Sunday, 15 March 2020

ఫొటోషూట్లు చేస్తోన్న అర్జున్ కూతురు.. టాలీవుడ్ ఎంట్రీ ఖాయమేనా?

సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమీకాదు. స్టార్ హీరోల కొడుకులు చాలా మంది చిత్ర సీమలో అడుగుపెట్టారు. అలాగే, కొంతమంది హీరోల కుమార్తెలు సైతం వెండితెరపై తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కమల్ హాసన్, శరత్ కుమార్, శ్రీదేవి లాంటి స్టార్స్ కుమార్తెలు ఈ రంగంలో తమ ప్రతిభ చూపిస్తున్నారు. కమల్ కుమార్తె శృతిహాసన్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్‌ కుమార్తె తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. అర్జున్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే వెండితెరకు పరిచయమైంది. విశాల్ హీరోగా తమిళంలో వచ్చిన ‘పట్టాతు యానై’ సినిమాతో తన కెరీర్‌ను ఐశ్వర్య మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగులో ‘ధీరుడు’ పేరిట అనువాదమైంది. ఆ తరవాత ‘ప్రేమ బరహ’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది. అది కూడా కలిసిరాలేదు. ఆ తరవాత మరో తమిళ సినిమా చేసింది. అయినా ప్రయోజనం లేదు. ఈసారి ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. దీనికి తండ్రి అర్జున్ సాయం తీసుకుంటోంది. Also Read: తెలుగులో త‌న కుమార్తెని ప‌రిచ‌యం చేయాల‌ని అర్జున్ నిర్ణయించుకున్నారని ఇది వరకే వార్తలు వచ్చాయి. అందుకు ప్రయ‌త్నాలు కూడా ముమ్మరం చేశారని అన్నారు. అర్జున్‌కి తెలుగులో చాలామంది ద‌ర్శకులు, నిర్మాత‌ల‌తో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ ప‌రిచ‌యాన్ని త‌న కుమార్తె కోసం వాడుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఐశ్వర్య కూడా హైద‌రాబాద్ వ‌చ్చి కొంత‌మంది ద‌ర్శకుల్ని క‌లిసిన‌ట్టు వార్తలు వచ్చాయి. త్వర‌లోనే ఐశ్వర్య టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసేలా క‌నిపిస్తోందని కూడా అన్నారు. అయితే, తాజాగా ఐశ్వర్య అర్జున్ విడుదల చేసిన ఫొటోషూట్ ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు ఊతమిస్తోంది. ఐశ్వర్య హాట్ ఫొటోషూట్‌ను ప్రస్తుతం టాలీవుడ్‌లోని పీఆర్‌వోలు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే అనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. తెలుగు సినిమా ప్రారంభించడానికి ముందు అర్జున్ కుమార్తెగా అందరి దృష్టిని ఐశ్వర్య ఆకర్షించే పనిలో ఉన్నారట. మున్ముందు మరిన్ని ఫొటోషూట్‌లు వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఐశ్వర్యకు తొలి అవకాశం ఎవరిస్తారో.. ఏ హీరో సరసన హీరోయిన్‌గా పరిచయమవుతుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38TIAwt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...