Thursday 30 July 2020

షాకింగ్.. అదృశ్యమైన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్! యువ నటుడి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అతనిది హత్య కాదు ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ.. ఈ ఆత్మహత్య వెనుక కారణాలేంటి? ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మాజీ ప్రియురాలు సడెన్‌గా అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి.. ఆయన పలుమార్లు రియాకు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఆమెను కీలకమైన వ్యక్తిగా తీసుకొని పలుమార్లు విచారిస్తున్నారు పోలీసులు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి మోసం చేసిందని బిహార్‌‌లోని పాట్నాలో ఉంటోన్న ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికంగా సుశాంత్‌ను రియా వాడుకుందని, మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశారు. గతేడాది ఓ అజ్ఞాత వ్యక్తికి రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని, ఇందులో రియా పాత్ర కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పాట్నా పోలీసులు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also Read: ఈ నేపథ్యంలో రియాను నేరుగా విచారించేందుకు బీహార్ పోలీసులు ముంబైలో దిగారట. ముంబైలో ఉన్న ఆమె నివాసానికి వెళ్లగా, ఆమె అక్కడ కనిపించలేదట. పోలీసులు రావడానికి ముందే ఆమె తన ఇంటి నుంచి అదృశ్యమైట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సుశాంత్ సూసైడ్ కేసులో రియా పాత్రపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 40 మందిని ముంబై పోలీసులు విచారించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ రెండు వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రియా చక్రవర్తి అభ్యర్థించింది. అదేవిధంగా తనపై పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XcPSs2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...