Tuesday, 21 July 2020

టీనేజ్‌లో మెగా హీరోలు.. వైరల్‌గా మారిన ఫోటో

సినిమా హీరోలకు అభిమానులు మామూలుగా ఉండరు. తమ హీరోకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తారు. ఇక మెగాఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోలంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా హీరోలకు అభిమానుల ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తమ అభిమాన తారలకు సంబంధించిన అన్నిరకాల ఫోటోల్ని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. ఇక అరుదైన ఫోటోలు కనిపించాయంటే ఇక వారికి పండగే. తాజాగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన యంగ్ హీరోలందరికీ సంబంధించిన ఓ ఆసక్తికర ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఇంటి నుంచి వచ్చిన హీరోలుగా తమకంటూ ప్రత్యేకంగా పేరు ప్యాఖ్యతలు తెచ్చుకున్నారు. అయితే వారికి సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో వీరంతా టీనేజ్ లుక్‌లో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. Read More: ఈ ఫొటోలో బన్నీ , చరణ్, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మరియు నిహారిక కూడా ఉన్నారు. టీనేజ్ లో ఉన్న మెగా హీరోల లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం కూడా తెలిసిందే. మెగా హీరోలు వారి వారి ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్నాడు. బన్నీ..పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక వరుణ్.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ బాక్సింగ్ బేస్డ్ మూవీ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బుతో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. టీనేజ్ లుక్‌లో వీరంతా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39fFRz5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...