Tuesday, 24 August 2021

అల్లు అర్జున్‌కి ఆ లోపం.. ఇది తెలిస్తే అభిమానులు నిజంగా షాక్ అవ్వాల్సిందే..

‘’.. ఈ సినిమా గురించి అభిమానులు ఎంత అతృతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. , కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊహించినదాని కంటే ఎక్కువగా ఈ సినిమా టీజర్‌కు అద్భుమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూవ్స్, లైక్స్ సాధించింది ఈ సినిమా టీజర్. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. సుకుమార్ తన సినిమాలో హీరోని ఏదో ఒక ప్రత్యేకతతో చూపిస్తారు. అలానే ఆయన సినిమాలు మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కి కూడా ఓ ప్రత్యేకత ఉంటుందట. అయితే అది ప్రత్యేకత కాదు.. లోపం అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లర్‌లా కనిపించే అల్లు అర్జున్‌ కుడి భుజం పని చేయని వాడిగా కనిపించనున్నారట. అందుకే రీసెంట్‌గా విడుదల అయిన ‘దాక్కో దాక్కో మేక’ పాటలో కూడా ఆయన ఎడమ భుజంతో స్టెప్ వేశారు. అందుకే ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక జబర్ధస్త్ బ్యూటీ అనసూయ, కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sFBPdf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...