Sunday 13 March 2022

సమంతపై బాలీవుడ్ హీరో స్పెషల్ కేర్! అందుకే ఆ ఇద్దరూ కలిశారా..?

నాగ చైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతోంది. స్నేహితులతో ఆమె టూర్స్ మొదలుకొని కెరీర్ సంగతులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. సమంతకు సంబంధించిన ప్రతి కదలికపై మీడియా వర్గాలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌ని మీట్ కావడం? ఆమెపై వరుణ్ స్పెషల్ కేర్ చూపించడంతో అసలు ఈ ఇద్దరి కలయిక ఎందుకోసమనే అంశం తెరపైకి వచ్చింది. సమంత- వరుణ్ ధావన్‌కి సంబంధించి ఓ వీడియో తెగ సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి కెమెరామెన్స్‌ని కంట్రోల్ చేస్తూ ప్రత్యేకంగా కేర్ తీసుకొని సమంతను కార్ ఎక్కించారు వరుణ్. అయితే ఈ వీడియో చూశాక సమంతకు వరుణ్ ఎస్కార్టులా మారారని పలు మీడియా సంస్థల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇద్దరి మీట్ ఇందుకోసం? అనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. వరుణ్ ధావన్‌తో కలిసి సమంత ఓ ప్రాజెక్టులో భాగం కాబోతోందట. అంతకుముందు 'ది ఫ్యామిలీ మెన్- 2' వెబ్ సిరీస్‌తో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకున్న సమంత.. మళ్ళీ ఇప్పుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతోందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయి ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుందట. రాజ్‌ అండ్‌ డీకే ద్వయం రూపొందించనున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించాలని ప్లాన్స్ చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్స్ పనులు, వర్క్‌ షాప్స్‌లో భాగంగా సమంత, వరుణ్‌ మీట్ అయ్యారని బీ టౌన్ వర్గాల సమాచారం. వెబ్ సిరీస్‌లలో తన మార్క్ కనిపించాలని సమంత ఫిక్సయిందట. అందుకే షూటింగ్‌కి ఇంతలా శ్రద్ద పెడుతోందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం సమంత స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ZjHKYgO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...