Monday 31 May 2021

చావుబతుకుల్లో కొరియోగ్రాఫర్ తండ్రి.. అర్థరాత్రి పూట ఆదుకున్న మెగాస్టార్ అల్లుడు, తీవ్ర భావోద్వేగం

కరోనా నేపథ్యంలో మెగాస్టార్ స్టార్ చిరంజీని తనకు చేతనైన సాయం చేస్తున్నప్పటికీ కొంతమంది పనికట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నటుడు సోనుసూద్‌తో పోల్చుతూ మెగాస్టార్‌ని తక్కువ చేస్తూ మాట్లాడటంపై ఫైర్ అయ్యారు మెగా అభిమాని, కొరియోగ్రాఫర్ . సీసీఎస్ ద్వారా వందలాదిమంది సినీ కార్మికులను ఆదుకుని ఇప్పుడు సొంతంగా కోట్లు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే.. ఆయన సేవల్ని గుర్తించాల్సింది పోయి విమర్శిస్తారా? అంటూ ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మెగాస్టార్ మాత్రమే ఎందుకు సాయం చేయాలి..? ఆయనా మనలాంటి మనిషే కదా.. చిరంజీవిగారు ఇంట్లో చేపలు కూర వండుకుంటే మీకేంటి నష్టం.. ఆయన చేపల కూర తినకూడదా? పనీపాటా లేనివాళ్లే ఆయన్ని విమర్శిస్తారంటూ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు ఆట సందీప్. ఈ సందర్భంలో కేవలం గారు మాత్రమే కాదని.. ఆ ఫ్యామిలీ హీరోలంతా సాయం చేయడంలో ముందుంటారని తెలియజేస్తూ మెగాస్టార్ అల్లుడు తనకు చేసిన సాయాన్ని చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ కిమ్స్ హాస్పటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడు.. నేను చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్‌కి కాల్ చేశా. సార్.. నేను ప్రాబ్లమ్‌లో ఉన్నా.. ఏం చేయాలో తెలియడం లేదు.. అపోలో హాస్పటల్‌కి తీసుకువెళ్లాలని అనుకుంటున్నా హెల్ప్ చేస్తారా? అని అడిగితే.. నువ్ ఫోన్ పెట్టెయ్.. నేను మళ్లీ చేస్తానని వెంటనే ఫోన్ చేసి.. సందీప్ ఇంటికి అంబులెన్స్ వస్తుంది.. హాస్పటల్‌కి తీసుకుని వెళ్లు అని చెప్పి డాక్టర్స్ అందరితోనూ మాట్లాడించి తెల్లవారుజామున మూడు వరకూ ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి క్రిటికల్ కండిషన్‌లో హాస్పటల్ మార్చడం మంచిది కాదని.. అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని డాక్టర్ల ద్వారా తెలుసుకున్న కళ్యాణ్ దేవ్ నాకు ధైర్యం చెప్పారు. నీకు ఎలాంటి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఫోన్ చేయి సందీప్ అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. డబ్బు ఇవ్వడం కాదు... ఆపదని షేర్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. నాన్న ఇక బతకరనే విషయం డాక్టర్ల ద్వారా ముందే తెలుసుకున్న కళ్యాణ్ దేవ్.. ఆ విషయాన్ని నాతో చెప్పకుండా నా భార్యకి చెప్పి మెంటల్‌గా మమ్మల్ని ప్రిపేర్ చేశారు. నిజంగా ఆయన అంత చేయాల్సిన అవసరం లేదు. అయినా చేశారు. నేను ఆయన సినిమాకి ఒక పాట చేసి.. దానికి ఆయన డబ్బులు ఇచ్చారు. అయిపోయింది కదా అని వదిలేయలేదు.. ఆపదలో ఉన్నానని అర్థరాత్రి పూట ఆదుకున్నారు. నాకే కాదు.. జానీ మాస్టర్ వైఫ్‌కి సీరియస్ అయినప్పుడు ట్రీట్ మెంట్ మొత్తం రామ్ చరణ్ గారే చేయించారని జానీ మాస్టర్ చెప్పారు. ఇవన్నీ కెమెరా ముందు చెప్పి చేయలేదు కదా.. వాళ్లకి ప్రచారం అవసరం లేదు.. పని కావాలి అంతే. మెగా ఫ్యామిలీ వల్ల సాయం పొందుకున్న వాళ్లు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు. చిరంజీవి గారి లాగే మిగతా హీరోలు కూడా వేరే వాళ్లకి చేసి ఉండొచ్చు. కానీ అందరికీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ఆట సందీప్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i4Y5Kd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...