Sunday, 22 August 2021

కేజీఎఫ్ చాప్టర్- 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ మూవీ అధికారిక ప్రకటనతో ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్!

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది 'కేజీఎఫ్' మూవీ. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ మూవీ. యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు యావత్ సినీ లోకం ఫిదా అయింది. దీంతో ఈ సినిమాను మించి ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా షూటింగ్ వాయిదాలు పడటంతో రిలీజ్ డేట్స్ కూడా వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే అదే 2022 ఏప్రిల్ 14న ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ కూడా ఉండటంతో జనాల్లో అనుమానాలు నెలకొన్నాయి. దీన్నిబట్టి ప్రభాస్ 'సలార్' వాయిదా పడ్డట్లే అనే టాక్ మొదలైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3moav24
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...