Wednesday, 22 July 2020

‘డర్టీ హరి’ ఫస్ట్ సాంగ్: పూర్తి వీడియో పాటతో ఎం.ఎస్.రాజు సర్‌ప్రైజ్.. లెట్స్ మేక్ లవ్!

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘డర్టీ హరి’. హైదరాబాద్ కుర్రాడు శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాస్త ఎక్కువగానే రొమాన్స్ డోస్‌ను మిక్స్ చేసి ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. సునీల్ వాయిస్ ఓవర్ ఈ ట్రైలర్‌కు మరో ప్లస్. ఈ హాట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికి ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర ప్రచారంలో భాగంగా తొలి పాట ‘లెట్స్ మేక్ లవ్’ను విడుదల చేస్తున్నారు. పూర్తి వీడియో పాటను ఈనెల 24న విడుదల చేస్తూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు సమర్పకులు గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్. Also Read: ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన మా ‘డర్టీ హరి’ ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. రొటీన్‌కి భిన్నంగా ప్రయత్నిస్తున్న మా డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్‌ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ చిత్రంలోని మొదటి పాట ‘లెట్స్ మేక్ లవ్’ పూర్తి వీడియోతో ఈ నెల 24న మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ముఖ్య పాత్రలను పోషించారు. మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూర్చారు. ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. జునైద్ సిద్ధిఖి ఎడిటర్. రచన, దర్శకత్వం ఎం.ఎస్.రాజు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EbCtdr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...