Monday, 20 July 2020

సుశాంత్ జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ యంగ్ హీరో చేసుకున్న విషయం తెలిసిందే. గతనెల జూన్‌ 14న తన ఇంట్లో బలవన్మరణంకి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ మృతిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించారు. అతి త్వరలోనే సుశాంత్ మృతికి కారణం ఏంటనే విషయాన్ని కూడా తేలుస్తానని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సుశాంత్ జీవితంపై ఓ సినిమా కూడా తీస్తున్నారు. నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుశాంత్ జీవితంపై అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి రీసెంట్‌గా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాలీవుడ్‌లో నెలకొన్న పక్షపాతధోరణి, అపోహలను తొలగించేందుకు ఈ చిత్రం నిర్మిస్తున్నానని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15 నుండి ముంబై, పంజాబ్‌లలో 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. Read More: ఈ చిత్రంలో 10 మందికి సంబంధించిన కథలు ఉంటాయని, సుశాంత్ మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారి పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయన్నారు. మూడు గంటల పాటు ఉండనున్న ఈ సినిమాలో టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఎలా షైనింగ్ స్టార్ అయ్యాడు. అతని ప్రయాణం ఎలా సాగిందనే అంశాలని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించనున్నారు. సుశాంత్‌ది ఆత్మహత్య అని కొందరు అంటుంటే.. మరికొందరు అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వస్తుండటంతో దీనికోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సుశాంత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా ఈనెల 24న రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30q9ZnD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...