Tuesday, 19 October 2021

Naga Chaitanya: చైత‌న్య సినిమా ఔట్‌పుట్ విష‌యంలో నిర్మాత‌ల అసంతృప్తి నిజ‌మేనా.. రీషూట్‌కు వెళుతున్నారా?

కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లైన చిత్రాల్లో నాగచైత‌న్య అక్కినేని.. ‘ల‌వ్‌స్టోరి’ మూవీతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఓవ‌ర్‌సీస్‌లోనూ ల‌వ్‌స్టోరి మూవీతో త‌న మార్కెట్ రేంజ్‌ను పెంచుకున్నాడు అక్కినేని హీరో. ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు ర‌ష్యాలో లొకేష‌న్స్ సెర్చ్‌లో ఉన్నారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా దిల్‌రాజు అండ్ టీమ్ ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించిన ఔట్‌పుట్‌ను ప‌రిశీలించార‌ట‌. అయితే వారికి కొన్ని సీన్స్ న‌చ్చ‌లేదు. దీంతో మేక‌ర్స్ ఆ స‌న్నివేశాల‌ను రీషూట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఫైన‌ల్ షెడ్యూల్‌తో పాటు రీషూట్ చేయాల్సిన స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించేలా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్‌. ఇందులో చైత‌న్య.. మూడు డిఫ‌రెంట్ ఏజెస్‌లో క‌నిపించ‌బోతున్నారు. అందుకు త‌గిన‌ట్లు త‌న లుక్‌ను కూడా మార్చుకున్నాడు చైత‌న్య‌. మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అవికాగోర్‌, మాళ‌వికా నాయ‌ర్ కూడా న‌టిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. మ‌న దేశంలో మూలాలు ఉండి, విదేశాల్లో సెటిల్ అయిన చైత‌న్య.. త‌న మూలాలను వెతుక్కుంటూ ఇండియాకు వ‌స్తాడు. ఈ క్ర‌మంలో అత‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నేదే థాంక్యూ సినిమా అని వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pnVWNc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...