Sunday, 22 August 2021

TUCK JAGADISH: ఇన్ని రోజులు ఆగాము.. అందుకే.. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం: నిర్మాణ సంస్థ

హీరో నటించిన లేటెస్ట్ సినిమా ‘’. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా విడదల ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి ఈ సినిమా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. కానీ, ఎంతకాలం అయినా.. ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ, ఈ అంచనాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ రీసెంట్‌గా ప్రకటించింది. దీంతో థియేటర్ యాజమాన్యాలు హీరో నానిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాని సినిమాలు ఇకపై థియేటర్‌లలో విడుదల చేయము అంటూ వాళ్లు కామెంట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ దీనిపై వివరణ ఇచ్చారు. తమ సంఘం దీనిపై సమావేశం అయిందని.. అయితే తమ సెక్రటరీ సినిమాను వాయిదా వేయాలో.. లేక విడుదల తేదీని వాయిదా వేసుకోవాలనే కోరారు అని.. అంతే కానీ, తాము ఎవరికి వ్యతిరేకం కాదని.. స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంపై ‘టక్‌ జగదీష్’ యూనిట్ వివరణ ఇచ్చింది. రెండున్నర సంవత్సరాల క్రితం తమ సినిమా మొదలు అయిందని.. ఇప్పటికే చాలాసార్లు తమ సినిమా వాయిదాపడింది.. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకున్నాము అంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఓటీటీ బాటపట్టాము అని వాళ్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకొనే ముందే హీరో నానితో కూడా సంప్రదింపులు జరిపాము అని.. అయితే ఆయన తొలుత థియేటర్ రిలీజ్‌కే మొగ్గు చూపారు కానీ.. నిర్మాణ సంస్థ పడుతున్న ఇబ్బందులు చూసి ఓటీటీ రిలీజ్‌‌కి ఓకే అన్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sAVlrn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...