Monday, 23 August 2021

Rakul Preet Singh : ఇద్దరం దాని కోసం ఫ్లైట్‌లో వెళ్లి వస్తాం.. రకుల్‌పై మంచు లక్ష్మీ కామెంట్స్

మంచు లక్ష్మీ మధ్య ఉన్న స్నేహ బంధం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం మీద ఎన్నో రకాల పుకార్లు వస్తుంటాయి. వాటిపై రకుల్ స్పందిస్తూ.. ట్రోలర్ల మీద కౌంటర్లు వేశారు. అయితే రకుల్, మంచు లక్ష్మీలు ఒక చోటకు చేరారు అంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఈ ఇద్దరూ కూడా భోజన ప్రియులేనన్న సంగతి తెలిసిందే. కానీ రకుల్ ఏది పడితే అది తిన్నదు. దానికంటూ ఓ లెక్క ఉండాల్సిందే. రకరకాల రుచులను టేస్ట్ చేయడమంటే ఈ ఇద్దరికీ ఇష్టమే. కానీ రకుల్ మాత్ర తన డైట్‌కు తగ్గట్టే తింటుంటారు. మాత్రం తనకు నచ్చిన ప్రతీది తింటుంటారు. దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తుంటారట. అందుకే ఇప్పుడు మంచు లక్ష్మీ సెలెబ్రిటీలకు ఇష్టమైన ఆహార పదార్థాలను తెలుసుకుంటూ,వారితో వంటలు వండించేందుకు ఆహా భోజనంబు అంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, తరుణ్ భాస్కర్, ఆలీ వచ్చారు. ఐదో ఎపిసోడ్‌లో పుష్పక విమానం హీరో హీరోయిన్లు వచ్చారు. ఆనంద్ దేవరకొండ, షాన్వీలు మంచు లక్ష్మీతో రచ్చ చేశారు. ఈ ఎపిసోడ్‌లో రకుల్ గురించి ప్రస్థావన వచ్చింది. ఆనంద్ దేవరకొండకు తినడం ఇష్టమేనట కానీ వంట వండటం రాదని చెప్పుకొచ్చారు. రకరకాల ఫుడ్‌ తినడం ఇష్టమని ఆనంద్ చెప్పుకొచ్చాడు. తనకు కూడా ఇష్టమని మంచు లక్ష్మీ చెబుతూ అసలు సీక్రెట్ బయటపెట్టేశారు. తమకు ఇండియాలోని బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని సర్చ్ చేయడం.. అక్కడికి ఫ్లైట్‌లోకి వెళ్లి తిని రావడం అలవాటు అని, రకుల్‌తో కలిసి అలా మధ్యాహ్నం వెళ్లి రాత్రి వరకు తిరిగి వస్తామని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sDbxbz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...