధం అప్పుడే బయటపెడదాం! ఓపెన్ అయిన పూజా హెగ్డే

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరుమీదుంది యంగ్ హీరోయిన్ . ఇటీవలే ఆమె హీరోయిన్‌గా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండగా.. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీ పనులను చకచకా పూర్తి చేస్తోంది పూజా. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించిన ఆమె, పలు ప్రశ్నలపై క్రేజీగా రియాక్ట్ అయింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ నుంచి పూజా హెగ్డేకి ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురుకాగా.. దానిపై అంతకంటే ఆశ్ఛర్యపోయేలా స్పందించి అతడికి దిమ్మ తిరిగే రియాక్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘మన బంధం గురించి ఎప్పుడు బయట పెడదాం’ అని నెటిజన్ అడగడంతో దానికి ‘రక్షాబంధన్‌ రోజున’ అంటూ చురక లాంటి సమాధానం చెప్పింది పూజా హెగ్డే. ఈ విషయంలో ఆమె తెలివి, చాకచక్యం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ‘ఆచార్య’ సినిమా గురించి మాట్లాడిన పూజా.. ఈ మూవీ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలిపింది. కాకపోతే ఇది తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా అని, నీలాంబరి సాంగ్‌ తనకెంతో ప్రత్యేకం అని చెప్పింది. అదొక విజువల్‌ వండర్‌ అని తెలిపిన ఆమె.. ఆ పాట చిత్రీకరణలో గడిపిన క్షణాలను మరచిపోలేనని పేర్కొంది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా చూసి చిరంజీవి గారు తనను అభినందిస్తూ ఓ మెసేజ్‌ పంపారని, అది తనలో మరింత కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తి నింపిందని చెప్పింది. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయాలన్న తన చిరకాల కోరికను బయటపెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z0GmfF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...