Sunday 27 February 2022

భీమ్లా నాయ‌క్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్.. పవన్‌కి దిష్టి తగలొద్దంటూ!

ప్రస్తుతం థియేటర్స్‌లో 'భీమ్లా నాయక్' మోత మోగుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. అభిమానులకు ఇది విజువల్ ట్రీట్ అని, పవన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ చూసిన పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ నటనను పొగిడేస్తుండటం ఫ్యాన్స్‌లో మరింత సంబరం నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై పృథ్వీ రాజ్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. భీమ్లా నాయక్ సినిమా చూసిన పృథ్వీ రాజ్ హీరో ప‌వ‌న్ కళ్యాణ్‌పై, ఆయన నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అది త‌న‌ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పిన పృథ్వీ రాజ్.. అప్ప‌ట్లో ఆ సినిమా చూసేందుకు తాడేపల్లి గూడెంలోని ఓ టాకీస్‌కు వెళ్లగా అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానానులు, వారిని నియంత్రించేందుకు పోలీసుల లాఠీచార్జ్‌ అన్నీ గుర్తున్నాయని, మళ్ళీ ఇప్పుడు అలాంటి సీన్ చూశానని చెప్పారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అలాంటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఉందని ఆయన అన్నారు. ఓ ప్రేక్షకుడిగా భీమ్లా నాయక్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానని పృథ్వీ రాజ్ తెలిపారు. క్లైమాక్స్‌తో పాటు రానా- పవ‌న్ కళ్యాణ్ పోటాపోటీ నటన, ఆ సీన్స్ చాలా బాగున్నాయని అన్నారు. కాకపోతే అద్భుతమైన సినిమాలో తాను భాగం కాలేకపోయాననే బాధ మాత్రమే ఉందని చెప్పిన ఆయన, పవన్ కళ్యాణ్‌కి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాన‌ని అనడం గమనార్హం. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో ఈ 'భీమ్లా నాయక్' మూవీ రూపొందింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7XcsyMA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...