Monday, 20 July 2020

Rgv: పరాన్న జీవికి మెగా ఫ్యామిలీ సీక్రెట్ సపోర్ట్! వర్మకు దిమ్మతిరిగేలా పక్కా ప్లాన్!!

ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు సృష్టించే .. ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేశారు. 'పవర్ స్టార్' పేరుతో సినిమా ప్రకటించి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తన సినిమాకు ''ఎన్నికల తర్వాత కథ'' అనే ట్యాగ్ లైన్ పెట్టి అచ్చం పవన్ కళ్యాణ్, చిరంజీవిని రూపురేఖలతో ఉన్న నటులను ఎంపిక చేసుకొని సినిమా స్టార్ట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలోనే 'పవర్ స్టార్'కి పోటీగా 'పరాన్నజీవి' రంగంలోకి దిగింది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న చాలా మందిపై సెటైరికల్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకే సూటి పెట్టేసి 'పరాన్నజీవి' సినిమాను అనౌన్స్ చేశారు పవన్ ఫ్యాన్స్. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వంలో 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు టైటిల్ లుక్ రిలీజ్ చేసి అందులో RGV అనే అక్షరాలను ఫోకస్ చేయడంతో ఫిలిం నగర్ వర్గాల్లో ఈ మూవీ గురించిన చర్చలు ముదిరాయి. Also Read: ఈ క్రమంలోనే ఈ మూవీ నిర్మాత సీఎస్ అంటున్నారంటే.. చిరంజీవి - సురేఖలేనా, లేదా చరణ్ సుష్మితలా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే కోణంలో ఆలోచించిన మెగా ఫ్యామిలీ ఈ పరాన్న జీవికి సీక్రెట్‌గా సపోర్ట్ చేస్తున్నారనే వాదనలు సినీ వీధుల్లో వినిపిస్తున్నాయి. దీంతో మెగాస్టార్ ఫ్యామిలీనే దగ్గరుండి ఈ సినిమా చేయిస్తున్నారా? వీళ్లే రిలీజ్ ప్లాన్ చేశారా? అనే చర్చలు జనాల్లో బాగా ముదిరాయి. కాగా జులై 20వ తేది సాయంత్రం నుండి రిలీజ్ చేయబోయే సాంగ్ ద్వారా ఆర్జీవి సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది క్లారిటీ రానుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఏదిఏమైనా అచ్చం వర్మ స్ట్రాటజీనే ఫాలో అవుతూ అదును చూసి ఆ సంచలన దర్శకుడికే దిమ్మతిరిగే కౌంటర్ వేస్తూ 'పరాన్నజీవి' మూవీ ప్రకటన రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పవర్ స్టార్ Vs పరాన్నజీవి వార్ మొదలైంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో ఎవరెవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39eLFZD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...