Monday, 18 October 2021

Superstar Mahesh: మెగా క్యాంప్‌లోకి సూపర్‌స్టార్ మహేశ్.. దర్శకుడెవరంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మెగా క్యాంప్‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అస‌లేంటనే వివ‌రాల్లోకెళ్తే.. మ‌హేశ్ త్వ‌ర‌లోనే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో అల్లు అర‌వింద్ నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు రావ‌డ‌మే అందుకు కార‌ణం. స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తూనే లో బ‌డ్జెట్ మూవీస్ చేస్తూ హిట్స్ సాధిస్తోన్న నిర్మాత అల్లు అర‌వింద్, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. అది త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చ‌నుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మ‌హేశ్ స‌ర్కారువారిపాట సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాని త‌ర్వాత రాజ‌మౌళి సినిమాను స్టార్ట్ చేయ‌డం కంటే ముందే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి మ‌హేశ్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. స‌ర్కారువారి పాట సినిమా విషయానికి వ‌స్తే.. లేటెస్ట్ షెడ్యూల్ యూర‌ప్‌లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చి త్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C9c5dj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...