Tuesday, 21 July 2020

పెద్ద పామును ఒడిసిపట్టుకున్న ‘దూకుడు’ విలన్.. టెన్షన్ వద్దంటూ దానితో కబుర్లు!

మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాలో విలన్ నాయక్ (సోనూ సూద్) తమ్ముడు బంటి పాత్రలో నటించిన నటుడు గుర్తున్నాడా? ఆయన పేరు . పలు హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్‌తో పాటు తెలుగు సినిమాల్లో నటించారు. ‘దూకుడు’ తరవాత ‘నాయక్’, ‘బాద్‌షా’, ‘హార్ట్ ఎటాక్’, ‘టెంపర్’ చిత్రాల్లో కనిపించారు. అంతేకాదు, హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 8లో పాల్గొన్నారు. ముంబైలోని బాంద్రాలో నివాసముంటోన్న అజాజ్ ఖాన్‌ జంతు ప్రేమికుడు. ముఖ్యంగా పాములంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన పాములను రక్షించే వ్యక్తితో కలిసి బంద్రాలో ఒక పామును రెస్క్యూ చేశారు. అది చాలా పెద్ద పాము. కాకపోతే విషపూరితం కాదు. పామును తాను ఒడిసిపట్టుకున్న వీడియోను అజాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పాముల కంటే మనషులు చాలా విషపూరితమని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని వీడియోలో అజాజ్ ఖాన్ అన్నారు. ‘‘మనుషులను చూసి భయపడండి, పాములను చూసి కాదు. అలాగే, వీటి ప్రాణాలను తీయకండి’’ అని అజాజ్ ఖాన్ వెల్లడించారు. పాముకు కూడా ఒక జీవితం ఉంటుందని, ఆ జీవితం ఎంతో అందంగా ఉంటుందని అన్నారు అజాజ్. ఎవరికైనా పాము కనిపిస్తే దయచేసి దాన్ని చంపవద్దని సూచించారు. పాములను రక్షించే తన మిత్రుడు అమాన్ ఫోన్ నంబర్ అందరికీ ఇస్తానని.. అతనికి ఏ సమయంలో కాల్ చేసినా వచ్చి పాములను రెస్క్యూ చేస్తాడని వెల్లడించారు. అంతేకాదు, కాపాడిన పామును తన చేతులతో పట్టుకుని టెన్షన్ వద్దంటూ దానితో ఊసులాడారు అజాజ్. బయట కరోనా ఉందని త్వరగా అడవిలోకి వెళ్లిపో అంటూ దానికి చెప్పారు. Also Read: కాగా, 10 రోజుల క్రితం అజాజ్ స్వయంగా ఒక పామును కాపాడారు. ఒక చిన్న పామును తన చేతిపై పెట్టుకుని ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన బిల్డింగ్‌లోనే ఈ పామును రక్షించానని.. దయచేసి పాములను ఎవరూ చంపవద్దని రిక్వెస్ట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39enCKq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...