Monday 30 August 2021

Vijayashantiని అందుకే తొక్కేశారు.. ఆమెను ‘మా’ బ్యాన్ చేసింది : సీవీఎల్ నరసింహారావు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మా అధ్యక్ష పీఠానికి పోటీ పడే వారి సంఖ్య ఎంతకు చేరిందో అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావులు అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించేశారు. వీరిలో ప్రకాష్ రాజ్ అందరికంటే ముందున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించేశారు. ఇక మంచు విష్ణు అయితే మా బిల్డింగ్ తానే కట్టేస్తానంటూ వీడియోలు కూడా వదులుతున్నారు. నరేష్ మీద, ‘మా’ మీద ఆరోపణలు చేసిందని హేమకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. తెలంగాణ నుంచి మా సంస్థకు అధ్యక్షుడు కావాలని సీవీఎల్ నరసింహారావు తన గొంతును లేవనెత్తారు. సినిమా పరిశ్రమంలో తెలంగాణ వాదాన్ని రగిల్చేందుకు సీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీవీఎల్ ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలు, మా ఎన్నికల వ్యవహారాలపై నోరు విప్పారు. విభజన చట్టం గురించి చెబుతూ.. ఎన్నో విషయాలను బయటపెట్టేశారు. చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి సీవీఎల్ మాట్లాడారు. పద్మాలయ, రాఘవేంద్ర రావు స్టూడియోల్లోనూ తెలంగాణకు భాగస్వామ్యం ఉందని అన్నారు. సినిమా అభివృద్ది కోసం వాటిని ఇచ్చారు..కానీ ఇప్పుడు అవి రియల్ ఎస్టేట్‌లుగా మారిపోయాయని సీవీఎల్ అన్నారు. ఇక తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేస్తోందనే కారణంతోనే విజయశాంతిని ‘మా’ బ్యాన్ చేసిందని, ఇప్పటికి కూడా ఆమె ‘మా’లో సభ్యురాలు కాదని, ఆమెను తొక్కేశారని సీవీఎల్ అన్నారు. లాంటి గొప్ప నటి ఇప్పుడెవరైనా ఉన్నారా? ఆమెలాంటి నటించగల హీరోయిన్ ఉందా? ప్రతిఘటన, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు చేయగలరా? అని సీవీఎల్ ప్రశ్నించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jqFM2g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...