Tuesday, 24 August 2021

YSRCP నాకు డబ్బులు ఇచ్చిన మాట నిజమే కానీ.. అది ఎప్పుడంటే: శ్రీరెడ్డి గుట్టు విప్పింది

స్మాల్ గ్యాప్ తరువాత వివాదాస్పద నటి మళ్లీ విజృంభిస్తోంది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె వరుస ఇంటర్వ్యూలతో చెలరేగుతోంది. రీసెంట్‌గా శ్రీరెడ్డి అనారోగ్యం పాలైందని.. కరోనా సోకి ఆసుపత్రి పాలైందని పుకార్లు రాగా.. వాటన్నింటపై స్పందిస్తూ ‘సమయం తెలుగు’కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్న శ్రీరెడ్డి.. పలువురుపై మండిపడింది. యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టిన శ్రీరెడ్డికి అక్కడ జరిగిన అవమానాలు ఏంటి?? సాక్షి ఛానల్ నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఏంటి?? అక్కడ శ్రీరెడ్డి పగసాధించి బయటకు పంపిన ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు? ఆమెతో ఈమెకు ఉన్న గొడవలు ఏంటి? తదితర విషయాలతో పాటు.. తనకి వార్నింగ్‌లు ఇస్తున్న కరాటే కళ్యాణికి గట్టి కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. పచ్చిబూతులో రెచ్చిపోయి.. ఆమె బండారం మొత్తం బయటపెట్టింది ఈ ఇంటర్వ్యూలో. ఇక శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. దారులు మూసుకుని పోవడానికి కారణాలు ఏంటి?? ఎవరు ఈమెను వ్యతిరేకిస్తున్నారు? రఘరామ రాజు ఇష్యూలో జరిగిన అసలు నిజం ఏంటి?? వైసీపీ ప్రభుత్వం ప్రతినెల శ్రీరెడ్డి డబ్బులు ఇచ్చి.. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లని తిట్టిస్తున్నారా? వంటి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చింది శ్రీరెడ్డి. అయితే నెల నెల వైసీపీ పార్టీ డబ్బులు ఇస్తుందంటూ వస్తున్న రూమర్లను ఖండించిన శ్రీరెడ్డి.. ‘వాళ్లు డబ్బులు ఇచ్చిన మాట వాస్తమే కానీ.. అది ఇప్పుడు కాదు.. నేను సాక్షి ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్నప్పుడు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. పూర్తి ఇంటర్వ్యూ రేపు (ఆగష్టు 25 సాయంత్రం 7 గంటలకు) ప్రసారం కానుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wn4MyT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...