Thursday 30 July 2020

మహేష్ ఫస్ట్ మూవీకి 21 ఏళ్లు: ఆశ్చర్యపోయిన ప్రిన్స్.. ఎన్నో మధుర జ్ఞాపకాలన్న దర్శకేంద్రుడు

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన .. ‘రాజకుమారుడు’ సినిమాతో సోలో హీరోగా పరిచయమయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగులు రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేటికి సరిగ్గా 21 ఏళ్ల క్రితం 1999 జులై 30న విడుదలైంది. Also Read: ‘రాజకుమారుడు’ సినిమా 21 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 21 ఇయర్స్ స్పెషల్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘‘21 ఏళ్లా.. ఎలా. నా తొలి సినిమాను ఎంతో ప్రత్యేకంగా మలిచిన రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు. అనుభవం నుంచి నేను నేర్చుకున్న విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. మీతో, మన అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం’’ అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాఘవేంద్రరావు, ప్రీతి జింటాతో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను మహేష్ తన ట్వీట్‌లో పొందుపరిచారు. అలాగే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ‘రాజకుమారుడు’ సినిమాను గుర్తుచేసుకున్నారు. ‘‘రాజకుమారుడుకి 21 వసంతాలు.. ఎన్నో మధుర జ్ఞాపకాలు.. మా అశ్వినీదత్‌కి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. అంతేకాదు.. తనతో, సూపర్ స్టార్ కృష్ణతో, అశ్వనీదత్‌తో, ప్రీతి జింటాతో మహేష్ కలిసి ఉన్న ఫొటోలను ట్వీట్‌లో పొందుపరిచారు రాఘవేంద్రరావు. కాగా, ‘రాజకుమారుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సినిమా ఆల్బమ్ అంత కన్నా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. అయితే, తొలిరోజు షూటింగ్ ‘గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది’ పాటతో మొదలైంది. ఈ పాటలోని ఒక షాట్‌ను తొలిరోజు మహేష్ బాబు, ప్రీతీ జింటాలపై జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్‌లో తీశారు. తొలిరోజు షూటింగ్‌కు సూపర్ స్టార్ కృష్ణ సెట్‌కి విచ్చేశారు. రాజు సుందరం ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/338TsHJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...