Tuesday, 24 August 2021

Gopichand: గైస్ గెట్ రెడీ.. 'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు మ్యాచో స్టార్ గోపీచంద్. నచ్చిన కథకు ఓకే చెప్పేసి రంగంలోకి దూకుతున్న ఆయన.. ఇప్పుడు ‘సీటీమార్‌’ సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. కబడ్డీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో జోడీగా మిల్కీ బ్యూటీ నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ''గైస్ గెట్ రెడీ.. '' రిలీజ్ డేట్ ఇదే'' అంటూ సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఏప్రిల్‌ 2న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. క్రమంగా పరిస్థితులు చక్కబడి థియేటర్స్ ఓపెన్ కావడంతో ఎట్ట‌కేల‌కు ఈ సినిమా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేశారు. గోపీచంద్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా ఉండాలని ఈ మూవీపై చిత్రయూనిట్ మొత్తం స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తుండటం సినిమాపై హైప్ పెంచేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ 'సీటీమార్' మూవీ రూపొందించారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. దిగంగ‌న సూర్య‌వన్షీ, భూమిక‌, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 'కబడ్డీ, మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అంటూ గతంలో ఈ మూవీ టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు గోపీచంద్. 'గౌత‌మ్ నంద' సినిమా త‌ర్వాత గోపీచంద్‌, సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3guL9f3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...