Monday, 18 October 2021

Prabhas - Salaar: ప్రభాస్ ‘సలార్’కు లీకేజీ వీరుల షాక్... నిర్మాతలకు తలనొప్పి

పాన్ ఇండియా స్టార్ కథానాయకుడిగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ప్ర‌భాస్ పుట్టిన‌రోజున ఈ సినిమా నుంచి ఏదైనా లుక్ లేదా టీజ‌ర్ రూపంలో అభిమానుల‌కు మేక‌ర్స్ ఏమైనా ట్రీట్ ఇస్తారేమోన‌ని అంద‌రూ భావించారు. అయితే అంత కంటే ముందే లీకేజీ వీరులు లొకేష‌న్‌లో చిత్రీక‌రించిన వీడియోను ఆన్ లైన్‌లో లీక్ చేసి ‘స‌లార్‌’ నిర్మాత‌ల‌కు షాకిచ్చారు. ‘స‌లార్‌’ మూవీ షూటింగ్ జ‌రుగుత‌న్న‌ప్ప‌టి నుంచి సినిమాకు సంబంధించిన ఫొటోలు, చిన్న చిన్న వీడియోలు లీక్ అవుతూ వ‌స్తున్నాయి. ఈ లీకేజీని ఎలా ఆపాలో తెలియ‌క మేక‌ర్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అంత‌లోనే మ‌రో వీడియో లీక్ కావ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘స‌లార్‌’లో ఇద్ద‌రు హీరోయిన్స్ నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ న‌టిస్తుంటే, సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి దీక్షిత్ క‌నిపించ‌నుంది. సాధార‌ణంగా ఈయ‌న సినిమాల్లో హీరోయిన్స్‌కు పెద్ద‌గా ఆస్కారం ఉండ‌దు. శ్రుతిహాస‌న్ పాత్ర‌కే ఎలాంటి ప్రాధాన్యం ఉండ‌క‌పోవ‌చ్చున‌ని సినీ విశ్లేష‌కుల వాద‌న‌. మ‌రిప్పుడు మీనాక్షీ చౌద‌రి పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్య‌ముంటుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. కె.జి.య‌ఫ్ చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న స‌లార్‌ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. కానీ అదే రోజున కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్ 2 సినిమా విడుద‌ల‌వుతుంది. దీంతో స‌లార్ రిలీజ్ డేట్ మార‌డం ఫిక్స్ అని తెలిసింది. ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన స్టైల్లో ఈ సినిమాను యాక్ష‌న్ మూవీగా ఆవిష్క‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pgoOHq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...