Monday, 18 October 2021

Akhil Akkineni: అభిమానిని క‌ల‌వ‌బోతున్న‘అయ్య‌గారు’.. అఖిల్ అక్కినేని!

సోష‌ల్ మీడియా ఎక్కువైన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కెమెరాల ముందు కొంద‌రు అభిమానులు చేసే హ‌డావుడి మామూలుగా ఉండ‌టం లేదు. తెలిసి చేస్తారో లేక తెలియ‌క చేస్తారో మ‌న‌కు తెలియ‌దుగానీ.. స‌ద‌రు ఫ్యాన్‌కి మాత్రం ఓ గుర్తింపు దొరుకుతుంది. అలా అఖిల్ అక్కినేనిపేరు చెప్ప‌గానే ఓ ఫ్యాన్ మాత్రం అంద‌రికీ గుర్తుస్తాడు. అత‌ని పేరేమిటో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే ఆయ‌న వ‌ల్ల హీరో అఖిల్‌కు ఇండ‌స్ట్రీలో ‘అయ్య‌గారు’ అనే నిక్ నేమ్ వ‌చ్చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. అఖిల్ హీరోగా చేసిన రెండో సినిమా ‘హ‌లో’. ఈ సినిమా రిలీజ్ రోజున ఓ అభిమాని మీడియాతో మాట్లాడుతూ ‘కింగ్ కొడుకొచ్చాడు. అయ్య‌గారొచ్చారు.. అయ్య‌గారే నెంబ‌ర్ వ‌న్’ అంటూ కెమెరాల ముందు ర‌చ్చ చేశాడు. దీంతో ఇక సోష‌ల్ మీడియా ఊరుకుంటుందా? అత‌న్ని పెట్టుకుని తెగ మీమ్స్ చేసే పాపులర్ చేసేసింది. అప్పటి నుంచి అఖిల్‌కి ‘అయ్య‌గారు’ అనే పదం నిక్ నేమ్ అయ్యింది. అయ్యగారు పదం సినీ సెలబ్రిటీలకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ఎంత‌లా అంటే త‌న సినిమాలో అఖిలే ‘అయ్య‌గారు’ అనే ప‌దం వాడుకునేంత‌లా. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’లో పూజా హెగ్డేతో ‘అయ్య‌గారూ! న‌న్ను పెళ్లి చేసుకుంటారా? ’అని డైలాగ్ చెప్పించారు. ఈ డైలాగ్ గురించి అఖిల్‌ను ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో అడిగిన‌ప్పుడు స‌ద‌రు అభిమానిని తాను క‌ల‌వాల‌ని అనుకుంటున్నాన‌న్నాడీ అక్కినేని యువ హీరో. న‌న్ను ఆ ఫ్యాన్ ‘అయ్య‌గారు’ పిలవ‌గానే నాకంటే అత‌నే ఎక్కువ పాపుల‌ర్ అయిపోయాడు. అందుక‌నే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’లో ఆ డైలాగ్‌ను పెట్టాం. అత‌న్ని క‌ల‌వాల‌ని అనుకుంటున్నాను. త్వ‌ర‌లోనే క‌లుస్తా అన్నాడు అఖిల్‌. ఇది నిజంగా అయ్యగారు అభిమానికి మంచి గుర్తింపే క‌దా మ‌రి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jdXVAa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...