హీరో ఓ ఇంటివాడు కాబోతోన్న విషయం తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి షాలినీని నితిన్ వివాహం చేసుకుంటున్నారు. నితిన్, షాలినీల వివాహ వేడుకను ఈనెల 26న నిర్వహించనున్నట్టు ఇప్పటికే కుటుంబ సభ్యులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్-19 నిబంధనలను అనుసరించి చాలా తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నితిన్, వివాహాన్ని జరపనున్నారు. హైదరాబాద్‌లో వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉంటే, నితిన్-షాలిని నిశ్చితార్థ వేడుక తేదీని కూడా కుటుంబ సభ్యులు మంగళవారం ప్రకటించారు. జూలై 22న హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక జరుగుతుంది. నిశ్చితార్థం, వివాహ వేడుకలకు ఇటు నితిన్, అటు షాలిని కుటుంబాలు చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించారు. మరోవైపు, తన వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కూడా నితిన్ ఆహ్వానించారు. సోమవారం ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిసిన నితిన్.. తన పెళ్లి శుభలేఖను అందజేశారు. Also Read: కాగా, నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలిని. నితిన్, షాలినీలది ఎనిమిదేళ్ల పరిచయం. షాలిని 2012లో నితిన్ కలిశారట. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకన్న తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న నితిన్, షాలినిల పసుపు, కుంకుమ వేడుక జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వీరి వివాహం జరపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే కరోనా వైరస్ వల్ల వేదిక, తేదీ రెండూ మారిపోయాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fU4i84
v
No comments:
Post a Comment