Tuesday, 24 August 2021

గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు ఫ‌స్ట్ లుక్.. అట్రాక్ట్ చేస్తున్న డిఫరెంట్ పోస్టర్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ కంటెంట్ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. అది గమనించిన దర్శకనిర్మాతలు వారి బాటలోనే విలక్షణ కథలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అదే ఫార్మాట్‌లో రాబోతున్న కొత్త సినిమా ''. హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేప్పట్టిన చిత్రయూనిట్ తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే.. సీరియ‌స్‌గా చూస్తున్న ప‌హిల్వాన్స్‌, వారి మ‌ధ్య‌లో కూల్‌ అండ్ స్టైల్‌గా కొబ్బ‌రి బొండం తాగుతూ కూర్చున్న‌హీరో ల‌క్ష్ కనిపిస్తున్నారు. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ఈ డిఫరెంట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే హీరో ల‌క్ష్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది స్పష్టమవుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయి కార్తీక్ బాణీలు కడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసి ఈ మూవీని రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gsMSkY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...