Monday, 23 August 2021

WWW : శివానీ రాజశేఖర్ మూవీ అప్డేట్.. ఆసక్తి రేపుతున్న చిత్రయూనిట్

హీరో రాజశేఖర్ కూతుళ్లిద్దరూ కూడా సినీ పరిశ్రమలోకి వచ్చేశారు. అయితే పెద్ద కూతురు శివానీ రాజశేఖర్‌ ఇంకా తన మొదటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. శివాత్మిక అయితే దొరసానితో ఆకట్టుకున్నారు. ఇక శివానీ మాత్రం తన డెబ్యూ కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఆమె ప్రస్తుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే వదిలిన పాటలు యూట్యూబ్‌లో మార్మోగిపోతోన్నాయి. ఇందులో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా ఉంది. ఇది వరకే వదిలిన పోస్టర్లు, పాటలతో అది తెలుస్తోంది. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. WWW టీజర్ ఇప్పటికే వైరల్ అయింది. ఇక రేపు (ఆగస్ట్ 24) ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోందని చిత్రయూనిట్ పేర్కొంది. రేపు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. అయితే ఈ మూవీ విడుదలకు సంబంధించిన తేదినో, లేదా ట్రైలర్ విడుదల చేయనున్నారనో తెలుస్తోంది. మొత్తానికి బిగ్ స్క్రీన్ మీద రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నట్టున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kj0tN2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...