Tuesday, 19 October 2021

అదృష్టం అంటే సమంతదే.. విడాకుల తర్వాత కోట్ల రూపాయల డీల్! ఆ ఫిగర్‌కి సామ్ ఓకే..

నాగ చైతన్య- విడాకుల ఇష్యూ ఎప్పుడు మొదలైందో అప్పటినుంచి సమంతకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రతి రోజు ఆమె ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. అక్టోబర్ 2న తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించాక తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా కెరీర్‌ పరంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకోవడంపై ఎవరెన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఇకపై తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టాలని బలంగా ఫిక్స్ అయిందట సామ్. ఈ మేరకు టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతోందట. ఇప్పటికే గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' మూవీ ఫినిష్ చేసిన సమంత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల డీల్స్ సెట్ చేసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా చేస్తున్న సామ్.. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా మరో క్రేజీ ఆఫర్ సమంతకు దక్కిందని తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్‌- అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాలో సమంతను ఫైనల్ చేశారట. ముందుగా ఈ సినిమా కోసం నయనతార పేరును పరిశీలించిన నిర్మాతలు చివరకు సమంతకు ఓటేశారట. ఇప్పటికే సమంతతో భారీ డీల్ సెట్ చేసుకున్నారని, సమంతకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా దాదాపు 7 కోట్లు పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఇందులో నిజమెంత అనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jgqnkK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...