Monday, 19 July 2021

హీరో రామ్‌పై నిధి అగర్వాల్ స్పెషల్ ఇంట్రెస్ట్.. ఆ కిక్కే వేరు!! దానికి రెడీ అంటూ ఓపెన్

ట్రెండ్ మారింది.. తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి తెలిసింది. దీంతో పలు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దర్శకనిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. అయితే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే భారీ హిట్ సాధిస్తుందని జోస్యం చెబుతోంది యంగ్ హీరోయిన్ . అంతేకాదు ఈ రీమేక్‌లో తనకే అవకాశం దక్కాలని అంటూ చాలా విషయాలపై ఓపెన్ అయింది నిధి. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రిలీజై రెండేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిధి అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే చూడాలని ఉందని చెప్పిన ఆమె.. ఇందులో కూడా హీరో రామ్ నటిస్తే హిట్ కావడం పక్కా అని చెప్పింది. ఆ మాస్ రోల్ కోసం రామ్ తప్ప మరెవ్వరూ సెట్ కారని ఆమె చెప్పడం విశేషం. అలాగే ఇస్మార్ట్ శంకర్ మూవీని హిందీలో రీమేక్ చేస్తే ఆ కిక్కే వేరని ఆమె చెప్పుకొచ్చింది. అవకాశం రావాలే గానీ తాను కూడా ఇందులో నటించేందుకు రెడీగా ఉన్నానని చెప్పింది. ఇస్మార్ట్ శంకర్‌ సినిమా తన కెరీర్‌లో చాలా చాలా ప్రత్యేకం అని చెప్పిన నిధి అగర్వాల్.. ఈ సినిమాతో ఎన్నో అనుభూతులు ఉన్నాయని పేర్కొంటూ ఎన్నో ఎమోషన్స్ కూడా ముడిపడి ఉన్నాయని తెలిపింది. తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో పనిచేయడం చాలా హ్యపీగా ఉందని చెప్పింది. పూరితో వర్క్ చేయడం చాలా సులభం అని చెప్పిన ఆమె, మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఆ దర్శకుడిని ఎప్పటికీ మరవబోనని తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో పాటు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న 'హీరో' సినిమాలో ఆమె భాగమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zcA2hP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...