Monday, 19 July 2021

RC15 : అప్పటి నుంచి చూస్తున్నా అదే ఎనర్జీ.. శంకర్‌పై తమన్ ట్వీట్

రామ్ చరణ్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. రోజుకో అప్డేట్‌తో ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు, శంకర్ ప్రాజెక్ట్ ‌పై అంచనాలు పెంచేశాయి. మామూలుగా శంకర్ సినిమాలు అంటే సంగీతం ప్రధాన పాత్రను పోషిస్తుంటారు. శంకర్ ఎక్కువగా ఏ ఆర్ రెహమాన్‌తో పని చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ వరుస మారింది. ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాయ్స్ సినిమాలో ఓ పాత్రలో నటించిన తమన్ ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో తమన్ ఎమోషనల్ అయ్యారు. 2000 నుంచి శంకర్ సర్ ఎలా ఆలోచిస్తారు.. ఎంత లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తారో గమనిస్తున్నాను. అయితే ఇప్పటికీ కూడా శంకర్ సార్ చుట్టూ అదే ఎనర్జీ, అదే ఆరా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాయక్, బ్రూస్‌లీ చిత్రాలత తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రేమకు కురిపించే చాన్స్ మళ్లీ వచ్చింది. ఆయనెంతో గొప్ప మనిషి. ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు. నా నుంచి బెస్ట్ వర్క్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇక దిల్ రాజు గారు అయితే ఎప్పుడూ కూడా నన్ను, నా మ్యూజిక్‌ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌ను మ్యూజికల్‌గా ఎప్పుడూ గుర్తుండిపోయేట్టు చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక మొన్ననే ఈ ప్రాజెక్ట్‌లో తాను కూడా భాగస్వామిని అయినట్టు జానీ మాస్టర్ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wJpUeQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...