Sunday, 15 March 2020

PSPK 27: పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ లుక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. వాటిలో ఒకటి రాజకీయం.. రెండోది సినిమా. రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయంగా బిజీ అయిపోయిన జనసేనాని.. మళ్లీ ఇప్పుడు ముఖానికి రంగు వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఒకేసారి మూడు సినిమాలను అంగీకరించారు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లిపోయాయి. అందులో ఒక సినిమా ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాపై ఇప్పటికే బోలెడన్ని కథనాలు వచ్చాయి. ఇది పీరియాడిక్ డ్రామా అని.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని అన్నారు. తెలంగాణ చరిత్రలో మరుగున పడిపోయిన ఓ వీరుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరిగింది. వీటిలో నిజమెంతో తెలీదు కానీ.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ పిక్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు ఊతమిస్తోంది. ఈ పిక్‌లో పవన్ కళ్యాణ్ నుదిటిన పొడవాటి ఎర్ర బొట్టు పెట్టుకుని ఉన్నారు. ఆయన కళ్లు కూడా గంభీరంగా చూస్తున్నాయి. దీంతో ఇది పీరియాడిక్ సినిమానే అనే నిర్ధారణకు ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. చడీచప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెడితే.. తొలిరోజే పవన్ కళ్యాణ్ లుక్ లీకైంది. ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లే ఆ లుక్‌ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో టైటిల్ పోస్టర్‌లో ఆ లుక్‌నే పెట్టేశారు. ఇప్పుడు క్రిష్ సినిమా నుంచి లీకైన ఈ పిక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. మొదటిసారి పవన్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులందరిలో ఆసక్తి నెలకొంది. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QgRbTs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...