Sunday 26 December 2021

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సింగర్, నటుడు (73) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన వృత్తి పరమైన జీవితంలో గాయకుడిగా పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు మాణిక్య వినాయగం. త‌మిళ‌నాడులోని మైలాడుతురైలో 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం అత‌ని మేన‌మామ‌, ప్రమఖ సింగర్ ఎస్‌ జయరామన్ వ‌ద్ద సంగీత విద్యనభ్యసించి 2001 సంవత్సరంలో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘దిల్‌’ అనే తమిళ చిత్రంతో గాయకుడిగా కెరీర్ ఆరంభించారు. అప్పటినుంచి కెరీర్ మొత్తంలో అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను మెప్పించారు మాణిక్య వినాయగం. సినిమా పాటలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా ఆలపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మైమరిపించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు మాణిక్య వినాయగం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qpJ8oA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...