Monday, 23 August 2021

అందరికీ మందు పోస్తారట.. ‘మధుర వైన్స్’ లాంటి ప్రమోషన్స్ గతం ఎన్నడూ చూసి ఉండము!

తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే విధానం కానీ, సినిమాలు చూసే విధానం కానీ మారి చాలాకాలం అయింది. ఒకప్పుడు రొటీన్‌గా ఉండే సినిమాలను మాత్రమే హిట్ చేసే జనాలు గత కొంతకాలంగా మాత్రం సినిమాల కథలో విలక్షణత.. మంచి స్క్రీన్‌ప్లే ఉంటే దాన్ని కచ్చితంగా హిట్ చేస్తున్నారు. అలా చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యి.. మంచి హిట్లుగా నిలిచాయి. అయితే సినిమాలు తీయడంలోనే కాదు వాటిని ప్రమోషన్స్ చేయడంలోనే రూటు మార్చారు చిత్ర నిర్వాహకులు. తమ సినిమాపై తామే వివాదాలు సృష్టించి సినిమాని ప్రమోట్ చేసేవాళ్లు కొందరు అయితే.. విభిన్నంగా వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూ.. సినిమాలను ప్రమోట్ చేసే వాళ్లు మరికొందరు. అయితే లేటెస్ట్‌గా వస్తున్న ‘’ సినిమా మాత్రం ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. మంగళవారం సాయంత్రం ప్రతీ ఒక్కరికి ఈ సినిమా యూనిట్ ఓ 30 ఎంఎల్ పెగ్ అందిస్తుందట. అవునండీ.. మీరు చదివింది అక్షరాల నిజమే. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. 30 ఎంఎల్ పెగ్ అంటే మందు కాదు అండీ.. ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని విడుదల చేస్తారట. కస్టమర్లు అందరు ఈ 30 ఎంఎల్ పెగ్‌ను ఆస్వాదించి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ చిత్ర యూనిట్ కోరింది. ఈ విషయాన్ని రొటీన్‌గా కాకుండా తమ సినిమా స్టైల్‌లో ప్రకటన చేసింది చిత్ర యూనిట్. ‘ఆర్.కె.సినీ టాకీస్’ మరియు‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ సంస్థల పై రాజేష్ కోదెపు, కార్తీక్ శభరీష్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో , హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తొలి సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mm4eUx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...