Wednesday, 22 July 2020

ఆమె తొడపై గాజు గ్లాస్.. పరాన్నజీవి పోస్టర్‌తో వర్మకి పవన్ ఫ్యాన్స్ కౌంటర్

వర్సెస్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ వింత జీవి ఆర్జీవీ ‘పవర్ స్టార్’ సినిమా తెరకెక్కిస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘పరాన్నజీవి’ అంటూ వర్మపైనే సినిమాని తీస్తున్నారు. ఏ రోజైతే వర్మ ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ చేస్తానన్నారో అదే రోజు జూలై 25న ‘పరాన్నజీవి’ సినిమాను ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు పవన్ అభిమానులు. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, పవన్ కళ్యాణ్ భక్తుడు నూతన్ నాయుడు ఈ ‘పరాన్న జీవి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీ ట్రైలర్‌ను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. రెక్‌లెస్ జెనిటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్. పవన్ అభిమాని, జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ వర్మ పాత్రను చేస్తుండగా.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో వర్మపై ఓ రేంజ్ సెటైర్లు పేలాయి. 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ నిర్మాత. ఈరోజు (జూలై 22) ఉదయం 11 గంటలకు ఆర్జీవీ ‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా.. దీనికి పోటీగా పరాన్నజీవి పోస్టర్స్, సాంగ్స్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో యవతి తొడపై మందు గ్లాస్ పెట్టి.. వర్మ (షకలక శంకర్) టేక్ చెప్పే పోస్టర్‌ను విడుదల చేశారు. మొత్తానికి వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య వార్ పరాన్న జీవి వర్సెస్ పవర్ స్టార్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CQRwbD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...