Tuesday, 21 July 2020

అల్లు అర్జున్‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టాఫ్.. అంతా కలిసి 'అలా..'!

ఈ ఏడాది ఆరంభంలో విడుదలై నేటికీ జనం నోళ్ళలో నానుతూనే ఉంది '' సినిమా. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. థమన్ అందించిన బాణీలు దేశ సరిహద్దులు దాటి సంగీత ప్రియులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని ''బుట్టబొమ్మ, రాములో రాములా'' పాటలు భారీ వ్యూస్ రాబడుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఈ రోజు వరకూ ఈ పాటల హంగామానే నడుస్తోంది. ఇక బుట్ట‌బొమ్మ సాంగ్‌లో అల్లు అర్జున్- పూజా హెగ్డే వేసిన స్టెప్పులు మరచిపోలేక పోతున్నారు ప్రేక్షకులు. కాస్త సమయం దొరికినా ఈ పాట పెట్టుకొని డాన్స్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు కాలు కదపగా.. తాజాగా వైజాగ్‌కు చెందిన‌ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అంతా కలిసి బుట్టబొమ్మ పాటపై చిందులేశారు. Also Read: తాము డాన్స్ చేసిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌ ద్వారా బ‌న్నీకి ట్యాగ్ చేసి ఆయనను సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన అల్లు అర్జున్.. ఇలాంటి సంతోషాన్నిచ్చే ఆశ్చర్యం కలిగించినందుకు ఇండిగో సిబ్బందికి ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ పాటపై ఇండిగో సిబ్బంది ఆట చూసి ''వావ్! సూపర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికీ 'అల.. వైకుంఠపురములో' పాటలకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుండటం చూసి ఆనందంలో మునిగితేలుతోంది చిత్ర యూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OL7abj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...