Tuesday, 19 October 2021

Ram Charan - Akhil: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’కు రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు

అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంత‌మైన టాక్ తెచ్చుకుని మంచి వసూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. ప్రేక్ష‌కాభిమానులే కాదు, సినీ సెల‌బ్రిటీలు సైతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ సినిమా బావుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌రణ్ .. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ సినిమా బావుంద‌ని యూనిట్‌ను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్‌, అఖిల్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ‘‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో విజయాన్ని సాధించిన నా సోదరుడు అఖిల్ అక్కినేనికి అభినందనలు. ఈ సినిమాలో నీ ఫెర్ఫామెన్స్ చూసి చాలా సంతోష‌మేసింది. మ‌రోసారి పూజా హెగ్డే త‌న‌దైన స్టైల్లో మెప్పించింది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, జీఏ2 పిక్చ‌ర్స్‌ల‌కు అభినంద‌న‌లు. సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేశాను’’ అని ట్వీట్ చేశారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. పెళ్లీడు వ‌య‌సు వ‌చ్చి పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి, అబ్బాయి మ‌న‌సులో ఎలాంటి ప్ర‌శ్న‌లుంటాయి. వాటిని అధిగ‌మించ‌డానికి వారెలా ప్ర‌వ‌ర్తిస్తుంటార‌నే విష‌యాన్ని అంద‌రికీ న‌చ్చేలా సినిమాటిక్ చెప్పాడు ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌. చాలా కాలం త‌ర్వాత ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కు తెలుగులో ద‌క్కిన విజ‌య‌మిది. అలాగే హీరోగానూ అఖిల్ అక్కినేనికి ద‌క్కిన తొలి విజ‌యం కూడా ఇదే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XqAdc1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...